B

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
b.c.g. vaccine బి.సి.జి. టీకా
babbler వాచాలుడు
babbling కేరింత
baby (చంటి)బిడ్డ, శిశువు
baby dipper సప్తర్షిమండలం
bachelor బ్రహ్మచారి
bacillus దండాణు
bacillus. acidfast ఆమ్లనిరోధక దండాణు
bacillus. leprae కుష్టు దండాణు
bacillus. typhosus టైఫాయిడ్ దండాణు
back adj వెనక; ముందు adv వెనక, బదులుగా, మౡ n వీపు, వెనకవైపు v మద్దతిచ్చు, ప్రోత్సహించు, సమర్థించు, వెనకపీటీన రాయు, బరాతపు చీటీన మఌంచు
at the back of వెనక, గూఢంగా, రహస్యంగా
back out మాట తప్పు
behind one’s back వెనక, పరోక్షంగా, తెలియకుండా
fall back వెనకకు మరలు, తగ్గు
backadation/backwardation ఆలస్య ప్రతిఫలం; ధరలు తగ్గినప్పుడు సరకుల అప్పగింతను వాయిదా వేసినందుకు చెల్లించే ప్రతిఫలం
back-biter చాడీకోరు, చాటున నిందించే వ్యక్తి
back biting చాడీలు చెప్పటం, వెన్నుపోటు పొడవటం
back-bond (జామీనుదారుకిచ్చే) రక్షణపత్రం
back bone వెన్నెముక; బలం, ముఖ్యాధారం
back-dated ticket (raliway) చెల్లని (రైలు) టికెట్టు
back-door adj దొడ్డిదారిన, దొంగదారిన n దొడ్డిదారి, దిడ్డిదారి, దొంగదారి
back drop నేపథ్యం, పూర్వావస్థ, పూర్వరంగం
backed note (ఓడకు) ఎగుమతి చీటి
back formation సామ్యమూలక నిర్మాణం
background నేపథ్యం, పూర్వరంగం, పృష్టభూమి; ప్రాతిపదిక; సందర్భం
back-ground music నేపథ్యసంగీతం
backing (పై) హామీ; ప్రోత్సాహం, మద్దతు
backrest ఆనుడు (బల్ల, మొ.)
backslide వెనకకు జారు; స్వధర్మ భ్రష్టుడగు
back vowel కంఠ్యాచ్చు, అంత్యాచ్చు, వర్తులీకృతాచ్చు; కంఠ్యస్వరం
backward adj వెనుదిరిగిన, వెనకబడ్డ adv వెనకబడ్డ
backward classes వెనకబడ్డ తరగతులు
backwardness. mental బుద్ధిమాంద్యం
backward tribes వెనకబడ్డ జాతులు
backwaters ఉప్పునీటి కయ్యలు
backyard పెరడు, దొడ్డి
bacteraemia జీవాణుక్రిమి రక్తత
bactereological warfare క్రిమియుద్ధం
bactericidal జీవాణుక్రిమి సంహారక(కం)
bactericide జీవాణుక్రిమి సంహారిణి
bacteriologist జీవాణుక్రిమి విజ్ఞాని; సూక్ష్మజీవ శాస్త్రజ్ఞుడు
bacteriology జీవాణుక్రిమిశాస్త్రం; సూక్ష్మజీవశాస్త్రం
bacteriostatic క్రిమినిరోధక; జీవాణుక్రిమి స్తంభక
bacterium సూక్ష్మజీవి, సూక్ష్మక్రిమి; జీవాణు సూక్ష్మక్రిమి
bad చెడ్డ, పాడైన
bad blood వైషమ్యం, దుర్భావం
bad conductor మందవాహకం, అధమ వాహకం
bad debt రాని/పారు బాకీ, రాని పద్దు, పోపద్దు
bad in law చట్టవిరుద్ధం, శాసనవిరుద్ధం
badge చిహ్నం, గుర్తు, బాడ్జి
badly చెడుగా, చెడ్డగా
baffling భంగపడే, భంగపుచ్చే, గాభరాపెట్టే; వ్యర్థమైన
bag సంచి, తిత్తి; వేటాడి చంపు
bag ice మంచుగడ్డ సంచి
bag sand ఇసక సంచి
bagasse చెరుకు పిప్పి
baggage సామాను; మూట
bail n జామీను, జమానత్, బెయిలు v జామీను మీద విడుదలచేయు
bail bond జామీనుపత్రం
bailable జామీ నివ్వదగిన
bailee జామీనుదారు
bailiff జమానత్దారు; ప్రాంతీయ న్యాయోద్యోగి; కోర్టు అమీనా
bailment ప్రతిబాధ్య నిక్షేపం
bailor ప్రతిబాధ్య నిక్షేపకుడు
bait n ఎర, ప్రలోభం; లాలూచీ v ఎరపెట్టు, ప్రలోభపెట్టు; లాలూచీపడు
balance n (ఖాతా) నిలువ, శేషం; సమతౌల్యం; తాసు, తక్కెడ v తూనిక వేయు; సమానీ కరించు, సరిపరచు; సమదృష్టితో చూచు
balance acid-base ఆమ్ల క్షార సమత్వం
balance of payments చెల్లింపులమధ్య భేదం, చెల్లింపుల శేషం
balance of power ప్రాబల్య సమతౌల్యం, సమప్రాబల్యం
balance of trade వ్యాపారశేషం, ఎగుమతి దిగుమతుల మధ్య భేదం/హెచ్చుతగ్గులు
balance sheet ఆస్తి అప్పుల పట్టీ
balance. water జలసమత్వం
balanced సంతులిత, సరితూగే
balanced budget సంతులిత బడ్జెట్
balanced diet సంతులితాహారం
balanced perspective సంతులిత దృక్పథం
balancing సరితూచే; సమీకరణ
balancing load సరితూగే బరువు, సమతౌల్య భారం
balanitis శిశ్నాగ్రం వాపు
balcony బాల్కనీ, మేలుకట్టు
bald కేశరహిత; నిస్సార; స్పష్ట, బహిరంగమైన
baldness బోడితనం; బట్టతల
bale కట్టు, బస్తా, బేలు
bale out తోడు; దూకు
balk n తప్పు, పొరపాటు; అడ్డంకి, ఓటమి; నిరుత్సాహం v ఆగు, (అర్ధాంతరంగా) ఆపు
ball బంతి
ballad వీరగాథ, (జానపద)గేయం
ballast n కంకర; పడికట్టు బరువు; (నౌకల్లో) స్థైర్య భారం, తూకపు బరువు (ఓడ అడుగున వేసే బరువు) v బరువు నెత్తు; (సామాను/సరుకు) నింపు
ballastage తూకపు బరువు; సుంకం
ballerina నర్తకి
ballistic గతిశీల, క్షేపక
ballistics క్షేపణశాస్త్రం
balloon గుమ్మటం; బుడగ
balloonist బెలూన్ ప్రయాణికుడు/చోదకుడు
ballot n బాలెట్పత్రం; రహస్య వోటింగ్ చీటీ; రహస్య వోటింగ్ v వోటువేయు, చీట్లు వేయు
ballot box బాలెట్ పెట్టె
ballot paper బాలెట్ పత్రం
ballyhoo పెద్దఎత్తు / తిరుగులేని ప్రచారం
ballyrag వేధించు, పీడించు, బాధించు
balm (సుగంధ) తైలం
balsam నీలిగోరింట
baluster మేలుకట్టు/బాల్కనీ స్తంభం
balustrade దన్ను(లు), సపోర్టు(లు)
bamboozle ఆశ్చర్యపరచు; మభ్యపెట్టు, మోసగించు
bambusa arundinaie వెదురు
bambusa stricta సాదనం
ban n నిషేధం, నిషేధాజ్ఞ; ప్రతిబంధకం v నిషేధించు; ప్రతిషేధించు
banal సామాన్య, సాధారణ
band దళం, మూక, గుంపు, ముఠా; పటాకా, బంధనం; సరంగులు
bandage నాడా, పట్టీ; కట్టు
bandage compression అణచిన/నొక్కిన కట్టు
bandage many tailed పట్టీల కట్టు
bandage roller చుట్టిన కట్టు
bandage suspensory వేలాడే కట్టు
bandaging కట్టు కట్టడం
banderole జెండా గుడ్డ
bandit బందిపోటు (దొంగ)
bandy బండి; విసరివేయు, తిప్పికొట్టు; ఇచ్చి పుచ్చుకొను
bane విషం; నాశ(నం), చావు; చంపు, నశింపజేయు
bang n గట్టిదెబ్బ, మోత v మోదు, బాదు; పొడుచు
bangle గాజు(లు)
banish బహిష్కరించు, వెళ్ళగొట్టు; దేశభ్రష్టుని చేయు
banishment (దేశ) బహిష్కరణ/బహిష్కారం
bank బ్యాంకు; ఒడ్డు; ఆనకట్ట
bank apex ఉన్నత సహకార బ్యాంకు
bank commercial వాణిజ్య బ్యాంకు
bank co-operative సహకార బ్యాంకు
bank exchange వినిమయ బ్యాంకు
bank indigenous దేశీయ బ్యాంకు
bank industrial పారిశ్రామిక బ్యాంకు
bank note బ్యాంకు నోటు
bank non-scheduled నాన్ షెడ్యూల్డ్ బ్యాంకు
bank rate బ్యాంకు ధర
bank return బ్యాంకు జమాఖర్చుల పట్టీ
bank scheduled షెడ్యూల్డ్ బ్యాంకు
bankable బ్యాంకులో ఉంచదగ్గ
banker బ్యాంకర్, బ్యాంకు నిర్వాహకుడు/వ్యవహర్త
banking బ్యాంకింగ్; బ్యాంకు నిర్వహణ/వ్యవహారం
bankrupt దివాలాకోరు
bankruptcy దివాలా
banner పతాక, ధ్వజం
banner headline (streamer) పతాకశీర్షిక
banquet విందు
banter చమత్కారం, పరిహాస (ప్రసంగం)
banyan మర్రి
baptism (క్రైస్తవ) మతస్నానం
baptize (క్రైస్తవ) మతదీక్షనిచ్చు
bar n న్యాయవాది సంఘం; న్యాయస్థానం; ఆటంకం, అడ్డంకి, ప్రతిబంధకం; దండం v ఆటంకపరచు, అడ్డుపడు, నిరోధించు, అవరోధించు
at the bar of public opinion ప్రజాభిప్రాయం ప్రకారం, ప్రజల ఎదుట
bar council న్యాయవాది సమాఖ్య
bar-graph దండ రేఖాచిత్రం
bar-magnet దండాయస్కాంతం
be called to the bar న్యాయవాది అగు
be called to the bar of the legisl విధానసభ విచారణకు రప్పించు/తెచ్చు
barbarian ఆటవిక, క్రూర; ఆటవికుడు, క్రూరుడు
barbaric ఆటవిక; క్రూర; అనాగరక
barbarious ఆటవిక, అనాగరక
barbarism ఆటవికత, అనాగరకత
barbarity బర్బరత్వం; ఆటవికత
barbarous బర్బరులు, అనాగరకులు, క్రూరులు
barbed wire ముళ్ళ కంచె/తీగ
bare నగ్న, స్పష్ట; అచ్చమైన, కేవలమైన
bare faced సిగ్గులేని, నిర్లజ్జ
barely కేవలం; బహిరంగంగా
barest minimum కనిష్ఠం
bargain n బేరం v బేరమాడు
bargainee బేరమాడే వ్యక్తి
bargainer బేరగాడు, బేరగత్తె
bargaining బేరమాడటం
barge నావ
bargee నావికుడు
bark n (కుక్క) మొరుగుడు/అరుపు; బెరడు; చిన్నపడవ v మొరుగు, అరుచు
barley బార్లీ (గింజలు)
barn (ధాన్యం) కొట్టు, కొటారం
barograph భారలేఖిని
barometer భారమితి
baroscope భారదర్శకం
barrack బారకాసు, సేనాశిబిరం
barrage ఆనకట్ట; తీవ్రమైన దాడి
barrage of questions ప్రశ్నపరంపర
barrator దావాకోరు, వ్యాజ్యాలమారి
barred (by time) కాలదోషం (పట్టిన)
barrel పీపా
barrel-shaped పీపాలాగున్న
barren గొడ్డుమోతు, వంధ్యుడు/వంధ్యురాలు; ఫలించని; వంధ్య, బంజరు, ఊషరక్షేత్రం
barrenness వంధ్యత, నిష్ఫలత
barretry/barratry దావాకోరుతనం
barricade n ముళ్ళకంచె; అవరోధం, అడ్డంకి v దారికి అడ్డుపెట్టు; అడ్డంకి కలిగించు
barrier అడ్డు, అడ్డంకి, అడ్డుగోడ; సుంకపుగేటు
barring (out) ఆపుచేయు, అడ్డుపెట్టు
barrister బారిస్టర్, న్యాయవాది
barrow పాడె; సమాధి దిబ్బ
barter n వస్తువినిమయం; సరుకు బదలాయింపు v బదులిచ్చు; బదలాయించు; పరివర్తించు
basal ఆధారిత
basal reader ప్రథమ పాఠ్యపుస్తకం
basal science మూల/మౌలిక శాస్త్రం
basalt అగ్గిరాయి, నల్లపింగాణి
base adj నీచమైన n ఆధారం, స్థావరం; మూలం, మూలాధారం; ప్రకృతి, ప్రాతిపదిక; క్షారం v స్థాపించు; ఆధారపడు; నమ్ము
base imager మూల ప్రతిబింబకం
base map మౌలిక మానచిత్రం, ఆధార మానచిత్రం
baseless నిరాధార, ఆధారంలేని
basella బచ్చలి
bashful సలజ్జ, సిగ్గున్న
basian తొట్టి; గుంట
basic మూల, మౌలిక; ప్రాథమిక
basic adjective ప్రాథమిక విశేషణం
basic alternant ప్రాథమిక పర్యాయరూపం
basic education ప్రాథమిక ప్రాతిపదిక విద్య
basic grid ప్రాథమిక జాలీ
basic industry మౌలిక పరిశ్రమ
basicity లవణాధారకత
basin పళ్ళెం, తట్ట; హరివాణం; ద్రోణి
basin irrigation హరివాణం నీరుకట్టు
basis ఆధారం; మూలం
bask ఎండకాచుకొను; ఆనందించు
basket గంప, బుట్ట, తట్ట
basket making (basketry) బుట్టల తయారీ
bassico longifolio ఇప్ప
bass voice మంద్ర/తక్కువస్థాయి కంఠస్వరం
bast తాట
bastard జారజుడు
bastardize హీనపరచు; జారసంతానమని నిర్ణయించు
bastardy జారసంతానత్వం
bastion బురుజు
bat గబ్బిలం; బ్యాటు
batch జట్టు, దళం
bath స్నానం
bath. hip తుంటిస్నానం
bath. sponge స్పాంజి స్నానం
bathe నీట మునుగు; కడుగు; స్నానం చేయించు
baton (అధికార) దండం
battallion సేనాదళం
batten లావెక్కటం; ఊరు, తెగతిను; ఊరసొమ్ము తిను
batter నరుకు, చావుదెబ్బలు కొట్టు; కుమ్ము, పడగొట్టు
battering కుమ్మటం, చావుదెబ్బలు కొట్టటం
battery ఘటమాల, విద్యుద్ఘటం
battle యుద్ధం
battle area రణభూమి, యుద్ధరంగం
battle array యుద్ధ క్రమం/వ్యూహం
battle dress యుద్ధ వేషం/దుస్తులు
battle field రణరంగం, రణక్షేత్రం
battle formation యుద్ధవ్యూహనం
battle front యుద్ధభూమి
battle order యుద్ధవ్యూహం
give battle యుద్ధంచేయు
mock battle నకిలీ యుద్ధం
pitched battle తుములయుద్ధం
battlement ప్రాకారం
bauhinia అడ్డ (తీగ)
ba(u)lk వ్యర్థం చేయు; ఆపు, అడ్డగించు
bay అఖాతం
bayonet బయొనెట్, తుపాకికత్తి
beach n (సముద్ర) తీరం, ఒడ్డు v ఒడ్డు చేర్చు, తీరం చేర్చు
beachhead తీరప్రదేశం; నౌకాదళం ఒడ్డుచేరే చోటు
beacon దీపం, వెలుగు; పథప్రదర్శకం
beacon light సంకేతదీపం
bead పూస
beaf గోమాంసం, గొడ్డుమాంసం
beak (పక్షి) ముక్కు
beam n దండె, (కాంతి)పుంజం, దూలం v వెలుగు, ప్రకాశించు
bean చిక్కుడు
bear n ధరలు తగ్గించే దళారి v ధరలు తగ్గించు; ఎత్తు, మోయు, సహించు
bear down అణచివేయు; ముక్కు
bear on/ upon ప్రభావం చూపు, ప్రభావితం చేయు
bear out పెంచు; సమర్థించు; రుజువుచేయు
bear the brunt భారం వహించు
bring to bear అమలుపరచు
bearer వాహకుడు; అధికారి
bearing స్వభావం, వేషభాషలు; చర్య; సమర్థత, సహనం
bearing down ముక్కటం
bearings (pl) దిక్స్థితి
beast మృగం, జంతువు, పశువు; చతుష్పాత్తు
beastly పశుప్రాయ, పాశవిక
beat n దెబ్బ, మోత; (నాడీ) స్పందన; బీటుదుంప; (అధికార/సంచార) పరిధి; నలిగినదారి; ముందు ప్రచురించిన వార్త v కొట్టు, మోగు, బాదు; గెలుచు, ఓడించు
beat about the bush డొంకతిరుగుడుగా వ్యవహరించు
beat apox అగ్రస్పందన(నం)
beat a retreat త్వరగా పారిపోవు, పలాయనం చెప్పు
beat away/down/back/off పారిపోవు, పరిగెత్తు; ఓడించు; పరిగెత్తించు/పారదోలు
beat. heart హృదయస్పందన, గుండె కొట్టుకోవటం
beat of drum దండోరా, టముకు, చాటింపు
beat the bounds డోలు వాయించు
beat time ముందే చేయు; అవసరం గుర్తించు, సమయం చూచు
beating ఉతకటం; స్పందన(నం)
beating the retreat ముగింపు వేడుక
beauty సౌందర్యం, శోభ
beauty sleep తొలి/మొదటి నిద్ర
because ఎందుకంటే
become అగు, కాదగు, తగి ఉండు
bed పక్క, శయ్య, పరుపు, పడక; మెత్త, క్షేత్రం; గర్భం; పొర; మంచం
bed occupied ఆక్రమించిన పడక, రోగి ఉన్న పడక
bed plaster పిండికట్టు(తో) పడక
bed ridden మంచంపట్టిన
bed sore పడకకురుపు
bed wetting నిద్రలో మూత్రవిసర్జన
bed bug నల్లి
bedel కోర్టు అమీను, కోర్టు దూత
bedelry కోర్టు అమీను అధికారపరిధి
beding పూసల మాదిరి
bedlam గందరగోళం, గలభా; కల్లోల (ప్రదేశం), పిచ్చి ఆసుపత్రి
bedouin దేశదిమ్మరి (అరబ్బు)
bedrock ఆధారశిల, అట్టడుగు స్తరం; గట్టి పునాది
bee తుమ్మెద, భ్రమరం
bee in one’s bonnet ఆతురత, అనియంత్రిత భావాలు/ఊహలు
beeline ముక్కుసూటి (దారి)
beehive తేనెతుట్టె
beer బీరు
beesha travancoria ఉడుము
bee’s wax మైనం
beet (root) బీటుదుంప
befall జరుగు; వచ్చిపడు
before ముందు, ఎదుట; సమక్షం(లో), పూర్వం
before hand ముందే, మునుపే
befriend స్నేహం కలుపు, సాయపడు, మద్దతిచ్చు
beg వేడు, కోరు, ప్రార్థించు, ప్రాధేయపడు; బిచ్చమెత్తు, యాచించు
beget (పిల్లలను) కను
beggar బిచ్చగాడు, భిక్షుకుడు
beggary బిచ్చం, యాచన
begin మొదలుపెట్టు, ఆరంభించు, పుట్టు
beginning మొదలు, ఆరంభం, ప్రారంభం
beguile వంచించు, మోసగించు; మభ్యపెట్టు; కాలం గడుపు, కాలక్షేపం చేయు
beguilement మోసం; కాలక్షేపం
behalf బదులు, తరఫున, పక్షాన
on behalf of బదులు(గా), తరఫున
behaviour ప్రవర్తన, నడవడి
behaviour modification ప్రవర్తన సంస్కరణ
good behaviour సత్ప్రవర్తన
behavioural approach ప్రవర్తనాత్మక పద్ధతి
behaviourism ప్రవర్తనవాదం
behaviourist ప్రవర్తనవాది
behind వెనక, తదనంతరం
behind the scene తెరవెనక, పరోక్షంలో
behoove తగు, యోగ్యమగు, ఉచితమగు
being జీవి; ఉండటం
belated విలంబిత, ఆలసించిన, ఆలస్యమైన
belch తేపు
belie సమర్థించలేకపోవు; అన్యధాకరించు; తప్పుగా కనిపించు
belief నమ్మకం, విశ్వాసం
believe నమ్ము, విశ్వసించు
belittle చిన్నబుచ్చు, అవమానించు
bell గంట (కట్టు)
bell jar గంట జాడీ
bell metal కంచు
bellestic myrabolan తాండ్ర
bellicose జగడాలమారి, యుద్ధోన్ముఖ
belligerency యుద్ధం, యుద్ధావస్థ, యుద్ధ పరిస్థితి
belligerent రణతత్పర, రణాభిముఖ, యుద్ధనిమగ్న
belligerent right యుద్ధగతుల హక్కు, యుద్ధం చేస్తున్న రాజ్యాల భాగస్వామ్యం
bellow గర్జించు, గాండ్రించు; ఘోషించు, ఘోషపెట్టు
bellows కొలిమి తిత్తులు
belly పొట్ట, ఉదరం
belong చెందు, సంబంధించు; లోబడు
belongings సంభారాలు, ఆస్తులు, సామానులు
below కింద, దిగువ, అడుగున; అవర
below par అవమూల్యం
belt దట్టీ, నడికట్టు, పటకా, మేఖల; ప్రదేశం
bench బల్ల; న్యాయపీఠం, న్యాయాసనం; న్యాయమూర్తిగణం, ధర్మాసనం; న్యాయస్థానం
bench mark data ప్రారంభసమాచారం
bend n వంపు, వంకర, మలుపు v వంచు, మడుచు; లొంగదీయు
beneath కింద, దిగువ, అడుగున
be beneath యోగ్యంకాని, లాయకీకాని
benediction దీవన, ఆశీర్వాదం
benedictive ఆశీరాద్యర్థకం
benedictory మంగళప్రద, స్వస్తివాచక
benefaction దానం; మేలు; హితవు; ఉపకారం
benefactive పరస్మై (పదరూపం)
benefactor ఉపకారి, హితకారి, దాత
benefice దేవాదాయం, గుడిమాన్యం
beneficence ఉపకారం, మేలు; అనుగ్రహం, దయ, కృప; దానశీలత
beneficial లాభకారి; మేలైన; అనుకూల
beneficiary లాభానుభోక్త, లాభితుడు, ఉపకారం పొందిన వ్యక్తి
benefit n లాభం, ఫలం, హితం, ప్రయోజనం v లబ్ధి పొందు; లాభం కలిగించు, మేలు చేయు
benefit of doubt సంశయలాభం, సందేహ లాభం
Benelux బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గుల ఆర్థిక సంఘం
benevolence దయ, కనికరం; ఉపకారబుద్ధి, ఉదారత
benevolent దయగల, కనికరంగల; ఉపకారక, ఉదార; దయాళు
benevolent despotism ధార్మిక నిరంకుశత్వం
benevolent government ధర్మ/ధార్మిక ప్రభుత్వం
bengal gram సెనగ (పప్పు)
benign హిత(కారి), నిరపాయకర, దయగల, మెత్తని, కోమల; అనుకూల, శుభప్రద
benignant మంగళప్రద, దయాళు, కోమల
bent వంగిన; వంపు, మొగ్గు
bent tube వక్రనాళిక
bent upon కృతనిశ్చయంగల, స్థిరపడిన, నిర్ణీతమైన
benumb మొద్దుబారిన, మొండికెత్తిన; స్తబ్ధ, అచేతన
benzoin సాంబ్రాణి
bequeath విల్లు ద్వారా సంక్రమింపజేయు; విల్లు/దానపత్రం రాయు; వదలిపెట్టు
bequeathed (వీలునామా ప్రకారం) ప్రత్యేకించి ఇచ్చిన
bequest మరణశాసనమూలక దానం, వీలునామా ద్వారా ఇచ్చిన ఆస్తి, రిక్థం
bereave ఎడబాపు, నష్టపరచు
bereavement వియోగం; చావు, మరణం
beri-beri నంజువ్యాధి
berry మృదుఫలం
berth స్థితి, పదవి, విశ్రాంతి స్థలం; పడవ నిలిచే/లంగరుదించే చోటు/స్థలం
give wide berth to దూరంగా ఉండు; రక్షించు
beryl వైడూర్యం
beset చుట్టుముట్టు, ఆవరించు; వ్యాకులపరచు
beside పక్కన; దగ్గరలో, సమీపంలో; కట్టుబడని; ఇతర, బాహిర
besides కాక, కూడ, మరియు
besiege ముట్టడించు, చుట్టుముట్టు
besmear పూయు, చరుము
best శ్రేష్ఠ, ఉత్తమ, ఉత్కృష్ట, సర్వోత్తమ
at best ఉన్నంతలో, అధికాధికంగా
do one’s best చేయగలదంతా చేయు, సర్వప్రయత్నాలు చేయు; ఏమీ విడవని
have the best of ఉన్నంతలో ఉత్తమంగా
make the best of పూర్తిలాభం పొందు; పని జరుపుకొను
bestial పశుప్రాయ, మృగతుల్య, పాశవిక; క్రూర
bestow ఇచ్చు, ప్రసాదించు, అర్పించు
bet n పందెం v పందెం వేయు/కాయు
beta-cell బీటా కణం
betel leaf తమలపాకు
betel nut పోక (కాయ)
betimes వేళకు ముందే, మునుముందుగా; త్వరగా
betray ఢోకా ఇచ్చు, విశ్వాసఘాతం/నమ్మకద్రోహం చేయు
betrayal విశ్వాసద్రోహం, నమ్మకద్రోహం, నమక్హరామీ
betrothal ప్రధానం, నిశ్చితార్థం, పెండ్లి నిశ్చయం, బారాత్
better adj శ్రేష్ఠతరమైన, మెరుగైన v దారికి తెచ్చు, బాగుపరచు
betterment అభివృద్ధి వ్యయం
betterment levy అభివృద్ధి పన్ను
betting పందెం వేయటం, జూదం
between (రెంటి) నడుమ/మధ్య
between the devil and the deep ముందు నుయ్యి, వెనుక గొయ్యి
between two stools రెంటికీ చెడ్డ; ఎటూ తేల్చని (స్థితి)
beverage పానీయం
beverage. intoxicating మత్తుపానీయం, మాదకపానీయం
beware జాగ్రత్త/బేపరాకుగా ఉండు
bewilder కలతపరచు, కలవరపరచు, భ్రమ పుట్టించు, దిగ్భ్రమపరచు
bewildering విస్మయకారి, భ్రమదాయక
bewilderment తికమక, గాభరా; దిగ్భ్రమ, దిగ్భ్రాంతి
beyond మించి, దాటి; అవతల
bhakti cult భక్తితత్వం
biannual adj ద్వివార్షిక n ద్వివార్షికం
bias n పక్షపాతం, పాక్షికదృష్టి v పక్షపాతం కలిగించు, దురభిప్రాయం కలిగించు/పొందు
biased పక్షపాతంగల
bib చిన్నబట్ట, వస్త్రఖండం
bible క్రైస్తవ మతగ్రంథం, బైబిలు; ప్రమాణం, ప్రామాణికం
bibliographical details గ్రంథనిర్మాణ వివరాలు
bibliography (ఉపయుక్త) గ్రంథ పట్టిక
bibliophil(e) పుస్తక ప్రేమికుడు; పుస్తకాల పురుగు
bicameral ద్వంద్వశాసనం(గల); ద్విసభీయ, ద్వివిధ, రెండుసభలున్న
bicameralism ద్వంద్వశాసనసభా విధానం/పద్ధతి, సభాద్వయ విధానం
bicesps ద్విశిర
bicompound leaf ద్విభిన్న పత్రం
biconcave ద్విపుటాకారం
biconvex ద్వికుంభీయం
bicornis ద్విశృంగి
bicuspid ద్విపత్ర
bicuspid valve ద్విపత్రకవాటం
bicycle lamp సైకిల్ దీపం
bid వేలంపాట
bidder వేలందారు
bifid రెండుగా చీలిన, ద్విధావిభక్త
bifurcated రెండుగా చీలిన; రెండు పాయలైన
bifurcation (ద్విధా) విభజన
bigamy ద్విభార్యాత్వం, మారుమనువు
Big dipper సప్తర్షిమండలం
big five అగ్రరాజ్యపంచకం
bight విశాలాఖాతం
bigotry మతాంధత
bilabial ఉభయోష్ఠ్యం
bilateral ద్విపార్శ్వ, రెండువైపులా
bilateral agreement ఉభయపక్ష ఒడంబడిక
bile పిత్త (రసం), పైత్యరసం
bile duct పిత్తవాహిక
bile pigment పిత్తవర్ణం
bile salt పిత్తరస లవణం
biliary పిత్త సంబంధి
bilingual ద్విభాషి
bilingualism ద్విభాషిత; ద్విభాషావాదం
billion (బ్రిటన్లో) మిలియన్ మిలియన్లు; (అమెరికా/ఫ్రాన్సు లో) వెయ్యి మిలియన్లు
bimedial line మధ్యయోగరేఖ
bemetalism ద్విలోహ ప్రమాణ వాదం/సిద్ధాంతం
bimetallic ద్విలోహ ప్రమాణ సంబంధి
binary జంటతార; రెండుచేరిన; ద్విఖండన
binary decision ద్విఖండనపూర్వక నిర్ణయం
binary number ద్విసంఖ్య
binaural ద్వికర్ణిక
bind కట్టు, చేర్చు, బంధించు, బద్ధునిచేయు
bind down పూచీకత్తు/ముచ్చిలక తీసుకొను, బద్ధుని చేయు
bind over పూచీకత్తు తీసుకొను; అదుపులోకి తీసుకొను
binder బంధకం
binding తప్పని, విధి అయిన, అనివార్య, అవశ్య పాలనీయ
binoculars బైనాక్యులర్స్
binode ద్విపాతం
binomial ద్విపద, ద్వినామక
binormal ద్విలంబ
bio జీవసంబంధి
biocatalyst జీవోత్ప్రేరకం
bio-chemical జీవరసాయనిక
bio-chemical method జీవరసాయన పద్ధతి
bio-chemistry జీవరసాయనశాస్త్రం
biodegradation జీవాధఃకరణం
biodiversity జీవవైవిధ్యం
bio-electrical జీవవిద్యుత్సంబంధి
biogas జీవవాయువు
biogenetics జీవజన్యుశాస్త్రసంబంధి
biomass జీవద్రవ్యం
bio-physical జీవభౌతిక
bio-physics జీవభౌతిక శాస్త్రం
bio-social జీవసామాజిక
bio-social being జీవసామాజికాస్తిత్వం
biosphere జీవావరణం
bio-statistics జీవగణాంకశాస్త్రం, జీవసాంఖ్యక శాస్త్రం
bio-synthesis జీవసంశ్లేషణ
biogenesis జీవోత్పత్తి
biogeochemical cycle జీవభూరసాయన చక్రక్రియ
biography స్వీయచరిత్ర, ఆత్మకథ, జీవితచరిత్ర
biolinguistics భాషాజీవశాస్త్రం
biological జీవశాస్త్ర సంబంధి
biological naturalism జీవప్రకృతివాదం
biological oceanography సాగరజీవశాస్త్రం
biological productivity జీవోత్పాదకత
biological warfare క్రిమియుద్ధం
biologicalism జైవికవాదం
biologist జీవశాస్త్రజ్ఞుడు
biology జీవశాస్త్రం
bometric జీవపరిమాణ సంబంధి
biometry జీవపరిమాణమితి
bionomics జీవపరిసరశాస్త్రం
biopsy జీవాణుపరీక్ష
biopsychology జీవమనస్తత్వశాస్త్రం
biphasic ద్విదశాయుక్త
biplane ద్విపక్షకం
biplegia పూర్వాంగవాతం
bipolar ద్విధ్రువీయ
bipolar nerve cells ద్విధ్రువ నాడీకణాలు
biprism ద్విపట్టకం
bi-propellant ద్విచాలక
biquadratic ద్వివర్గ
biradial co-ordinate ద్వికేంద్రీకృత నిరూపకం
bird’s eye view విహంగదృష్టి; పర్యాలోకన
birth జననం, పుట్టుక, జన్మ
birth control సంతాననిరోధం, కుటుంబ నియంత్రణ
birth customs ప్రసూతి ఆచారాలు
birthday పుట్టినరోజు, జన్మదినం
birth live సజీవజననం
birth place జన్మస్థలం, జన్మభూమి
birth rate పుట్టుకరేటు, జననాల రేటు
birth right జన్మహక్కు
birth still నిర్జీవ జననం
bisect ద్విఖండన చేయు
bisected ద్విఖండిత
bisection ద్విఖండనం
bisector ద్విఖండనరేఖ
bisemy ద్వ్యర్థకత
bisexual ద్విలింగక
bisexual libido ద్వివిధకామం
bisexuality ద్విలింగకత్వం
bishop క్రైస్తవమత గురువు
bit తునక, ముక్క, అంశం, ఖండం
bit by bit ఖండశః, ముక్కలు ముక్కలుగా; మెల్లమెల్లగా; కొద్దిగా
do one’s bit తనవంతు పనిచేయు, పాల్గొను, చెయ్యగలిగినంత చేయు
bitangent ద్విస్పర్శరేఖ
bite n కాటు v కరచు, కొరుకు, కాటువేయు
bitter కఠిన, చేదైన, కటువైన; వగరు (మందు), చేదు
to the bitter end చివరివరకు, చచ్చేవరకు
bitterlook ద్వేషదృష్టి
bitterly తీవ్రంగా, కటువుగా, కఠినంగా
bitterness కటుత, తీవ్రత
bitumen శిలాజిత్తు
bivouac సేనల బయలువిడిది, స్కంధావారం
bi-weekly ద్వివాసర, వారానికి రెండుసార్లు (వెలువడే)
black adj నల్ల, చెడ్డ n నలుపు v నలుపు చేయు, నల్లబరచు
black body కాలనికాయం
black hole కాలబిలం
black lead నల్లసీసం
black leg ద్యూతజీవి, జూదం వృత్తిగాగల వ్యక్తి; సమ్మెకాలంలో పనికిపోయే కార్మికుడు
black list అనుమానాస్పదుల/వ్యవహారనిషిద్ధుల పట్టీ/జాబితా; తప్పుచేసినవారి జాబితా
black mail n బెదిరించి సంపాదించటం/తీసుకోవటం v బెదిరించి లాక్కొను
black market చీకటి బజారు, నల్లబజారు; దొంగవ్యాపారం, అక్రమ వ్యాపారం
black marketeer అక్రమ వ్యాపారి
black out (యుద్ధకాలంలో) దీపాలు తీసి వేయటం; స్మృతి పోగొట్టుకోవడం, మరచిపోవటం
black sheep కళంకి, మోసగాడు
in black and white లిఖితరూపంలో, లిఖితంగా, రాతలో
blackenned మసిపూసిన
bladder తిత్తి, మూత్రాశయం, నీరుడుతిత్తి
bladder gall పిత్తాశయం
bladder urinary మూత్రాశయం
blade పత్రభాగం
blamable నిందించదగ్గ, నిందనీయ
blame n నింద, ఆరోపణ; దూషణ v నిందించు, తప్పు మోపు, దూషించు
be to blame దోషి అగు, నిందితుడగు
blameless నిందారహిత
blameworthy నిందార్హ, దూష్య, నింద్య
bland చప్పిడి
bland diet చప్పిడి తిండి/కూడు
blank adj శూన్య, రిక్త n పట్టి(క)
blasphemous నిందాత్మక
blasphemy (దైవ/మత) దూషణ/నింద
blast n వడగాలి, వేడిగాడ్పు, గాలి విసురు, పేలుడు v పగలగొట్టు, పేల్చు, బరమాపెట్టు
blast furnace బ్లాస్ట్ కొలిమి/పేల్చే కొలిమి
blast induced vibration విస్ఫోటజనిత కంపనం
in full blast పూర్తి వేగంతో/తీవ్రతతో
blasting పేల్పు, పేలుడు; బరమాపెట్టడం
blatant కఠోర (ధ్వనిగల)
blaze n మంట, (అగ్ని) జ్వాల v భగ్గున మండు, వెలుగు, ప్రకాశించు
bleach తెల్లబరచు, రంగుపోగొట్టు; పాలిపోవు; విరంజనం
bleaching విరంజనం
bleaching powder విరంజన చూర్ణం
bleak చల్లని; నిరాధార; చలి, చల్లదనం
bleeding రక్తస్రావం, నెత్తురు కారటం
bleeding accidental ప్రామాదిక రక్తస్రావం
bleeding menstrual రజస్స్రావం
bleeding uterine గర్భాశయ రక్తస్రావం
blemish n కళంకం, మచ్చ, దోషం v కళంకితం చేయు, చెడగొట్టు
blend కలుపు, మిశ్రమం చేయు; మిశ్రపదం
blending పదును, పాకం; సమ్మిశ్రణం, మిశ్రణం
blepharitius కంటిరెప్పల శోథ
bless ఆశీర్వదించు, దీవించు
blessing ఆశీర్వాదం, ఆశీర్వచనం, దీవెన
blessing in disguise అనుకోని మేలు, ఊహించని మంచి
blind adj గుడ్డి, జ్ఞానరహిత; అంధ n గుడ్డితనం, అంధత్వం; తెర, గంత; అవివేకి v మరుగుపరచు, కంట దుమ్ముగొట్టు
blind alley బంద్గలీ, ఆగిపోయే దారి
blinding కళ్ళు చెదర్చే, జిగేలుమనే
blindness గుడ్డితనం, అంధత్వం
blindness colour వర్ణాంధత్వం
blindness night రేచీకటి
blink మిటకరించు, మిణకరించు; కన్నుగొట్టు
blinking రెప్పపాటు
blinking demon పులోముడు
blinking membrance లోపొర
bliss ఆనందం, పరమానందం, బ్రహ్మానందం
blissful ఆనందప్రద, బ్రహ్మానందకర
blister n పొక్కు, బొబ్బ v పొక్కు; అవమానించు, సిగ్గుపరచు
blister copper దుక్కరాగి
blitzkrieg మెరుపుయుద్ధం
blizzard మంచుతుఫాను, హిమపవనం, హిమవర్షం
block n అడ్డం, ప్రతిబంధకం; ప్రాంతం, ఖండం, ప్రతిరూపం; v అడ్డగించు, అడ్డుపడు
block development బ్లాకు/ప్రాంతం అభివృద్ధి
block facial ముఖతంత్రి(క)రోధ
block heart హృదయస్పందనావరోధం
block making ప్రతిరూపకల్పన
block mountains ఖండపర్వతాలు
block nerve తంత్రిరోధ, తంత్రికరోధ
blockade n దిగ్బంధం, అవరోధం/అడ్డంకి v దిగ్బంధించు; ఆపు, అవరోధించు, అడ్డు పెట్టు/పడు
raise the blockade అవరోధం/దిగ్బంధం తొలగించు
run the blockade అవరోధం/దిగ్బంధం తప్పించుకొను/అధిగమించు
blocked నిరుద్ధ, అవరుద్ధ
blocked accounts దిగ్బంధం చేసిన/నిరోధించిన ఖాతాలు
blocked capital చిక్కుపడిన/నిరుద్ధ మూలధనం
blocked exchange చిక్కుపడిన/నిరుద్ధ విదేశీ మారకం
blocking నిరోధం
blood నెత్తురు/రక్తం; వంశం, కులం; రక్తసంబంధం
bad blood వైరం, మనసు విరగటం, దీర్ఘకాలిక శత్రుత్వం, ద్వేషం
blood arterial ధమని రక్తం
blood-bank రక్త సేకరణ కేంద్రం, రక్తనిధి
blood capillary రక్త కేశనాళిక; రక్తనాళిక రక్తం
blood circulation రక్తప్రసరణ
blood corpuscle రక్తకణం
blood feud సంబంధులమధ్య వైరం, పాలిపగ; బంధువిరోధం
blood grouping రక్తవర్గీకరణ
blood. human మానవరక్తం
blood letting రక్తం స్రవింపజేయటం
blood menstrual రజస్సు, రజోరుధిరం
blood plasma నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం
blood platelets రక్త సూక్ష్మఫలకాలు, సూక్ష్మరక్త ఫలకాలు
blood pressure నెత్తురుపోటు, రక్తపోటు
blood serum రసి, రక్తసిరం
bloodshed రక్తపాతం
blood stains నెత్తురు మరకలు/డాగులు
blood supply నెత్తురు సరఫరా, రక్తార్పణ
blood thirsty రక్తపిపాసి; రణోన్మాది
blood transfusion నెత్తురెక్కించటం
blood vessel రక్తవాహిక, రక్తనాళం
blood venus సిరరక్తం
in cold blood నిర్దయగా, తడిగుడ్డలతో (గొంతుకోసే); ఆలోచనపూర్వకంగా
bloom ఇనపకడ్డీ; పూత
blossom వికాసం; పెరుగు, పుష్పించు, అభివృద్ధ మగు
blot n కళంకం, మరక v కళంకపరచు, కళంకితుని చేయు
blow n దెబ్బ, ప్రహారం v ఊదు, మోసగించు, ఆర్చు
blow one’s trumpet సొంతడబ్బా వాయించు కొను/కొట్టుకొను, ఆత్మస్తుతి చేసుకొను
blow out నిర్వాపణం
blow over ఆగిపోవు; శాంతించు
blow pipe ఊదుగొట్టం
blow up పేలు, కోపగించు; దుర్భాషలాడు
blowing ఊదటం
bludgeon n లాఠీ, పిడికర్ర, దుడ్డుకర్ర v బాదు, కొట్టు; బలవంతపెట్టు
blue నీలం, నీలి, బులుగు
blue-blood రాజవంశం; కులీన, అభిజాత
blue-book శాసనసభ/లోక్సభ నివేదిక, ఆధికారిక నివేదిక; నీలపుస్తకం; ప్రఖ్యాత వ్యక్తుల పేర్ల పట్టిక/జాబితా
blue boy నీల (వర్ణ) శిశువు, జన్యురోగి
blue chip’s policy లాభదాయకమైన షేర్ల/వాటాల కొనుగోలు విధానం/పద్ధతి
blue litmus నీలిలిట్మస్
blue print నమూనా
blue revolution నీల విప్లవం (కడలి వనరుల పెంపుదల)
blue stone / blue vitriol మైలతుత్తం
bluff n బుకాయింపు, బూకరింపు, మోసం v బుకాయించు, బూకరించు, మోసగించు
call one’s bluff మోసంనుంచి తప్పించుకొను
bluing నీలీకరణం
bluish నీలి (రంగు వంటి)
blunder n పెద్ద తప్పు; మహాపరాధం v తప్పు చేయు, ఠోకరా పడు
blunt adj మొండి/మొద్దు బారిన, మొరటు; నిర్మొహమాటపు v మొండి/మొద్దు పరచు, బలహీన/దుర్బల పరచు
bluntly మొరటుగా, మూర్ఖంగా
blur కళంకపరచు, మకిల చేయు/పరచు; అస్పష్టపరచు
blurb స్తుతివాక్యం; ప్రకటన
blurred అస్పష్ట
blurredness అస్పష్టత
blurt అనుకోకుండా బయటపెట్టు; నిర్లక్ష్యంగా/నిరాలోచనగా మాట్లాడు
bluster గర్జించు, గాండ్రించు, బెదిరించు, భయపెట్టు
board n సంఘం, మండలి, సమితి, పరిషత్తు; పలక, నల్లబల్ల; భోజనవసతి v (వాహనం) ఎక్కు, అధిరోహించు
above board నిష్కపట, తప్పు చేయని; అతీత
board of trade వాణిజ్యమండలి
on board (వాహనం) మీద నున్న
boarding భోజనవసతి
boarding house భోజనాలయం; వసతిగృహం
boast n డంబం, బడాయి, ప్రగల్భం; ఆత్మస్తుతి v డంబాలు కొట్టు/చెప్పు, ప్రగల్భాలు పలుకు; ఆత్మస్తుతి చేసుకొను
boaster ప్రగల్భి, గర్వి, డంబాచారి; ఉత్తరకుమారుడు, కోతలరాయుడు
boastful బడాయి చెప్పే; కోతలు కోసే
boat పడవ, నావ, చిన్న నౌక
boat bridge పడవల వంతెన
in the same boat ఒకే మార్గంలో/పరిస్థితిలో
ship’s boat డింగీ, చిన్న పడవ
bob గుండు, కుదుపు, ఒళ్ళు కదలించు, తల ఊపు, పైకీ కిందికీ ఊగాడు
bode శకునమగు, (భావి) సూచించు
bodies. foreign అన్య/ఇతర పదార్థాలు
bodily శారీరకంగా, సశరీరంగా; ముక్కలు చేయకుండా, మొత్తంగా
body శరీరం, దేహం, పిండం; సమూహం, సముదాయం, నికాయం; అధికాంశం; సంస్థ
body. corporate సాముదాయక సంస్థ"
body guard అంగరక్ష(కుడు)
body guards అంగరక్షకులు
body inclusion అంతఃకణపదార్థం, కణాంతః పదార్థం
body machine శరీరయంత్రం
body politic సమష్టి పౌరవ్యవస్థ, సమగ్ర దేశవ్యవస్థ; రాజ్యం, దేశం, జాతి; సంఘటిత సమాజం
in a body ఏక మొత్తంగా/ముఖంగా
bog బురద, బాడవనేల
bog(e)y భూతం; పీడించేది, ఆవేశించేది; గుర్తు తెలియని విమానం
boggle భయపడు, వణకిపోవు; సందేహించు, ఊగిసలాడు; చెడు, చెడగొట్టు
bogie రైలు పెట్టె/డబ్బా
bogus నకిలీ, బూటకపు, మోసపు; కృత్రిమ, కల్పిత
boil n కురుపు, పొక్కు, గడ్డ, గుల్ల; మరగటం v కాగు, కాచు; ఆగ్రహావిష్టమగు, (తుకతుక) ఉడికిపోవు
boil down తేలు; సంగ్రహించు, క్లుప్తీకరించు
boil over పొంగు/పొర్లు; తమాయించుకో లేకపోవు, సంయమనం కోల్పోవు
boiler కాగు
boiler scale కాగులోని మస్తుపొర
boiling మరగటం; బాష్పీభవనం, క్వథనం
boiling point మరిగేస్థానం, బాష్పీభవనస్థానం; మరిగే ఉష్ణత/క్వథనాంశం
boisterous ఉద్ధత, ప్రచండ, తీవ్ర; గోలపెట్టే, కల్లోలపెట్టే
bold ధైర్యంగల, సాహసవంతమైన, నిర్భీక; లావుపాటి
boldly ధైర్యంగా, సాహసంతో, నిర్భయంగా; స్పష్టంగా
boldness ధైర్యం, సాహసం
bolster మద్దతిచ్చు, సాయపడు, ఆసరా అగు
bolster cushion తలగడ బాలీసు/మెత్త
bolt n పిడుగు; ఆకస్మిక పలాయనం v పారిపోవు; విసరివేయు; కాల్చు; (పార్టీ) ఫిరాయించు
bolt from the blue పిడుగు (పడ్డట్లు); అనుకోని దుర్ఘటన
bolts and nuts విడివిడి(గా), విడివిడి భాగాలు
bolus ముద్ద
bomb n బాంబు v బాంబులు వేయు/విసరు
bomb proof బాంబులు చొరని
bomb shell బాంబు; ఫిరంగి గుండు; పిడుగుపాటు
bombard తాడించు; (గుండు/ఫిరంగి) పేల్చు
bombardment గుండ్ల/ఫిరంగుల వర్షం
bombax heptaphylla బూరుగ
bombax malaparicum బరుగు
bomber బాంబర్ (విమానం), బాంబులువేసే విమానం
bomber-fighter బాంబర్-ఫైటర్ విమానం, యుద్ధవిమానం
bonafide విశ్వసనీయ, ప్రామాణిక; వాస్తవిక, నిజమైన; సద్భావం/సదుద్దేశం గల
bonafides విశ్వసనీయత; వాస్తవికత; నిజాయితీ
bond (పూచీ) పత్రం, దస్తావేజు; బంధ(నం)
bond holder రుణపత్రదారు
bondage దాస్యం, బానిసత్వం; గులామీ; కారావాసం, బంధనం
bonded పన్ను చెల్లించవలసిన; బానిసత్వంలో ఉన్న; కట్టడిలో ఉన్న
bonds పత్రాలు, దస్తావేజులు
bone ఎముక, అస్థి
bone charcoal ఎముక బొగ్గు
bone. collar కాలరు ఎముక
bone. flat చదునెముక
bone hip తుంటి ఎముక
bone long పొడుగెముక
bone marrow మూలగ, మజ్జ
bone. nasal ముక్కు ఎముక
bone of contention వివాదవిషయం, కలహకారణం
bone shaft ఎముక కడ్డీ
bone. thigh తొడ ఎముక
bonfire (ఆరుబయలు) నెగడు, చలిమంట
bonitarian ధర్మసమ్మతమైన
bonus లాభాంశం, లాభంలో భాగం; వాయిదాపడ్డ వేతనం
bony ఎముక (పుష్టి)గల, ఎముకలగూడైన
boo ఛీఛా (అనటం), వెక్కిరింత
booby trap మాటు; గుప్త/తెలియని ప్రమాదం
book n పుస్తకం, గ్రంథం v నమోదు చేయు; ముందుగా కుదుర్చుకొను
book bank పుస్తకభాండాగారం
book-jacket పుస్తకం పైఅట్ట
book keeper లెక్కలురాసే వ్యక్తి
book keeping లెక్కలు రాయటం
booklet చేపుస్తకం
bring to book ఉత్తరం రాయు, జిమ్మేదారు చేయు, జవాబుదారుచేయు, కేసు నమోదు చేయు
in one’s bad books ఎవరితోనూ పడకుండు, లోకువ అగు
in one’s good books కృపాపాత్రుడగు, దయ సంపాదించు
booking టిక్కెట్లు అమ్మటం; రవాణాచేసే సరుకును తీసుకోవటం; ఖాతాలో ఎక్కించటం/నమోదు చేయటం
booking office సామానులు పంపే/తీసుకొనే చోటు
boom ఆకస్మిక వ్యాపారాభివృద్ధి, వ్యాపార విజృంభణ; ఢామ్మనటం, ఉరమటం
boon వరం, వరప్రసాదం, అనుగ్రహం, లాభం
boors మోటు/మొరటు మనుషులు
boost పెంచు, అభివృద్ధిపరచు, పెంచి చెప్పు, గొప్పలు చెప్పు
Bootes భూతేశుడు
booty దోపిడీ సొమ్ము/ధనం
borasus flabelliformis తాటిచెట్టు
borax వెలిగారం
border n (సరి)హద్దు, ఎల్ల, ఒడ్డు; అంచు, అంచలం
border. anterior పూర్వాంచలం, ముందంచు
bordering on సరిహద్దులో ఉన్న, సరిహద్దును తాకి ఉన్న; సమానమైన
border lateral బయటి అంచు, బాహిరాంచలం
border. medial నడిమి అంచు, మధ్యాంచలం
border on or upon సరిహద్దులు తాకు/కలియు; స్వభావంలో సన్నిహితమగు; రమారమి అగు, సమానమగు
border patrol సరిహద్దు గస్తీ (సేన)
border. posterior చివరి అంచు, పుచ్ఛాంచలం
border strip సరిహద్దు భాగం/ఖండం/పట్టీ
bore n (తుపాకీ) గొట్టంలోపలి వ్యాసం; నసమనిషి, విసిగించే వ్యక్తి, చికాకుపెట్టే వ్యక్తి, బోరుకొట్టే వ్యక్తి
bore hole గొట్టపుబావి
boredom విసుగుదల, చికాకు
boring machine తొలుపుడు యంత్రం, తొరపణం
boron టంకం
borrow అప్పుచేయు, ఎరువు తెచ్చుకొను
borrower అప్పుచేసే వ్యక్తి, రుణగ్రాహి, రుణగ్రహీత
borrowing అప్పు చేయటం, ఆదానం
borstal institution బాలనేరస్థుల సంస్థ
boss n అధికారి, యజమాని v అధికారం వెలగబెట్టు చూపు/ప్రదర్శించు
boswellia glabra గుగ్గిలం
boswellia serrata పరంకి
botanical వృక్ష సంబంధి
botany వృక్షశాస్త్రం
both రెండూ, ఉభయం
have it both ways విరోధంలోకూడా లాభం పొందు
bother బాధించు, సతాయించు, హైరానాపెట్టు, విసిగించు
bottle neck అవరోధం, అడ్డంకి
bottom అడుగు; ఓడ
be at the bottom of మూల (కారణ)మగు
bottom dwelling అడుగున నివసించే; అధోనివాసం
bottom feature అధోభాగ లక్షణం
from the bottom of the heart అంతఃకరణ నుంచి, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా
touch the bottom పడిపోవు, (పూర్తిగా) మందగించు
bottomry నౌకాధార రుణవిధానం
bougainvillaea బోగంమల్లె, కాగితంపువ్వు
bought ledger కొనుగోలు/ఆవర్జా
bought note కొన్న వస్తువుల పత్రం
boulder (గండ) శిల, బండ
boulevard విశాలపథం, వాహ్యాళి ప్రదేశం
bounce ఎగిరిపడు, ఆకస్మికంగా/హఠాత్తుగా (ఆస్తులు) పెంచు
bound adj అస్వతంత్ర, అనిబద్ధ n సీమ, (సరి)హద్దు, పొలిమేర v సీమాబద్ధం చేయు, పరిమితం చేయు, హద్దు ల్ఏర్పరచు; ఆపు; దూకు, ఎగురు
bound by హద్దులుగల, సీమిత
bound for దారిలో, మార్గంలో; ప్రయాణానికి సిద్ధమైన
bound to కట్టుబడిన; ప్రయాణించదలచిన
bound up with ఆవృతమైన, సీమితమైన
boundary (సరి)హద్దు, పొలిమేర, సరిహద్దురేఖ, ఎల్ల, పరిధి
bounded సీమిత
boundless సీమారహిత, ఎల్లల్లేని
bounty ప్రోత్సాహద్రవ్యం, ధనసహాయం; అదనపు లాభం; ఔదార్యం, అనుగ్రహం, దయ
bouquet బొకే, పూలగుత్తి, పుష్పగుచ్ఛం
bourgeois మధ్యతరగతి (వ్యక్తి), ఆస్తిగల (వ్యక్తి), బూర్జువా; మర్యాదలేని
bourgeoisie మధ్యతరగతి జనం, మధ్యాదాయ వర్గం; శ్రామికేతరులు
bout పోటీ, బలప్రదర్శన, కుస్తీ; కాలం, సమయం
bovine పశుసంబంధి, గోజాతి; ఎద్దువంటి, మూర్ఖ, మందబుద్ధి
bow n విల్లు (వంపు); (పడవ, విమానం) ముందుభాగం; చాపం v వంగు, నమస్కరించు, వంచు; సలాంపెట్టు
bowel పేగు
bowleg (genu varum) దొడ్డికాలు, దొప్పకాలు
bowling బంతివిసరటం
box n పెట్టె, పేటిక; ప్రేక్షకులు కూర్చునేచోటు; (పిడి) గుద్దు v గుద్దు, కొట్టు, పెట్టెలో పెట్టు
box item ప్రముఖాంశం, పేటికాంశం
boycott n బహిష్కారం, వెలి v బహిష్కరించు, వెలివేయు
brace కట్టు (తాడు); కట్టు, గట్టిపరచు, ఉద్దీపకమగు
brace bracket మీసాల బ్రాకెట్టు
brachium జబ్బ, బాహువు, దండచెయ్యి
brachy cephalic లఘు శిరస్క/శిరస్కుడు
bracket కుండలీకరణం/కుండలి
bract పత్రకం
bracteole లఘుపుష్పగుచ్ఛం
bractlet లఘుపుచ్ఛం
brady cardia హృన్మాంద్యం/హృదయమందత
brag డంబం, బడాయి; డంబాలు కొట్టు
braggart బడాయికోరు, దాంభికుడు, దంభాచారి
brahminism బ్రాహ్మణమతం
braille అంధలిపి, అంధులకు నేర్పే లిపి
brain మెదడు, మేధ; తెలివితేటలు; మస్తిష్కం
brain fag బుద్ధిమాంద్యం
brain injury మస్తిష్కఘాతం
brain stem మస్తిష్కమూలం
brain storming మెదడుకు మేత(పెట్టే)
brains trust విద్వన్మండలి, సలహాదారు(లు)
brain tumour మస్తిష్కవ్రణం
brain wave ఆకస్మికాలోచన
brake అడ్డు, ఆపు(దల)
brake van (రైల్వే) బ్రేక్వాన్
bran తవుడు
branch n కొమ్మ, శాఖ, భాగం, విభాగం v చీలు, చీలిపోవు, వేరగు
branch a/c శాఖ (లోని) ఖాతా
branched programming శాఖీయ కార్యక్రమం
branch line (రైల్వే) బ్రాంచిలైన్
branch office అనుబంధ/శాఖా కార్యాలయం
branching శాఖోత్పత్తి; విభజన, విభాగీకరణ
brand n వ్యాపారచిహ్నం; గుర్తు, ముద్ర; వాణిజ్య చిహ్నం v ముద్రవేయు, గుర్తుపెట్టు; వాతపెట్టు
branded దూషిత, ఆరోపిత
branding ముద్రవేయటం
brandish జళిపించు
brandy బ్రాందీ, ద్రాక్షాసవం
brass ఇత్తడి
brass tacks మూలవిషయం, అసలు విషయం/సంగతి
brassica juncia ఆవ
brassica oberacia క్యాబేజి
bravado బడాయి(మాట), డంబం
brave adj సాహసి, ధైర్యంగల v సహించు, భరించు; ఎదుర్కొను, ఎదిరించు
bravery ధైర్యం, సాహసం
brawl n గలభా, జగడం, కలహం v గలభా చేయు, పోట్లాడు, కలహించు
brawny కండలు పెంచిన, శక్తిమంతమైన
brazen ఇత్తడితో చేసిన; సిగ్గులేని; ధైర్యంతో ఎదిరించే
breach n భంగం, ఉల్లంఘనం, అతిక్రమణ v ఉల్లంఘించు, అతిక్రమించు
breach of contract ఖరారుకు/ఒప్పందానికి భంగం
breach of law శాసనాతిక్రమణ, శాసనోల్లంఘన, న్యాయాతిక్రమణ
breach of peace శాంతి(కి) భంగం
breach of previlege సభాహక్కుల ఉల్లంఘన/ధిక్కరణ
breach of trust నమ్మక/విశ్వాస ద్రోహం
breach baby నెలతక్కువ బిడ్డ
breach birth ఎదురుకాళ్ళ కాన్పు
bread రొట్టె; ఆహారం
bread winner సంపాదనపరుడు, పోషకుడు
breadth వెడల్పు
hair breadth escape వెంట్రుకవాసిలో తప్పించుకోవటం
break n భంగం, ఆపుదల, అంతరాయం; పగులు, విరుపు; తెగటం v పగలగొట్టు, విరగగొట్టు, తెంచు; అతిక్రమించు, భంగం చేయు
break away విడిపోవు; విడిపోయిన
break down n విచ్ఛిన్నత, (కార్య) భంగం, చెడిపోవటం, ఆగిపోవటం v పగలగొట్టు, ధ్వంసంచేయు, విశ్లేషించు, జయించు, సాధించు
break-down train సహాయక రైలు
break in చొరబడు, చొచ్చుకొని పోవు
break new ground కొత్తపుంతలు తొక్కు, కొత్త విషయాలు కనిపెట్టు
break news వార్త చెప్పు/సూచించు
break off విడివడు, వేర్పడు, ఆకస్మికంగా ఆపు, ఆగిపోవు
break out మొదలగు, వ్యాపించు, ప్రజ్వలించు
break the back of నడుము విరుచు
break-through (సైనికంగా) చొచ్చుకొని పోవు, వెనకనుంచి దెబ్బతీయు; (శాస్త్రాదుల్లో) అడ్డంకులు అధిగమించు, అవరోధాలు దాటు
break up విచ్ఛిన్నం చేయు, చెల్లాచెదరు చేయు; వివరించి చెప్పు
break up figures వివరణ, వివరణాత్మక సంఖ్యలు, తబ్సీలు
break up value మూల్యవివరణ
break water (సేతు) బంధం
break with విడివడు, స్నేహం వదలుకొను, వేర్పడు
breaker భంజకం
breaker(s) భగ్నోర్ములు
breaking point సహనసీమ
breakneck speed ప్రమాదకర/ప్రాణాపాయకర వేగం
breast రొమ్ము, ఎద, వక్షస్థలం, వక్షోజం, స్తనం
breast bone రొమ్ముటెముక
breast fin రొమ్ము రెక్క
breast milk చనుబాల
breast. pigeon కపోతవక్షం, పావురం ఛాతీ
breast-plate వక్షః కవచం
breast pump రొమ్ము పంపు
breath ఊపిరి, శ్వాస
breath-taking ఆశ్చర్యజనక; చమత్కారి
take away one’s breath ప్రాణంతీయు; ఆశ్చర్యపరచు; హైరానపెట్టు
breathe ఊపిరితీయు, శ్వాసించు
breathe again / breathe freely నూత్నశక్తి సంపాదించు; స్వతంత్రుడగు
breather (ఊపిరిసల్పే) విశ్రాంతి, ఊపిరి తీసుకొనే సమయం
breathing శ్వాస; ఊపిరితీయటం
breathing organs శ్వాసేంద్రియాలు
breathing problem శ్వాస సమస్య
breed n జాతి, వంశం v పెంచు, పుట్టించు; పుట్టు
breeding పుట్టుక; పెంపకం
breeding bull ఆబోతు
breeding ground పెంచేచోటు, పోషణ స్థలం/ప్రాంతం
breeze పిల్లగాలి; తిట్లాట, వాగ్యుద్ధం
bren బ్రెన్ తుపాకి
breve హ్రస్వ(తా) చిహ్నం
brevis హ్రస్వ
brevity హ్రస్వత, సంక్షిప్తి, క్లుప్తి, సంగ్రహం, సంక్షేపం
brew n మద్యం; (సారా) వంట v పులియబెట్టు, వండు
brewery సారా(యి) బట్టీ
breynia patens దేవదారు
bribe లంచం v లంచమిచ్చు
bribery లంచగొండితనం
brick ఇటుక
brickbat ఇటుకలు విసరు
brick-work ఇటుక కట్టడం
bride వధువు
bride price కన్యాశుల్కం, ఓలి
bridellia montana పంచోతుకం
bridellia retusa ఏరుమద్ది
bridge n వంతెన, సేతువు; బ్రిడ్జ్ ఆట v కలుపు, (లోటు) పూడ్చు; వంతెన కట్టు
boat bridge పడవల వంతెన, నౌకాసేతువు
bridge-head రక్షణస్థావరం
bridge over జోడించు, కలుపు; భేదం తొలగించు
suspension bridge వేలాడే వంతెన, ఊయల వంతెన
bridle path అశ్వమార్గం
brief adj క్లుప్త, సంగ్రహ, సంక్షిప్త; క్షణిక n క్లుప్తి, సంగ్రహం; (వ్యాజ్యవిషయ) వివరణ, అభియోగ సారం; అధికారపత్రం వకాలతు(నామా) ఇచ్చు, సంగ్రహసార మిచ్చు; కేసు ఆకళింపు చేయు
hold a brief for వకాల్తా చేయు/ఇచ్చు
briefly క్లుప్తంగా, సంక్షేపంగా, సంగ్రహంగా
brigade వాహిని
brigand దోపిడీదొంగ
bright ప్రకాశవంతమైన, ఉజ్వల; తెలివితేటలుగల
bright line తేజోరేఖ
brilliant సూక్ష్మబుద్ధిగల
brim n ఒడ్డు, అంచు v అంచువరకు నింపు
brimstone గంధకం
brine ఉప్పునీరు; కారుప్పు
brine water లవణజలవ్యర్ధం
bring తెచ్చు
bring about ఉత్పన్నం చేయు; ఉత్పాదించు
bring back తిరిగి తెచ్చు, వాపసు తెచ్చు
bring down పడగొట్టు; తగ్గించు
bring forward ప్రవేశపెట్టు; ముందుకు తెచ్చు
bring home to తెలియజెప్పు, సమఝాయించు
bring in ప్రవేశపెట్టు, హాజరుపరచు; తెచ్చు
bring into line దారికి తెచ్చు, అనుకూలపరచు
bring into play వాడుకకు తెచ్చు, ఉపయోగానికి తెచ్చు; అవకాశం చూపు
bring off పూర్తిచేయు, సఫలీకరించు; విడిపించు, బయటకు తెచ్చు; రక్షించు
bring out (గుట్టు) బయటపెట్టు; ప్రకటించు
bring to చేతనస్థితికి తెచ్చు; (నావను)నిలుపు/ఆపు
bring to book విచారణకు గురిచేయు; పట్టుకొను, బంధించు; లెక్కలు తీయు
bring under లోబరచుకొను; వశంచేయు
bring up పెంచు, పోషించు; శిక్షణ ఇచ్చు
bring up the rear వెనుదగులు, వెంటబడు, వెంటవచ్చు
brought forward account వెనకపేజీనుంచి ఎత్తిరాసిన లెక్క
brink అంచు, అగ్రం; సమీపస్థితి
brinkmanship యుద్ధానికి దారితీసే విధానం/ధోరణి; యుద్ధోన్మాదం, యుద్ధాభిలాష
brisk చురుకు, త్వర
briskly చురుకుగా, త్వరగా
bristle n పులక(లు), బిరుసెక్కిన జుట్టు/వెంట్రుకలు v పులకరించు, రోమాంచితమగు
Bristol stone పుష్యరాగం
brittle పెళుసు (అయిన), భంగుర
brittleness పెళుసుదనం; భంగురత
broach (మాట) కదుపు, (చర్చ) మొదలుపెట్టు
broad విశాల, విస్తృత, వెడల్పయిన, వ్యభిచారిణి
broad gauge బ్రాడ్గేజి, పెద్దలైను
broad spectrum విస్తృతవర్ణపటం
broadcast n ప్రసారం, ప్రసరణ v ప్రసారం చేయు
broadcast receiver రేడియో (సెట్టు)
broadcaster ప్రసారకుడు
broadcasting ప్రసారం, ప్రసరణం, రేడియో ప్రసారం
broadcasting station ప్రసారకేంద్రం, రేడియో కేంద్రం
broaden విస్తృతపరచు, వ్యాపింపజేయు
broadly speaking స్థూలంగా (చెప్పదలిస్తే)
brocade జరీ
brochure బ్రోషి, కరపత్రం, వివరణపత్రం
broker దళారి
brokerage దళారీ రుసుం, దళారీతనం
broncheole సూక్ష్మశ్వాసనాళిక
bronchi శ్వాసనాళశాఖలు
bronchitis రొమ్ముపడిసెం; శ్వాసనాళాల వాపు
bronchogenic శ్వాసనాళజనిత
bronchogram శ్వాసనాళపటం
broncho-pneumonia శ్వాసనాళ సంబంధి న్యుమోనియా
bronchoscope శ్వాసనాళ రక్షక(పరికరం)
bronchoscopy శ్వాసనాళికాదర్శనం
bronchospasm శ్వాసనాళికల ఈడ్పు
bronchus శ్వాసనాళం
bronze కంచు
bronze age కాంస్యయుగం
brooding పెంపకం, పొదగటం, విచారమగ్నత
brook n సెలయేరు, వాగు v భరించు, సహించు
brothel వ్యభిచారగృహం
brotherhood సోదరత్వం, సౌభ్రాతృత్వం
browbeat బెదిరించు, కన్నెర్రజేయు
brown గోధుమరంగు (గల)
brown coal లిగ్నైట్ బొగ్గు
brown sugar బూరా చక్కెర
bruise n కమిలిన గాయం, దొంగదెబ్బ, పైపై దెబ్బ v గాయపరచు, కొట్టు
brunt దాడి తీవ్రత; తీవ్రమైన దాడి
brush n కుంచె, తూలిక, కూర్చం v తుడుచు, ఊడ్చు, శుభ్రపరచు
brush aside తోసిపుచ్చు, పక్కకు నెట్టు
brush away నెట్టివేయు; అవహేళన చేయు
brush up తోము, మెరుగుపెట్టు
brush work కుంచెపని, రంగుల పని
brutal క్రూర, కఠోర, దుర్మార్గ, నిర్దయ
brutality క్రూరత్వం, నిర్దయ, కఠోరత, దుర్మార్గం
brutally క్రూరంగా, నిర్దయగా, కఠోరంగా, నిర్దాక్షిణ్యంగా
brute క్రూరుడు, అనాగరకుడు, పశుప్రాయుడు; పశువు, జంతువు
bryophyta పాచి
bubble chamber బుడగ గది
bubo గజ్జలబిళ్ళ; బిళ్ళ సంకటం
buccal నోటికి సంబంధించిన, ముఖసంబంధి
buccaneer ఓడదొంగ; సాహసికుడు
bucket చేద, బొక్కెన
buck up సంతోషపడు, ఉత్సాహపడు, ఉద్వేగపడు
bud మొగ్గ, కోరకం, అంకురం; మూలం
Buddhism బౌద్ధ(మతం)
buddhists బౌద్ధులు
budding మొగ్గ అంటు; మొలకెత్తుతున్న, వర్ధమాన
budge కదులు, జరుగు
budget n ఆదాయవ్యయపట్టిక, ఆదాయవ్యయాల అంచనా, ఆయవ్యయపట్టిక; సంచి, మూట v అయవ్యయాలు అంచనావేయు
budget estimates బడ్జెట్ అంచనాలు
budget provision బడ్జెట్లో కేటాయింపు
deficit budget లోటు బడ్జెట్
surplus budget మిగులు బడ్జెట్
buffer తటస్థ ప్రాంతం; తాటస్థ్యం
buffer analysis తటస్థ/మధ్యస్థ విశ్లేషణ
buffer state తటస్థరాజ్యం, మధ్యస్థదేశం
buffer zonation తటస్థమండలీకరణం
buffering technique తటస్థీకరణవిధానం
buffet car ఫలాహారాల బోగీ/పెట్టె; జలపాన డబ్బా
bugbear నిష్కారణ భయ(స్థానం)
bugle బిగులు, ఈల
build n నిర్మాణ వైఖరి, కట్టుబడి తీరు v కట్టు, నిర్మించు; స్థాపించు, నెలకొల్పు
build up స్థాపించు, బలపరచు, పెంచు; ఇళ్ళతో నింపు; సన్నద్ధమగు, సన్నాహం చేయు
build upon పథకం/ప్రణాళికవేయు; ఆలోచన చేయు
builder (గృహ/భవన) నిర్మాత
building భవన(నిర్మాణం); ఇల్లు; కట్టడం
building material కట్టడపు సామగ్రి, నిర్మాణ సామగ్రి
bulb బుడగ; మొగ్గ; గడ్డ
bulb tube కందనాళిక
bulge n ఉబ్బు, వాపు v ఉబుకు, వాచు
bulia బుద్బుదం
bulk అధికాంశం, అధికసంఖ్యాకం; సముదాయం, స్థూలత, లావు(దనం), పెద్ద ఆకారం
bulk supplies టోకు/భారీ సరఫరాలు
bulky లావైన, పెద్ద, భారీ
bull n ధరలు పెంచేవాడు; వ్యాఘాతం; అత్యసంబద్ధం; మతాధికారి శ్రీముఖం v ధరలు పెంచు, ధరల పెరుగుదలకు ప్రయత్నించు
bull’s eye (ప్రధాన) లక్ష్యం, గురి కేంద్రం
papal bull పోపు శ్రీముఖం
bullet తుపాకిగుండు
bullet intro నిర్భేదక పరిచయం
bullet-proof తుపాకిగుండును నిరోధించే
bulletin ప్రకటన; నివేదిక; లఘువివరణ పత్రిక; ప్రముఖవార్త
bullion ముద్దబంగారం; కడ్డీ బంగారం; రజతం, కలధౌతం; వెండి బంగారాలు
bullion exchange రజత వినిమయం
bullion market వెండి బంగారాల అంగడి
bullion stitch పేనిన కుట్టు
bully n దుష్టుడు, కజ్జాకోరు, జగడాలమారి, ఆకతాయి, గూండా v హింసించు, వేధించు, విసిగించు; సతాయించు
bulwark n ప్రాకారం, బురుజు; కట్ట; రక్షణ (స్థానం); ఓడపైభాగం v రక్షణశ్రేణి నిర్మించు, రక్షించు
bump విసరికొట్టు; కొట్టి గాయపరచు, కొట్టుకొను, ఢీకొను,
bumper చాలా ఎక్కువైన, పుష్కలమైన, నిండిన; నిండు గ్లాసు/పాత్ర
bumper crop పుష్కలమైన పంట (దిగుబడి)
bumping బొప్పి (కట్టడం)
bunch n గుత్తి, గెల; మొత్తం, వెరశి v గుత్తులు కట్టు; గుచ్చు; మొత్తం చేర్చు
bund అడ్డుకట్ట; కట్ట, గట్టు
bunding గట్టువేయటం
bundle n మోపు, మూట; కట్టు; పొట్లం; సమూహం v మోపు/మూట కట్టు; గజిబిజిగా వేషం ధరించు
bundle of rights హక్కుల సమూహం
bungle గొప్ప పొరపాటు; చెడగొట్టు, పాడుచేయు
bungler చెడగొట్టేవాడు
bungling గడబిడ, అస్తవ్యస్తత
bunting (పడవ) జెండా, సంకేతం
buoy బోయకట్టె
buoyancy ఉల్లాసం, ఉత్సాహం; తేలికదనం, ప్లవనశక్తి; ఉత్ప్లవనం
buoyant తేలే; ఉత్సాహంగల; చపల
burden n బరువు, భారం; కష్టం v ఎరువుపెట్టు, భారం మోపు; కష్టం కలిగించు
burden of proof (ప్రమాణ) నిరూపణ బాధ్యత
burdensome భారావహం
bureau శాఖ; సొరుగులున్న రాతబల్ల; కార్యాలయం; విభాగం, శాఖ
bureaucracy ఉద్యోగిస్వామ్యం, ఉద్యోగుల దొరతనం/పెత్తనం/నిరంకుశాధికారం
bureaucrat ఉద్యోగి, పెత్తందారు; నిరంకుశోద్యోగి
bureaucratic ఉద్యోగ సంబంధి; ఆలస్యం చేసే
burgess నగర ప్రతినిధులు
burglar (కన్నపు) దొంగ
burglar alarm చోరప్రబోధకం
burglary చోరీ, (కన్నపు) దొంగతనం
burgle కన్నంవేయు, దొంగతనం చేయు, దొంగిలించు
burial సమాధి, గోరీ
burial ground శ్మశానం
burials శవఖననాలు
burlap గోనె, (జనపనార) సంచీ
burlesque n హాస్యకావ్యం, ప్రహసనం v (అప)హాస్యం చేయు, ఎగతాళి/హేళన చేయు, వెక్కిరించు
burly మోటయిన, లావయిన, బలిష్ఠమయిన
burn n కాల్పు, కాలిన గాయం; వాత; దహనం v కాల్చు, తగలబెట్టు, మాడ్చు; వాతబెట్టు; కాలు, మండు; మండిపడు
burn-down బూడిద/భస్మం చేయు, ధ్వంసం చేయు, నిర్దహించు
burning ground శ్మశానవాటిక
burn one’s boats వెనకదారి మూసివేయు, పడవ లంగరు విరిచివేయు; తిరిగి రాగోరకుండు
burn one’s fingers అనవసరంగా నష్టపడు; చేతులు కాల్చుకొను
burn up భస్మం చేయు, కాల్చివేయు; కాలిపోవు; మండిపడు
burr-hole శోధనచ్ఛిద్రం
bursa భస్త్రిక
burst n పగులు, పేలుడు v పగులు, పేలు; పిగిలిపోవు, తెగిపోవు; పగలగొట్టు, తెంచు, పేల్చివేయు
burst out కేకలుపెట్టు, అరచు; వచ్చిపడు; వర్షంపడు
burst upon హఠాత్తుగా తెలియు
bury పూడ్చిపెట్టు, భూస్థాపితం చేయు; మరచు; తొలగించు; మాటపడ జేయు
bury alive బతికుండగా పూడ్చిపెట్టు, సజీవ సమాధిచేయు
bush పొద, (ఆఫ్రికన్) అడవి; గెరిల్లా స్థావరం
business వ్యాపారం, వ్యవహారం; పని/వృత్తి
business activity వ్యాపారం, వ్యాపారక్రియ
business acumen వ్యాపార ధోరణి/కుశలత
business hours పనివేళలు
businessman వ్యాపారి, వర్తకుడు
bust (శరీరం/విగ్రహం)పై సగభాగం
bust headline ఇరుకు/సంకుచిత శీర్షిక
busy season వ్యాపార సమయం; పని ఒత్తిడివేళ
but అయితే, కానీ; తప్ప; మినహా; మాత్రం
butcher n కసాయి(వాడు) v నిర్దయగా చంపు/నరుకు; తెగనరుకు
butea monsoperma మోదుగ
butt n తుపాకి కొన; చెట్టు మొదలు; సారా పీపా; గురి చుక్క; పరిహాసపాత్రం v ఢీకొట్టు, తలతో పొడుచు/కుమ్ము
butte ఏకశిల
butte system ఏకశిలావ్యవస్థ
butterfly సీతాకోకచిలుక
butter-milk మజ్జిగ, చల్ల
buttock పిరుదు
button గుండీ, బొత్తాం
button hole కాజా
buttress n ఆధారం, ఆశ్రయం v ఆశ్రయమిచ్చు, సాయపడు
buy కొను
buy in చౌకగా/మొత్తంగా కొను
buy off (లంచమిచ్చి) తప్పించుకొను; అనుకూలపరచు
buy over లంచంపెట్టు; కొనివేయు
buyer కొనేవ్యక్తి, క్రేత, కొనుగోలుదారు, గ్రాహకుడు
buying క్రయం, కొనుగోలు
forward buying ముందు/ముందస్తు కొనుగోలు
buzz n ఝంకారం; కోలాహలం; వదంతి v ఝంకారం చేయు; గోలపెట్టు; (వదంతులు) పుట్టించు; విసిగించు
by దగ్గర, గుండా, ద్వారా; అప్పుడు; వల్ల, చేత; ప్రకారం; సంబంధంతో, పరంపరతో
by degrees క్రమక్రమంగా
by(e) law ఉపనిబంధన, కట్టుబాటు, ఏర్పాటు
by-election ఉపఎన్నిక
by force బలవంతంగా, బలంతో, శక్తితో
by gone జరిగిపోయిన, గత, పూర్వ(కాలపు); పూర్వకాలం; గత దోషం
by-industry ఉపపరిశ్రమ
by instalment వాయిదాలుగా, కంతులుగా
by-line రచయిత పేరు; నామపంక్తి
by-name మారుపేరు, ఇంటిపేరు, ఉపనామం
bypass n ఉపమార్గం, దొంగదారి, పక్కదారి, చుట్టుదారి, రెండోదారి v తప్పించు, తొలగు, తప్పుకొనిపోవు; (పై అధికారికి) తెలియకుండా పని చేసుకొను/జరుపుకొను
by-product ఉపోత్పత్తి, అనుబంధోత్పత్తి, అప్రధానోత్పత్తి, ఉపఫలం
by-report ఉపనివేదిక
by-stander దారినపొయ్యే దానయ్య, పట్టించుకోని వ్యక్తి; తమాషాచూసే వ్యక్తి
by virtue of బలం/ఆధారం వల్ల, రీత్యా; అధికారం ద్వారం
by-way దగ్గర దారి, పక్కదారి, ఉపమార్గం
by way of ద్వారా
by-word సామెత, లోకోక్తి
close by. near by సమీపంలో, దగ్గరలో; దాపున, దాదాపుగా
byssinosis పత్తిదుమ్మువల్ల కలిగే వ్యాధి