E

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
evasive answer డొంకతిరుగుడు జవాబు
electoral college వోటర్ల గణం ఎన్నిక గణం
ex-ship delivery ఓడనుంచి నేరుగా బట్వాడా చేయటం
ex-warehouse delivery గోదాంనుంచి నేరుగా బట్వాడా చేయటం
estate duty ఎస్టేట్/ఆస్తి సుంకం
exise duty ఆబ్కారీ పన్ను/సుంకం
export duty ఎగుమతి పన్ను/సుంకం
each ఒక్కొక్క (ప్రతి) ఒక్క
each other ఒకరికొకరు పరస్పర
eager ఉత్సుక ఉత్కంఠిత ఆతుర
eagerly ఆతురతతో ఉత్కంఠతో ఉత్సుకతతో
ear చెవి కర్ణం
ear drum (= tympanum) కర్ణభేరి
ear piece కర్ణిక
early adj త్వరగా ముందుగా adv తొలి (నిర్ణీత కాలానికి) ముందు/మునుపు
early identification పూర్వతాదాత్మీకరణం
earmark ప్రత్యేకించు కేటాయించు
earn సంపాదించు ఆర్జించు గడించు
earned income ఆర్జితం సంపాదించిన సొమ్ము/ఆదాయం
earned leave ఆర్జిత సెలవు
earnest adj చిత్తశుద్ధిగల పట్టుదలగల
earnest money బయానా/బజానా డబ్బు/సొమ్ము; ముందుగా చెల్లించే పైకం
earning ఆర్జన గడన సంపాదన; రాబడి ఆదాయం; సముపార్జన
earning member సంపాదనపరుడు ఆర్జనపరుడు
earth n భూమి మన్ను స్థలం పృథ్వి మృత్తిక v (కరెంటు తీగను) మట్టిలో పూడ్చు
earthen dam మట్టి (ఆన)కట్ట
earth moving machinery మట్టి తవ్వే/ఖనక యంత్రాలు
earth process భూప్రక్రియ
earthquake భూకంపం
earthquake shocks భూకంపాఘాతాలు; భూప్రకంపనలు
earthroad మట్టి రోడ్డు/బాట
earth's crust భూపటలం
earthwork మట్టిపని
earth worm వానపాము
ease n సుఖం సౌలభ్యం విశ్రాంతి v విడిపించు సౌకర్యం కలిగించు విశ్రాంతి తీసుకొను
easement అనుభవం అనుభోగం అనుభోగ యోగ్యత
easily సులభంగా తేలికగా
east తూర్పు ప్రాచి ప్రాగ్దిశ
eastern ప్రాచ్య ప్రాక్; పూర్వ
easting and northing limits పూర్వాంక ఉత్తరాంక సీమలు
eastward తూర్పు వైపు; ప్రాగ్దిశ; తూర్పుదిక్కు(న)
easy తేలిక సులభం సుగమం సరళం
easy market చౌకబజారు చౌకధరలు
easy money సులభ ద్రవ్యం
easy terms తేలిక షరతులు సులభ నిబంధనలు
eating తినటం భుజించటం; భోజనం
eating house భోజనగృహం
eaves dropper పొంచివినే వ్యక్తి
ebb n క్షయం; (సముద్రపు)పాటు v తగ్గు క్షీణించు తగ్గిపోవు
ebony నల్లచేవ మాను
ebullient పొంగే ఉబికే కాగే; ఉద్రిక్తత
ebullition మసలటం
ecbolic గర్భస్రావకం
eccentric అసాధారణ విపరీత అనియమిత వికేంద్ర ఉత్కేంద్ర
eccentricity ఉత్కేంద్రిత; విపరీత మనస్తత్వం వైపరీత్యం అసాధారణత్వం వికృతత్వం వికృతచర్య
ecchymosis చర్మం(లోని) రక్తస్రావం
ecclesiastic ఫాదిరీ; దివ్య ధార్మిక (క్రైస్తవ) మత సంప్రదాయవాది; పురోహితం పౌరోహిత్య
ecclesiastical (క్రైస్తవ) మతసంబంధి చర్చికి సంబంధించిన; ధార్మిక దివ్య; పౌరోహిత్య సంబంధి
eccrine బాహ్యస్రావి
ecdysis కుబుసం వదలటం/విడవటం
echelon అధికార/నాయకత్వ స్థాయి; శ్రేణీవ్యూహం
echinochba stagina బొంత
echo n ప్రతిధ్వని ప్రతిశ్రుతి; అనుకరణ v ప్రతిధ్వనించు తిరిగి ఉచ్చరించు; అనుకరించు
echometer ప్రతిధ్వనిమాపకం
echoscope ప్రతిధ్వనిదర్శని
echo sounder ప్రతిధ్వని నిరూపకం
echoword ప్రతిశ్రుత శబ్దం
eclampsia ప్రఘాతివాతం/గుర్రపువాతం
eclat ప్రసిద్ధి ప్రతిష్ఠ; ఘనవిజయం
eclectic ఎంచుకొనే; తత్వగ్రాహి/వరణం; మిశ్రమం; సద్వస్తు సంగ్రహం; మతసార సంగ్రహం
eclipse n గ్రహణం మరుగు(పడటం) v మరుగుపరచు; కాంతిహీనంచేయు
eclipsis హల్లోపం
ecliptic జ్యోతిశ్చక్రం
ecological జీవావరణ పర్యావరణ
ecological balance పర్యావరణ సమతౌల్యం
ecology జీవావరణ/పర్యావరణ శాస్త్రం
econometrics అర్థమితి
economic ఆర్థిక అర్థ సంబంధి అర్థశాస్త్రీయ
economic and social council ఆర్థిక సామాజిక పరిషత్తు
economic barrier ఆర్థికావరోధం
economic blockade ఆర్థిక దిగ్బంధం
economic boom ఆర్థిక విజృంభణ హఠాదార్థిక సమృద్ధి
economic boycott ఆర్థిక బహిష్కారం
economic commission ఆర్థిక సంఘం
economic crisis ఆర్థికసంక్షోభం
economic depression ఆర్థికమాంద్యం
economic exploitation ఆర్థిక దోపిడీ
economic goods ఆర్థిక/లాభసాటి వస్తువులు
economic holding లాభసాటి కమతం
economic offence ఆర్థిక నేరం/దోషం
economic policy ఆర్థికవిధానం
economical ఆర్థిక; మితవ్యయసంబంధి పొదుపైన
economics ఆర్థికశాస్త్రం అర్థశాస్త్రం
economise పొదుపు/మితవ్యయం చేయు
economist ఆర్థికశాస్త్రజ్ఞుడు అర్థశాస్త్రవేత్త
economy ఆర్థికవ్యవస్థ; మితవ్యయం; లాఘవం
economy drive ఖర్చుతగ్గించే/పొదుపు ప్రయత్నం
economy measures మితవ్యయం/పొదుపు చర్యలు
eco system జీవావరణ/పర్యావరణ వ్యవస్థ
ecstasy పారవశ్యం పరవశత్వం రసానందం పరమానందం అపరిమితానందం
ectasia విస్ఫారణం
ecto వెలుపలి బాహిర బహిః బాహ్య
ectoderm బాహ్యచర్మం; పిండంపై పొర
ectodermal బాహ్యచర్మ సంబంధి
ectopia స్థానభ్రంశం
ectopic స్థానభ్రష్ట
ectoplasm బాహ్యద్రవం
ectropion కంటిరెప్ప వెనక్కు తిరగటం
eczema (ఏనుగు) గజ్జి; చర్మవ్యాధి
eddy సుడి(గాలి); సుడిగుండం; చక్రావర్తం
edema (oedema) నంజు ఉబ్బు రోగం
edge n అంచు ఒడ్డు వాడిమొన అంచలం v పదునుపెట్టు సానబెట్టు; నెట్టుకొనిపోవు (క్రమంగా) పురోగమించు/ముందుకుసాగు
edible తినదగిన ఖాద్య
edict ప్రభుత్వ ప్రకటన/శాసనం; రాజాజ్ఞ ప్రభుత్వాజ్ఞాపత్రం
edification ఆత్మోన్నతి ఆత్మజ్ఞానం నైతికాభివృద్ధి
edifice ప్రాసాదం మహాభవనం
edify బోధించు శిక్షణ ఇచ్చు జ్ఞానవృద్ధిచేయు
edit సంకలనంచేయు సంపాదకత్వం వహించు ప్రచురణ చేయు; పరిష్కరించు
editing పరిష్కరణ సంకలనం
edition ప్రచురణ సంకలనం సంచిక సంపుటి ముద్రణ
editionising సంచికాప్రచురణ
edition time సంచికా కాలము/వ్యవధి
editor సంపాదకుడు సంకలనకర్త; పరిష్కర్త
editorial adj సంపాదక/సంకలన కర్తృ సంబంధి n సంపాదకీయం
editorial group సంపాదకవర్గం
educate బోధించు నేర్పు శిక్షణ ఇచ్చు విద్యాభ్యాసం చేయించు తెలియబరచు; యోగ్యునిచేయు
education విద్య శిక్షణ బోధన; విద్యావిధానం విద్యాభ్యాసం; ఉద్ధారం
educational విద్యా(విధాన) సంబంధి శిక్షణకు సంబంధించిన
educational-psychological meas విద్యామనోవైజ్ఞానికమాపనం
educational technology విద్యావిషయక సాంకేతికజ్ఞానం
educationalist విద్యావేత్త
educator (ప్ర)బోధకుడు శిక్షకుడు
educe (విషయం మొ.) రాబట్టు తెలుసుకొను
eerie విరుద్ధ భయగ్రస్త; అజ్ఞాతభయం
efface తుడిచి వేయు/పెట్టు చెరిపి వేయు తొలగించు రద్దు చేయు కొట్టివేయు; నష్టం చేయు వినాశ(నం) చేయు
effacement తుడిచివేత తొలగింపు రద్దు కొట్టివేత చెరిపివేత తుడుపు దిద్దుబాటు
effect n కార్యం ఫలితం ప్రభావం ఫలం గుణం పరిణామం
effective కట్టుదిట్టమైన కార్య సాధక/నిర్వాహక లాభకారి; బలవత్తర; ప్రభావశీల
effector ప్రవర్తకుడు సార్థకారి నెరవేర్చిన వ్యక్తి
effects సామానులు సామగ్రి వస్తువులు సంపత్తి ఆస్తి (పాస్తులు)
effectual సఫల ఫలప్రద శక్తిమంతమైన
effeminate పౌరుషహీన దుర్బలమైన ఆడంగి(రేకుల); స్త్రీ లక్షణాలున్న
efferent అపవాహి
effervescence (బుసబుసమనే) పొంగు; పొంగటం
effesent పొంగే
effete జీర్ణ క్షీణ నష్ట దుర్బల శక్తిహీన అసమర్థ విశీర్ణ
efficacious సమర్థ ప్రభావశాలి శక్తిమంతమైన
efficiency సమర్థత దక్షత నిపుణత కార్యకుశలత
efficiency bar దక్షతావరోధం
efficiency of production ఉత్పత్తి/ఉత్పాదన సామర్థ్యం
efficient సమర్థ దక్ష నిపుణ
effigy దిష్టిబొమ్మ
efflorescent ఉదత్యాగి; పుష్పీకరణయోగ్య
effloroscence ఉదత్యాగం; పుష్పీకరణ స్థితి
effluent నిర్గత నిస్సృత బయటికి ప్రవహించే; నిస్సరణం ప్రవాహం
efflux వెల్లువ ప్రవాహం; కల్మషం కశ్మలం; వ్యర్థపదార్థం
effort యత్నం ప్రయత్నం చేష్ట ప్రయాస
effrontery దుస్సాహసం అహంభావం అహంకారం
effusion శరీరకుహరాల్లో ద్రవం చేరిక/చేరటం
effusive డాంబిక ప్రదర్శనపూర్వక గాంభీర్యరహిత
effuvis ఉద్గారం
egalitarian society సమసమాజం
egg గుడ్డు అండం
egg cell స్త్రీ జీవకణం
egg form అండరూపం
egg stage అండదశ
egg white తెల్లసొన
egg yolk పచ్చసొన
ego అహం
ego-centric అహంకారి ఆత్మాభిమాని; అహంకృత ఆత్మాభిమానంగల; అహం/ఆత్మ కేంద్రక
egocentrism అహంకేంద్రకత
egoism అహంభావం అహంకారం ఆత్మాభిమానం
egoistic స్వార్థపూరిత
egotism అహంకారం
egotist అహంకారి ఆత్మస్తుతి పరాయణుడు
egregious అసాధారణ; భయంకర
egress నిర్గమనం నిష్క్రమణ; బహిర్మార్గం బయటకు వెళ్ళే దారి
either ఏదో ఒకటి
ejaculation వాంతి వమనం; (వీర్య) స్ఖలనం; ఆకస్మిక వచనం; హఠాదాశ్చర్యం
ejaculatory స్ఖాలక
eject (బయటికి) నెట్టు/గెంటు నెట్టివేయు తోసివేయు
ejection గెంటు బహిష్కరణ నెట్టివేత వెళ్ళగొట్టడం
ejectment బహిష్కారం బహిష్కరణ; తొలగింపు (చర్య) (భూస్వాధీన) చర్య
ejector స్ఖాలకం బహిష్కారకం
eke out (లేనిది) సమకూర్చు (వివిధ పద్ధతుల్లో) బతుకు వెళ్ళదీయు
elaborate adj విస్తృత భారీ విపుల విస్తారమైన వివరమైన విరివియైన v విస్తరింపజేయు వ్యాపింపజేయు సవిస్తరం చేయు వివరించు విపులీకరించు
elaborated విస్తృత విపులీకృత
elaboration విపులీకరణ విస్తరణ వ్యాపనం
elaiometer తైలమాపకం
elapse గడచిపోవు కాలగతి చెందు
elastic సాగే స్థితిస్థాపక వ్యాకోచక
elastic clause పరివర్తనీయాంశం
elastic demand పెరిగే డిమాండు/గిరాకీ
elasticity స్థితిస్థాపకత సాగే/సర్దుకుపోయే గుణం/స్వభావం
elate adj ఉల్లాసంగల ప్రసన్న ఉప్పొంగే v ఉల్లాసపరచు ఉప్పొంగించు
elation ఉల్లాసం ప్రసన్నత హర్షోద్వేగం ఆనందం
elbow n మోచేయి; మలుపు v నెట్టివేయు తోసివేయు
elder adj పెద్ద గురు జ్యేష్ఠ వయోవృద్ధ n వయోవృద్ధుడు ముఖ్యుడు జ్యేష్ఠుడు గురువు పెద్ద; రాజ్యసభ/విధానమండలి సభ్యుడు
elder statesman రాజనీతిజ్ఞుడు రాజకీయ కుశలుడు
elderly వయస్సు మఌన/చెల్లిన
eldest (అందరికన్నా) పెద్ద జ్యేష్ఠ
elect adj ఎన్నుకొనే ఇష్టపడే v ఎన్నుకొను ఇష్టపడు
electicism వరణవాదం
election ఎన్నిక ఎన్నుకోవటం
election booths ఎన్నిక కేంద్రాలు
election campaign ఎన్నికల ప్రచారం
election commission ఎన్నికల సంఘం
election issue ఎన్నికల్లో ప్రధానసమస్య
election manifesto ఎన్నికల ప్రణాళిక
election stunt ఎన్నికల ఎత్తుగడ
electioneer ఎన్నికల ప్రచారకుడు
elective ఎన్నుకోదగ్గ ఎన్నుకొనే
elector నియోజకుడు నియామకుడు
electoral ఎన్నికలకు సంబంధించిన
electoral college నియోజక గణం
electoral right వోటు హక్కు
electoral roll వోటర్ల జాబితా
electorate నియోజకవర్గం
eletric విద్యుత్ సంబంధి కరెంటుకు సంబంధించిన వైద్యుత
electric charge విద్యుదావేశం
eletric furnace కరెంటు కొలిమి
electric generator విద్యుదుత్పాదకం
eletric power విద్యుచ్ఛక్తి
eletrician విద్యుత్కార్మికుడు విద్యుద్విజ్ఞాని
eletricity విద్యుత్తు విద్యుచ్ఛక్తి కరెంటు
eletrification విద్యుదీకరణ కరెంటు ఇవ్వటం
eletrification of railways రైల్వే(ల) విద్యుదీకరణం
electrify విద్యుదీకరించు; ఉద్వేగపరచు రెచ్చగొట్టు
electro విద్యుత్సంబంధి విద్యుత్
electrocardiogram విద్యుత్హృల్లేఖ
electro cardiograph విద్యుత్హృల్లేఖిని
electro chemical విద్యుద్రసాయన
electro dynamics విద్యుద్గతి శాస్త్రం
electro-magnetic wave విద్యుదయస్కాంత తరంగం
electro metullurgy విద్యుల్లోహశాస్త్రం
electrocution విద్యున్మారణం
electrode విద్యుద్ద్వారం
electrodualism విద్యుద్ద్వైతవాదం
electroencephalogram విద్యున్మస్తిష్కలేఖ
electroencephalograph విద్యున్మస్తిష్కలేఖిని
electrolysis విద్యుద్విశ్లేషణం
electrolyte విద్యుద్విశ్లేషణ
electrolytic విద్యుద్విశ్లేష్య
electromagnet విద్యుదయస్కాంతం
electromagnetics విద్యుదయస్కాంత శాస్త్రం
electromagnetism విద్యుదయస్కాంత శక్తి
electrometer విద్యున్మాపకం
electrometry విద్యున్మితి
electron విద్యుత్కణం
electronic విద్యుత్కణ సంబంధి
electronic means విద్యుత్కణ (సంబంధి) సాధనాలు
electronic medium (non-print) విద్యుత్కణ మాధ్య(మం)
electronic network విద్యుత్కణ జాల(కం)/సంసక్తి
electronics విద్యుత్కణశాస్త్రం
electropathy విద్యుచ్చికిత్స
electroplating కరెంటు కళాయి
electropotential విద్యుచ్ఛక్మీయ
electrostatic స్థిరవిద్యుత్
electrotyping విద్యున్ముద్రణం
electuary లేహ్యం
elegance సొగసు లాలిత్యం
elegant లలిత సుందర సొగసైన
elegy శోకగీతి విషాదగీతం
element మూలకం మూలపదార్థం; అంశం; ప్రకృతిశక్తి భూతం
element content మూలకాంశం భాగాంశం
elemental ప్రకృతిసిద్ధ మౌలిక ప్రాథమిక; తత్వసంబంధి
elementary ప్రాథమిక మౌలిక
elementary education ప్రాథమిక విద్య
elementary particle ప్రాథమిక/మూల కణం
elementary psychology ప్రాథమిక మనస్తత్వ శాస్త్రం
elenchis వాదఖండనం
elephant ఏనుగు
elephantiasis బోద(రోగం/వ్యాధి)
eleusine corocana రాగి రాగులు
eleusine indica సజ్జ/గంటి
elevate పైకెత్తు హోదాపెంచు; ఉత్సాహపరచు వృద్ధిచేయు ఉద్ధరించు
elevation ఉద్ధరణ ఎత్తు ఉన్నతాంశ ఉన్నత స్థానం/స్థలం ఉచ్చత; పదవీవృద్ధి; (ఇంటి) ముందుభాగం దృశ్యం
elevator ఉద్ధారణ/ఉద్ధారక యంత్రం
elicit రాబట్టు/లాగు సేకరించు; (అభిప్రాయం/మనోగతం) తెలుసుకొను
elicitation రాబట్టడం నిష్కర్షణ
eligibilty అర్హత యోగ్యత పాత్రత
eligible అర్హ యోగ్య పాత్ర; కోరదగ్గ
eliminate తొలగించు తీసివేయు నశింపజేయు నాశనం చేయు లోపింపజేయు లుప్తీకరించు
elimination లుప్తీకరణ; తొలగింపు తీసివేత వినాశం
elision లోపం లుప్తత
elixir అమృతం; సారం; తియ్యనిమందు
ellipse దీర్ఘవృత్తం; అండవృత్తాకారం
ellipsis అధ్యాహారం
ellipsoid దీర్ఘవృత్తాభాసం
elliptic దీర్ఘవృత్త
elliptical దీర్ఘవృత్తాకార
elliptical construction లుప్తాంశనిర్మాణక్రమం
elm తవిసె చెట్టు
elocution వక్తృత్వం వాగ్ధాటి వాచాలత
elongate సాగదీయు లాగు పెంచు పొడవు చేయు దీర్ఘీకరించు
elongation దీర్ఘీకరణ; పొడవు చేయటం
elope లేచిపోవు పారిపోవు
eloquence వక్తృత్వం వాగ్ధాటి
else అన్య మిగిలిన తక్కిన
elsewhere అన్యత్ర మరోచోట
elucidate విశదపరచు వివరించు స్పష్టంచేయు
elucidation వ్యాఖ్య వివరణ విశదీకరణ స్పష్టీకరణ
elucine coracan రాగి (తృణధాన్యం)
elude తప్పించుకొను చిక్కక/దొరక్క పోవు
elusive చిక్కని పట్టు దొరకని
elution క్షాళనం
emaciation శుష్కించటం చిక్కిపోవటం
emanate పుట్టు నిర్గమించు
emanation పుట్టుక ఉత్పత్తి నిర్గమనం; ఉద్గారం
emancipate ఉద్ధరించు బంధవిముక్తుని చేయు మోక్షమిచ్చు
emancipation (బంధ) విముక్తి మోక్షం ఉద్ధరణ
emasculate నపుంసకుని చేయు
emasculation పుంస్త్వహరణం నపుంసకీకరణం
embalm పదిలపరచు భద్రపరచు; (శవాలను) జాగ్రత్త చేయు; గుర్తుంచుకొను
embank అడ్డు వేయు/కట్టు
embankment గట్టు కట్ట
embargo (ఓడల రాకపోకల) నిషేధాజ్ఞ; (ప్రచురణ) నిరోధం; వ్యాపార నిరోధం
embark మొదలుపెట్టు (పనిలో) ప్రవేశించు ఆరంభించు
embarkation (నౌకలో) ప్రవేశం ఓడ ఎక్కటం
embarrass ఇబ్బంది/చికాకు పెట్టు కలవర పెట్టు చిక్కులు పెట్టు విభ్రాంతపరచు
embarrassment ఇబ్బంది చికాకు కలవరం విభ్రాంతి
embassador రాయబారి
embassy రాయబారి/దౌత్య కార్యాలయం
embellish సింగారించు అలంకరించు; కల్పించి చేర్చు
embezzle (అక్రమంగా) ధనం కాజేయు/అపహరించు
embezzlement ధనాపహరణ అక్రమానుభవం
embitter కష్టం కలిగించు; చేదుపరచు
emblazon (రాజచిహ్నాలతో) అలంకరించు సొగసుగా సింగారించు
emblem చిహ్నం లాంఛనం గుర్తు ముద్ర; ధ్వజం పతాక
emblic myrobalan ఉసిరి
embodiment అవతారం మూర్తి ప్రతిమ
embody రూపొందించు చేర్చు
emboss ఉబ్బెత్తు ఉబ్బు
embossed ఉబికిన ఉబ్బిన
embrace కౌగిలించు ఆలింగనం చేయు; స్వీకరించు అవలంబించు; స్వీకారం అవలంబనం; కౌగిలింత
embrasure (కోటగోడ) తెరిపి (ఫిరంగి/తుపాకి నిలిపే) రంధ్రం/కన్నం
embroidery కసీదా/బుటేదారు పని (గుడ్డపై) బుటాలుకుట్టేపని
embroil కష్టాల్లోపడు దుఃఖంలో మునుగు
embryo (గర్భస్థ) పిండం భ్రూణం
embryology పిండోత్పత్తి/పిండపరిణామ శాస్త్రం
embryonic పిండ(రూపి/స్థితిక)
embryo sac పిండకోశం
emend సవరించు పరిష్కరించు
emendation సవరణ పరిష్కరణ
emerald మరకతం పచ్చరాయి
emerge (తటాలున) బయటపడు/వెలుపలికి వచ్చు/కనబడు
emergence నిర్గమనం
emergency అత్యవసర పరిస్థితి ఆత్యయిక స్థితి
emergency bill అత్యవసర శాసనం
emergency measures అత్యవసర చర్యలు
emergency meeting అత్యవసర సమావేశం
emergency powers అత్యవసరాధికారాలు
emergent ఆకస్మికంగా బయటపడ్డ; అత్యవసర
emeritus professor గౌరవాచార్యుడు
emery కురువింద (శిలాచూర్ణం)
emetic వమనకారి వాంతి కలిగించే
emigrant ప్రవాసి వలసపోయిన వ్యక్తి
emigrate వలస/దేశాంతరం పోవు ప్రవాసానికి పోవు
emigration వలస ప్రవాసం దేశాంతర గమనం
emigree పరదేశి విదేశవాసి
emigree government ప్రవాసి ప్రభుత్వం
eminence ఘనత గౌరవం ఖ్యాతి పేరుప్రతిష్ఠలు ఔన్నత్యం ఉన్నతస్థలం
eminent ఉన్నత ప్రసిద్ధ ప్రఖ్యాత ఉత్కృష్ట
emissary (రహస్య) దూత ఆంతరంగిక దూత
emission ఉద్గమనం స్ఖలనం ఉద్గారం
emissivity ఉద్గమన సామర్థ్యం
emit ఉద్గమింపజేయు ఉద్గారించు
emitted heat energy ఉద్గారితతాపశక్తి/ఉద్గమితతాపశక్తి
emitting radiation ఉద్గారిత వికిరణనం
emittor ఉద్గారకం
emmetropia సామాన్యదృష్టి
emolument ప్రతిఫలం వేతనం ఉద్యోగలాభం జీతభత్యాలు
emotion భావావేశం ఉద్రేకం ఉద్వేగం; ఆవేశం భావం
emotional ఆవేశపూరిత ఉద్రిక్త భావావేశపూరిత ఉద్విగ్న
emotional level ఉద్వేగస్థాయి
emotional integration భావసమైకత్వం
emotionalist ఉద్వేగి ఉద్విగ్నుడు భావావిష్టుడు
emotive భావప్రధాన
empathy సహానుభూతి
emperor చక్రవర్తి సమ్రాట్టు సార్వభౌముడు
emphasis అవధారణ ఏవకారం; ఉద్ఘాటన నొక్కిచెప్పటం/వక్కాణించటం
emphasize నొక్కపలుకు ఉద్ఘాటించు మనసుకు హత్తుకొనేట్లు చెప్పు
emphatic ఏవార్థక అవధారణార్థక
empire సామ్రాజ్యం
empirical అనుభవాత్మక అనుభవపూర్వక అనుభవ వేద్య/సిద్ధ
empirical law అనుభవపూర్వక న్యాయం/సూత్రం
empiricism అనుభవైకవాదం అనుభవవాదం అనుభవజ్ఞానం
emplacement స్థాపన; (ఫిరంగులు మొ.) స్థావరం స్థాపితత్వం
emplane విమానమెక్కు (విమానంలో) సామాను లెక్కించు
employ నియమించు ప్రయోగించు ఉపయోగించు
employed నియుక్త ఉపయుక్త ప్రయుక్త
employee ఉద్యోగి
employer యజమాని
employment ఉద్యోగం; పని
employment exchange ఉద్యోగ సూచకాలయం
emporium దుకాణం అంగడి కొట్టు; వాణిజ్య స్థానం/కేంద్రం
empower అధికారం ఇచ్చు/కలిగించు
empowerment సాధికారత అధికారకల్పన
empress చక్రవర్తిని మహారాజ్ఞి సమ్రాజ్ఞి మహారాణి
emptiness శూన్యత రిక్తి
empty ఖాళీ శూన్య రిక్త; నిరర్థక
empty morph అంశాభాసం రిక్తాంశం
empyema ఫుఫుసకుహరంలో చీము చేరిక
emulate అనుకరించు అనుసరించు
emulation అనుకరణ అనుసరణ
emulsification పాయసీకరణం
emulsifier పాయసీకారి
emulsion పాయసం పయస్యం రసాయనం
enable శక్తి/సమర్థత కలిగించు అధికారమిచ్చు సాధ్యం చేయు
enabling act అధికారమిచ్చే చట్టం/శాసనం
enabling technology సహాయక/సమర్ధక సాంకేతికశాస్త్రం
enact చట్టం/శాసనం చేయు; అభినయించు
enactive (=direct) experience ప్రత్యక్షానుభవం
enactment శాసనం చట్టం నియమం; అభినయం
enamel (పింగాణీ) పూత పంటిపై పూత
enamelling పింగాణీపూత (పూయటం)
enamour వలపించే మరులుగొలిపే సొక్కించే
en bloc సామూహికంగా ఒకటిగా
encamp మకాం/బస చేయు
encampment విడిది మకాం బస మజిలీ విశ్రమస్థానం
encapsulated చుట్టూ పొరలున్న
encase పెట్టెలో పెట్టు మూయు బంధించు
encash సొమ్ముచేసుకొను నగదుగా/రొక్కంగా మార్చు
encashment నగదుగా/రొక్కంగా మార్చటం సొమ్ముగా మార్చటం
enceoqchment అతిక్రమణం
encephalar మస్తిష్క (సంబంధి)
encephalisation మస్తిష్కీకరణం
encephalitis మెదడువాపు మస్తిష్కశోథ
encephalogram మస్తిష్కలేఖ
encephalomyelitis మెదడు/వెన్నుపాము శోథ
encephalon మెదడు మస్తిష్కం
encephalopathy మస్తిష్క వికృతి
enchant మోహింపజేయు వశీకరించుకొను మంత్రముగ్ధుని చేయు
encircle చుట్టుముట్టు పరివేష్టించు
encirclement చక్రబంధం చుట్టుముట్టడం
enclave ఇతరదేశంలోని స్వదేశప్రాంతం (ఉదా. వాటికన్)
enclitic పూర్వాశ్రయి
enclose చుట్టుకొను మూసి దాచు జత చేయు/పరచు
enclosure ఆవరణ కంచె మూత డేరా; జతపరచిన కాగితం మొ.
encoding సంకేతనం
encomium పొగడ్త స్తుతి ప్రశంస
encompass చుట్టుముట్టు ఆవరించు
encounter n సంఘర్షణ కొట్లాట; అనుకోని సమావేశం v ఎదుర్కొను కలహించు ఎదురుపడు; (హఠాత్తుగా) సమావేశమగు
encourage ప్రోత్సహించు ఉత్తేజపరచు ఉత్సాహపరచు
encouragement ప్రోత్సాహం ఉత్తేజనం
encroach (అన్యాయంగా) ఆక్రమించు/ప్రవేశించు
encroachment దురాక్రమణ అక్రమ ప్రవేశం
enculturation సాంస్కృతికీకరణం సాంస్కృతిక స్వీకరణం
encumber ఆటంకం కలిగించు అడ్డంకులు పెట్టు అవరోధం కల్పించు; (ఇతరులకు) భారం కలిగించు
encumbered estate రుణగ్రస్తాస్తి
encumbrance రుణభారం; చిక్కు
encyclopaedia విజ్ఞానసర్వస్వం
end n అంతం ముగింపు; లక్ష్యం ధ్యేయం; మరణం మృత్యువు v పూర్తిచేయు ముగించు; అంతం చేయు చంపు
endanger అపాయం/ఆపద కలిగించు సంకట పెట్టు
endeavour n ప్రయత్నం ప్రయాస పరిశ్రమ v పాటుపడు శ్రమించు ప్రయాసపడు
endemic adj విలక్షణ స్థల/జన విశిష్ట; స్థానిక n విలక్షణత విశిష్టత ప్రత్యేకత
endemic diseases విలక్షణ వ్యాధులు ప్రత్యేక రోగాలు
endless అంతులేని అనంత విడుపులేని ముగింపులేని
endo అంతః/అంతర్
endocardium అంతరహృదయస్తరం హృదయాంతస్తరం గుండెలోపలిపొర
endocarp అంతఃఫలకవచం ఫలాంతఃకవచం
endocentric construction అంతఃకేంద్రిత నిర్మాణ(క్రమం)
endocrine వినాళ గ్రంథి అంతస్స్రావి
endocrinology వినాళగ్రంథిశాస్త్రం అంతస్స్రవణ శాస్త్రం
endoderm అంతశ్చర్మం అంతస్త్వచం పిండం లోపలిపొర
endodermis అంతశ్చర్మం
endogamy సజాతివివాహం
endogenous అంతర్జన్య; శరీరంలో పుట్టిన
endolymph అంతశ్శోషరసం
endometrium గర్భాశయాంతస్తరం గర్భాశయంలో పొర
endorse ఆమోదించి సంతకం చేయు సమ్మతి రాయు; అంగీకరించు బలపరచు
endorsee పీటీ లేఖకుడు
endorsement సమర్థన అంగీకారం ఆమోదం; పీటీరాత
endorser పీటీ లేఖకుడు
endoscope కుహరాంతర్దర్శిని
endoscopy కుహరాంతర్దర్శనం
endosperm బీజపోషకం
endothelial నాళాంతరస్తరం నాళంలోపొర
endotoxin అంతర్జీవ(వం) జీవాంతర్విషం
endotracheal శ్వాసనాళాంతర్గత శ్వాసనాళాల్లోని
endow ఇచ్చు దానం చేయు
endowment దానం ధర్మాదాయం; కానుక బహుమతి విరాళం
endowment board దేవాదాయ ధర్మాదాయ పరిషత్తు
endowment policy ధర్మాదాయ విధానం
endurance సహన శక్తి/శీలత
endure సహించు భరించు
enema గుదంద్వారా ఎక్కించే ఔషధం
enemy శత్రువు విరోధి
enemy camp శత్రు పక్షం/శిబిరం
energetic శక్తిమంతమైన
energy శక్తి; విద్యుత్తు
energy balance equation శక్తి సమతౌల్య సమీకరణం
energy conversion శక్తి వినిమయం
energy interaction శక్తి ప్రభావశీలత/పరస్పరచర్య
energy picture శక్తి దృశ్యం
enfilade n తుడిచివేత/భారీకాల్పులు v పెద్దపెట్టున (ఒక్క సారిగా) కాల్పులు జరుపు
enfold చుట్టు ముడుచు
enforce అమలుజరుపు ఆచరణలోకి తెచ్చు
enforce a right హక్కు అమలుపరచు అధికారం వినియోగించు
enforced labour బలవంతపు నౌకరీ/ఊడిగం వెట్టి(చాకిరీ)
enforcement అమలు అదుపు
enfranchise వోటుహక్కు నిచ్చు స్వేచ్ఛ నిచ్చు
engagement ఒప్పుదల ఒప్పందం; వాగ్దానం వివాహ నిశ్చయం; ఉద్యోగం సేవాసంఘం
engender పుట్టించు ఉత్పత్తి చేయు విత్తు
engine యంత్రం
engine shed యంత్రశాల
engineer యంత్రనిర్మాత
engineering యంత్రవిద్య
engorged అతిపూరిత
engrave చెక్కు మలచు
engraving చెక్కడం (పని); మలచటం
engross లీనమగు నిమగ్నం చేయు మనసు నాక్రమించుకొను; పెద్దక్షరాలు రాయు/చెక్కు
engulf చుట్టుముట్టు ముంచు మింగివేయు
enhance పెంచు పెద్దది చేయు వృద్ధిచేయు అధికం చేయు
enigma సమస్య గూఢప్రశ్న రహస్యం
enigmatic రహస్య గూఢ జటిల సమస్యాత్మక
enjoin ఆదేశించు ఆజ్ఞాపించు నిర్ధరించు నియమించు ఉత్తరువు చేయు/వేయు
enjoy అనుభవించు సుఖించు భోగించు
enjoyment అనుభోగం అనుభవం సుఖం భోగం సంతోషం ఆనందం
enlarge పెంచు విస్తరించు వృద్ధిచేయు ప్రసారం చేయు వ్యాపింపజేయు; వ్యాకోచించు
enlargement పెంపు విస్తరణ వృద్ధి వ్యాపనం వ్యాకోచం ప్రసరణ
enlighten విశదపరచు తెలియజెప్పు సృష్టం చేయు
enlightened society విద్వత్సమాజం
enlightened world opinion విశ్వవిద్వ దభిప్రాయం
enlist జాబితాలో చేర్చు(కొను) భర్తీచేయు
enlistment భర్తీ సైన్యంలో చేర్పు
enliven రంజించు ఉల్లాసపరచు
en masse కలిసికట్టుగా సామూహికంగా
enmity శత్రుత్వం విరోధ(భావం)
ennoble పదవీవృద్ధి/పదోన్నతి కల్పించు ప్రతిష్ఠ చేకూర్చు గొప్పచేయు
ennui నిరుత్సాహం బోరుకొట్టడం
enophthalamos అంతర్గతాక్షి కనుగుడ్డు లోపలికి పోవటం
enormous అపరిమిత బ్రహ్మాండమైన భూరి భారీ సువిశాల
enough చాలినంత
enow తగినంత సరిపడినంత
en passant దారిలో; (చదరంగంలో) అడ్డు చంపుడు
enquire విచారించు దర్యాప్తుచేయు కూపీతీయు అడుగు పరిశీలించు
enquiry దర్యాప్తు పరిశీలన విచారణ
enrage కోపం పుట్టించు
enrapture బ్రహ్మానందపడు ఆనందపు టంచులు తాకు
enrich వృద్ధి/సంపన్నం చేయు ధనవంతుని చేయు శక్తిమంతుని చేయు
enriched సంపన్న శక్త సత్తువగల
enrichment సుసంపన్నత
enroll నమోదుచేయు జాబితాలో చేర్చు భర్తీచేయు; చుట్టబెట్టు
enrollment భర్తీ; (బడి మొ. వాటిలో) చేరినవారి సంఖ్య
enroute దారిలో మార్గంలో
ensconce దాచిపెట్టు కుదురుగా ఉంచు; స్థిరపడు
enshrine ప్రతిష్ఠించు
ensign పతాక ధ్వజం చిహ్నం లాంఛనం
enslave దాసుని/బానిసను చేయు
ensue రాబోవు అనుసరించి వచ్చే వెంబడివచ్చే
ensuing year రాబోయే సంవత్సరం
ensure హామీ ఇచ్చు; గట్టిపరచ్ఉ
entail అనివార్యం చేయు; పరిమితం చేయు; వారసత్వం అన్యాక్రాంతం కాకుండా చూచు ఆస్తికి వారసులను నిర్ణయించు పారంపర్యం ముందుగా నిర్దేశించు
entailment వారసత్వ నిర్ణయం/నిరూపణ
entangle చిక్కులు పెట్టు సమస్యలో పడవేయు
entanglement సమస్య చిక్కు
entente సుహృద్భావం
enter ప్రవేశించు చేరు; మొదలుపెట్టు ఆరంభించు
enter a protest నిరసన తెలుపు
enter into an agreement ఒప్పందానికి వచ్చు ఒప్పందం కుదుర్చుకొను
enter upon an office పదవి చేపట్టు పదవిలో ప్రవేశించు
enteric ఆంత్ర సంబంధి పేగులకు సంబంధించిన
enteric fever/typhoid fever ఆంత్రజ్వరం టైఫాయిడ్
enteritis ఆంత్రశోథ ఆంత్రప్రకోపం పేగుల్లోమంట
enterogastric ఆంత్ర-జఠర
enterogeneous ఆంత్రజ(న్య)
enteropathy ఆంత్రవికృతి
enterprise సాహసం తత్పరత; సాహసకార్యం; (వాణిజ్య మొ.) వ్యవస్థ
enterpriser సాహసి(కుడు)
enterprising ఉత్సాహపూరిత సాహసిక
entertain ఆతిథ్యమిచ్చు వినోదపరచు సంతోషపెట్టు; ఆలోచనకు వచ్చు/తెచ్చు; స్వీకరించు తలపెట్టు
entertainment ఆతిథ్యం విందు వినోదం
entertainment news వినోదవార్త(లు)
entertainment tax వినోదప్పన్ను
enthrall సమ్మోహపెట్టు వశపరచుకొను (మనసును) ఆకర్షించు
enthrone ప్రతిష్ఠించు గద్దెనెక్కించు ఉచ్చస్థాన మిచ్చు
enthusiasm ఉత్సుకత
enthusiastic ఉత్సుక ఉత్సాహపూరిత
enthymeme లుప్తావయవన్యాయం
entice ఆశపెట్టు మభ్యపెట్టు; ఆకర్షించు
enticement ప్రలోభనం ఆశపెట్టడం
entire అంతా మొత్తం పూర్తి సమగ్రం సమస్తం
entirely మొత్తంగా పూర్తిగా సమగ్రంగా
entitle హక్కు కలిగించు అధికారమిచ్చు; బిరుదులిచ్చు పేరుపెట్టు; ఉపాధికల్పించు
entitled హక్కు/అధికారం గల
entity అస్తిత్వం వ్యక్తిత్వం; సహజ లక్షణం; వస్తువు పదార్థం వ్యక్తి
entology చైతన్యశాస్త్రం
entomologist కీటకశాస్త్రజ్ఞుడు
entomology కీటకశాస్త్రం
entourage పరివారం పరిచారకులు సహచరులు
entrails పేగులు; (జంతుశరీరంలో) మొండెం లోపలి భాగాలు
entrain రైలెక్కు
entrance n (ప్రవేశ) ద్వారం మార్గం; ప్రవేశాధికారం v ఆశ్చర్యంలో ముంచు సమాధిలో ఉంచు
entrant పోటీదారు నూతన సభ్యుడు ప్రవేశించిన వ్యక్తి
entrap ఇరికించు వలపన్ను చిక్కుల్లోపెట్టు
entreaty వినతి ప్రార్థన నివేదన దరఖాస్తు అభ్యర్థన
entrench సురక్షితంగా ఉండు కందకాలు తవ్వుకొను ఆక్రమించు అక్రమంగా ప్రవేశించు
entrenched సురక్షితంగా ఉన్న పాదుకొని పోయిన
entrenchment సురక్షిత స్థానం/స్థావరం
entrepreneur ఉద్యమి వ్యవస్థాపకుడు పారిశ్రామికుడు
entropion కనురెప్ప లోపలికితిరగటం
entropy జడోష్ణత
entrust అప్పగించు ఒప్పగించు
entry పద్దు; ఆరోపం; ప్రవేశం
entry behaviour ప్రవేశ ప్రవర్తన
entwine చుట్టుకొను మెలిదిరుగు పెనవేయు; కౌగిలించుకొను
enucleation సమూలనిర్మూలనం సంపూర్ణ నిర్మూలనం
enumerate గణించు లెక్కపెట్టు; పేర్కొను ఏకరువుపెట్టు
enumerating గణన లెక్కించటం
enumeration (జనాభా మొ.) లెక్క; (వోటర్లు మొ.) జాబితా/పట్టిక; గణన
enumerator పరిగణకుడు
enunciate ప్రతిపాదించు ఉద్ఘోషించు; (విలక్షణంగా) ఉచ్చరించు/పలుకు; వివరించు
enunciation ప్రతిజ్ఞాపనం; వివరణ
enuresis పక్కలో మూత్రవిసర్జన
envelop n కప్పు మూత ఆవరణ; కవరు v కప్పు మూయు ఆవరించు
environment వాతావరణం పరిసరాలు
environmental పరిసర (సంబంధి)
environmental chemistry పర్యావరణ రసాయనశాస్త్రం
environmental determinism పర్యావరణ నియతివాదం
environmental geosciences పర్యావరణ భూవిజ్ఞానశాస్త్రం
environmental impact analysis పర్యావరణ ప్రభావ విశ్లేషణ
environmental parameters పర్యావరణ పరామితులు
environmental planners పర్యావరణ పథక రచయితలు/కర్తలు
environmental science పర్యావరణశాస్త్రం
environmental simulation model పర్యావరణ మిథ్యాప్రతిరూపం
environmentalism పరిసరప్రాధాన్యవాదం
environmentalist పర్యావరణశాస్త్రజ్ఞుడు
environs శివారు/పరిసర ప్రాంతాలు
envisage ఊహించు ఎదుర్కొను
envoy రాయబారి దూత
envoy extra-ordinary and minist అసాధారణ ర్ఆయబారి పూర్ణాధికారంగల మంత్రి
envy n అసూయ ఈర్ష్య v ఈర్ష్యపడు అసూయ పడు
enzyme కిణ్వం
epanalepsis ద్విరుక్తి
epaulette (సేనాధికారుల) భుజకీర్తులు
epenthesis పదమధ్యాగమం
ephemeral అశాశ్వత క్షణిక క్షణభంగుర అల్పాయుష్క
ephemeris పంచాంగం
epi బాహ్య
epic adj మహనీయ పురాణ సంబంధి n మహాకావ్యం ఇతిహాసం వీరగాథ పురాణం
epicarp బాహ్యచర్మం
epicene ఉభయలింగి మహన్మహతీ (వాచక)
epicenter (భూకంపన) అధికేంద్రం
epicotyl ఊర్ధ్వదళభాగం
epicranial కపాల బాహ్యస్తరం
epicurean విషయాసక్తుడు; భోగపరాయణ విలాసభరిత
epidemic సాంక్రామిక తాత్కాలికరుగ్మత
epidemic diseases అంటువ్యాధులు సాంక్రామిక వ్యాధులు
epidermis బాహ్యచర్మం
epididymis అధివృషణిక
epigastric జఠరాశయోదర ప్రదేశం
epiglottis ఉపజిహ్వ; కంఠమూలం
epigram సంక్షిప్త రచన; చతురోక్తి
epigraph శిలాశాసనం
epigraphy శాసనశాస్త్రం ప్రాచీనలిపిశాస్త్రం
epilatory కేశవృద్ధినిరోధకం
epilepsy మూర్ఛ అపస్మారం
epileptic మూర్ఛరోగి; అపస్మార సంబంధి
epilogue ఉపసంహారం
epiphora అశ్రుపాతబాహుళ్యం కన్నీరు ఎక్కువగా కారటం
epiphyse అంటుబెట్టు
epiphysis ఎముక కొన(భాగం) అస్థ్యగ్రం
episiotomy భగచ్ఛేదన
episode ఉపాఖ్యానం అంతర్గాథ ఘటన
epistaxis ముక్కునుంచి రక్తం కారటం
epistemology జ్ఞానమీమాంస
epistle ధర్మపత్రం (నీతిబోధగల) రచన/పత్రం; ఉత్తరం
episyllogism అనంతరానుమానం
epitaph సమాధిమీది రాత
epithelium ఉపతలం
epithet విశేషణం గుణవాచకం
epitome సారాంశం సార (సంగ్రహం) సంక్షేపం
epitrochoid ఉపత్రిచ్ఛేదం
epoch యుగం శకం కాలం
epoch-making మహత్తర యుగప్రవర్తక
equal adj సమ సమాన తుల్య n సమం సమానం తుల్యం v సమం చేయు సమానం చేయు
equal opportunity సమానావకాశం
equalise సమానం చేయు తుల్యీకరించు
equality సమత సమానత; సమానాధికారం
equality of opportunity సమానావకాశం
equanimity సమ దృష్టి/బుద్ధి; శాంతి శాంతం
equate సమంగా చూచు సమానమని భావించు సమం చేయు
equated సమీకృత
equation సమీకరణం సమానత
equator భూమధ్యరేఖ విషువద్రేఖ
equestrain adj ఆశ్విక అశ్వారోహణ సంబంధి అశ్వారోహి n ఆశ్వికుడు రౌతు
equi-angular సమకోణీయ
equi-distant సమదూర(స్థ)
equilateral సమబాహు
equilibrant నిశ్చలత్వకారి
equilibrium సమస్థితి సమతౌల్యం సరితూకం; సమతాస్థితి
equilibrium of demand supply గిరాకీ సరఫరాల సమస్థితి/సమతౌల్యం
equimarginal సమానమైన/సరిహద్దులున్న
equi-multiple సమగుణిజం
equine గుర్రానికి చెందిన అశ్వసంబంధి
equinox సమరాత్రిందిన సమయం విషువం
equinoxes విషువత్తులు
equi-numerant సమాంకం
equip సమకూర్చు సజ్జీకరించు క్రమపద్ధతిలో (నౌక మొ.) సిద్ధపరచు
equipment (సాధన) సామగ్రి సరంజామా పరికరాలు ఉపకరణాలు
equipoise సమస్థితి సమతౌల్యం సరితూకం
equitable ఉచిత న్యాయ/ధర్మ బద్ధ న్యాయస్థానంలో నెగ్గే
equities సమాన భాగాలు సాధారణ భాగాలు
equity న్యాయం ధర్మం
equity capital సమాన మూలధనం
equivalence తుల్యత సమపరివృత్తి
equivalent adj తుల్య సమ; సమానార్థక n అస్పష్టం అనిశ్చితం సందిగ్ధం
equivalent talk సమ సంభాషణ
equivocal అస్పష్ట అనిశ్చిత సందిగ్ధ
equivocate అస్పష్టంగా/సందిగ్ధంగా మాట్లాడు
equivocation సందిగ్ధత; వాగ్బలం సందిగ్ధతాభాస
era శకం యుగం
eradicate తుడిచిపెట్టు తొలగించు నిర్మూలించు ధ్వంసంచేయు
eradication నిర్మూలన
erase తుడిచివేయు తీసివేయు
erect adj నిటారు(గా ఉన్న) నిలువు(గా ఉన్న) v కట్టు; నిర్మించు స్థాపించు
erection నిగడటం ఉత్థానం
erisdendron anfractuosum బూరుగ
ermine తెల్లని అడవిపిల్లి
erodability క్రమక్షీణత
erode కోయు కోసుకపోవు
erosion అరుగుదల ఒరపిడి; కోత క్రమక్షయం
erotic శృంగార/మోహ పూరిత కామోద్దీపక
erotomania మదపిచ్చి
err పొరపడు తప్పుచేయు
errand పనిమీద ప్రయాణం వార్తావహుడికిచ్చిన ప్రత్యేకమైన పని; ప్రయాణకారణం
errant సాహసయాత్ర; వక్రమార్గం విపథనం
erratic అస్థిర అనియత అనిశ్చిత అవ్యవస్థిత అపసవ్య
erratum తప్పొప్పుల/సవరణ పట్టిక శుద్ధప్రతి
erroneous తప్పయిన పొరపాటైన భ్రమపూరిత
error అపరాధం; తప్పు పొరపాటు
eruciform గొంగళిపురుగు ఆకారం
erudition సంచిత జ్ఞానం ఆర్జిత పాండిత్యం
eruption విస్ఫోట(నం); హఠాత్తుగా పేలటం/పగలటం
erythema చర్మం ఎర్రబడటం/కందటం
erythrina indica మోదుగ
erythroxylon aroclatuon/monogy దేవదారు
escalade అధిరోహణ (కోటగోడలు) ఎగబాకటం
escalator కదిలే మెట్లు చలత్సోపానం
escapade పలాయనం పారిపోవటం
escape n పలాయనం విముక్తి విమోచనం v తప్పించుకొను పారిపోవు పలాయనం చిత్తగించు విముక్తిపొందు
escape assessment పన్ను తప్పించుకొను
escapement విరుగడ
escapism పలాయనవాదం
escarp వాలుగా ఉంచు
escarpment (కోటగోడల) లోపలివాలు
eschatology మరణానంతర జీవచరిత్ర
escheat (వారసులు లేనందువల్ల) ప్రభుత్వానికి సంక్రమించే ఆస్తి; రాజగామిత్వం
eschew పరిహరించు తొలగిపోవు దూరంగా ఉండు
escort n (అంగ)రక్షకుడు v (రక్షణార్థం) వెంబడించు/వెంటపోవు
escribe బహిర్లేఖనం
esophagus అన్నవాహిక ఆహారనాళం
esoteric నిగూఢ రహస్య; కొందరికే అర్థమయ్యే అంతేవాసికి చెప్పదగ్గ
especially ముఖ్యంగా ప్రముఖంగా
espionage గూఢచారిత్వం వేగుపద్ధతి; చారచక్షుత్వం
espouse పెండ్లాడు; స్వాయత్తం చేసుకొను
essay వ్యాసం; సాధన ప్రయత్నం
essay type వ్యాసరూపక
essence సారం సారాంశం
essential n ఆవశ్యక అనివార్య ముఖ్య అత్యవసర ప్రధాన adj ఆవశ్యకం అవసరం ప్రధానం; విధాయకం
essential commodities నిత్యావసర వస్తువులు అత్యవసర వస్తువులు
essential oil సుగంధ తైలం
essential services అత్యవసర సేవలు
establish ఏర్పరచు స్థాపించు; ఖాయంచేయు నిరూపించు
establishment సంస్థ; స్థాపన సంస్థాపనం; సిబ్బంది
establishment charges సంస్థావ్యయం సిబ్బంది ఖర్చులు
estate సంపద; (భూ)సంపత్తి ఆస్థి; వ్యవస్థ
estate duty మరణసుంకం
esteem n గౌరవం ఆదరం శ్రద్ధ; ప్రతిష్ఠ v ఆదరించు గౌరవించు సన్మానించు
estimable మాననీయ పూజనీయ మాన్య పూజ్య
estimate n అంచనా v అంచనా వేయు/కట్టు
estimates committee అంచనాల సంఘం
estimation అంచనా; గౌరవం
estimator అంచనాదారు
estoppel ప్రతిబంధకం (స్వకల్పిత) నిషేధం; వాదనిషేధం
estrangement వైమనస్యం విముఖత
estuary ఉప్పు కయ్య నదీముఖద్వారం
et cetera మొదలైన ఇత్యాది వగైరా
etch చెక్కు (నమూనా) తయారుచేయు; నిక్షారితం చేయు
etching చెక్కడం(పని)
eternal శాశ్వత్అ నిత్య
eternity శాశ్వతత్వం; అనంతకాలం
ether ఈథర్
ethereal సుకుమార; దేవతాసంబంధి; ఇథైల్ ఈథరుకు సంబంధించిన; ఖగోళసంబంధి
ethical నైతిక
ethical precepts నైతిక నియమాలు/సూత్రాలు
ethics నీతిశాస్త్రం; నైతిక ప్రవర్తన
ethnic(al) (నిర్దిష్ట) జాతికి/భాషకు చెందిన
ethnocentrism స్వవర్గ సంస్కృతివాదం
ethnography మానవజాతి శాస్త్రం
ethnolinguistics జాతిభాషాశాస్త్రం
ethnology మానవజాతిశాస్త్రం
etiology రోగోత్పత్తిశాస్త్రం
etiquette శిష్టాచారం మర్యాద; రీతి రివాజు
etymology వ్యుత్పత్తి (శాస్త్రం); నిరుక్తి
Euclidean distance త్రిమితీయ దూరం
eudiometer వాయులక్షణమాపకం
eudiometry వాయులక్షణమాపనం
eugenia heyneana జిన్ని
eugenia jumbolana నేరేడు గిన్ని
eugenics సంతతివిజ్ఞానం వంశాభివృద్ధి శాస్త్రం సుజనన సిద్ధాంతం నరవంశ శుద్ధి శాస్త్రం
eulogy ప్రశంస పొగడ్త ప్రశస్తి కీర్తిగానం
eunomy సత్పరిపాలన సుపరిపాలన
eunuch నపుంసకుడు
eunuchoid నపుంసకతుల్యుడు
euphemism శిష్టోక్తి సభ్యోక్తి; ఒక అర్థాలంకారం
euphony శ్రావ్యత
euphorbia tirucath చెముడు
euphoria ఉల్లాసస్థితి
Europe ఐరోపా
euryhaline లవణీయతాసహం
euthanasia బాధానివారణకు చంపటం
evacuant రేచకం
evacuate ఖాళీ చేయు/చేయించు; త్యజించు విసర్జించు
evacuee నిర్వాసితుడు శరణార్థి కాందిశీకుడు
evacuee property నిర్వాసితాస్తి కాందిశీకుల ఆస్తి
evade ఎగవేయు ఠలాయించు
evagination బహిర్వలనం
evaluate విలువకట్టు మూల్యనిర్ధారణచేయు అంచనావేయు
evaluation విలువ కట్టడం; అర్థనిర్ణయం; మూల్యాంకనం మూల్యనిర్ధారణ
evaluation tool మూల్యాంకనోపకరణం
evaluator మూల్యాంకనకర్త
evanescent క్షణిక క్షణభంగుర
evangelist (క్రైస్తవ) ధర్మోపదేశకుడు
evaporate ఇగిరిపోవు ఆవిరిఅగు కనిపించకుండా పోవు బాష్పీభవించు
evaporation బాష్పీభవనం ఆవిరికావటం
evasion ఎగవేత ఠలాయింపు; తప్పించుకోవటం
evasion of tax పన్ను ఎగవేత
evasive నిర్ణయంలేని తప్పించుకునే అస్పష్ట సందిగ్ధ
even adj సమ సమాన తుల్య సరి adv కూడా అయినప్పటికీ v సమం చేయు సమానీకరించు సదృశీకరించు
even front system సహకక్షాపద్ధతి
evening సాయంత్రం సంధ్యాసమయం
eveninger సాయం (సమయ) పత్రిక
event సంఘటన సంభవం
event horizon సంఘటన సంధి/దిగంతం
eventful సంఘటనాత్మక ప్రసిద్ధ; చారిత్రక
eventual ఆఖరి అంతిమ; సంభావిత
eventuality దశ పరిస్థితి సంభావన
eventually చివరకు ఆఖరికి
ever సదా సర్వదా నిత్యం ఎల్లప్పుడు
everacting నిత్యక్రియాత్మక(కం)
evergreen సతతహరిత సస్యశ్యామల; నిత్యనూతన
ever increasing అనుక్షణ వర్ధమాన
everlasting చిరస్థాయి శాశ్వత; అమర
eversion బహిర్వర్తనం
every ప్రతి (ఒక్క) ఒక్కొక్క ప్రత్యేక
every now and then తరుచుగా మధ్యమధ్య(లో) అప్పుడప్పుడు
evict తొలగించు వెళ్ళగొట్టు గెంటివేయు బేదఖల్చేయు
eviction తొలగింపు బేదఖల్ జప్తు
evidence సాక్ష్యం నిదర్శన రుజువు ప్రమాణం
evident వ్యక్త స్పష్ట జ్ఞాత ప్రత్యక్ష; వివరమైన
evil n కీడు చెరుపు పాపం దుష్కర్మ adj అశుభ దుష్ట అరిష్ట చెడ్డ
evince చూపు ప్రదర్శించు ప్రకటించు
evisceration శరీరకుహరావయవచ్ఛేదనం
evocation పిలుపు పరీక్షాధికారం; పునర్విచార ణాధికారం
evoke పిలుచు పరీక్షించు పునర్విచారించు; ఆవాహనచేయు
evolution పరిణామం క్రమవికాసం పరిణామ క్రమం
evolutionary పరిణామశీల వికసిత పరిణామాత్మక వికసనశీల
evolutionism పరిణామ సిద్ధాంతం
evolve పరిణమించు; పుట్టు కలుగు; సృష్టించు కల్పించు
ex పూర్వ మాజీ గత మునుపటి
ex-dividend లాభాంశరహితంగా
ex-factory కర్మాగారం దగ్గరి
ex-gratia అనుగ్రహంవల్ల
ex-gratia payment అనుగ్రహంతో చెల్లింపు
ex-minister మాజీ మంత్రి
ex-official పూర్వాధికారి మాజీ ఉద్యోగి
ex-officio ఉద్యోగరీత్యా అధికారరీత్యా
ex parte ఏకపక్ష
ex parte decree ఏకపక్ష నిర్ణయం
ex-servicemen మాజీ సైనికుడు
ex-ship ఓడపైన
ex-stipulate పుచ్చ్హరహిత పత్రం
ex tempore ఆశువుగా
exacerbation వ్యాధి/రోగ ప్రకోపం వ్యాధి ముదరటం/ముమ్మరంకావటం
exact adj సరయిన ఖచ్చితమైన నిర్దిష్ట v రాబట్టు; నిర్బంధించి పనిచేయించుకొను
exacting కఠిన తీవ్ర బాధాకర నిర్బంధక
exaction బలవంతపు వసూలు అన్యాయంగా రాబట్టడం
exaggerate అతిశయోక్తిగా చెప్పు పెద్దది చేసి చెప్పు
exaggerated పెంచి చెప్పిన అతిశయోక్త
exaggeration అతిశయోక్తి అత్యుక్తి
exalt పొగడు ప్రశంసించు పెంచు ఉన్నత స్థానంలో ఉంచు
examination పరీక్ష శోధన విచారణ పరిశీలన
examination blood రక్తపరీక్ష
examination form పరీక్షాపత్రం
examination medicolegal న్యాయవైద్య పరీక్ష
examination physical శారీరక పరీక్ష; భౌతిక/వాస్తవిక పరిస్థితి పరిశీలన
examination postmortem శవపరీక్ష
examination proctoscopic గుదదర్శన పరీక్ష
examination sputum గల్లపరీక్ష కళ్ళెపరీక్ష
examination stool మలపరీక్ష
examination urine మూత్రపరీక్ష
examine పరీక్షించు శోధించు పరిశీలించు విచారించు
examinee పరీక్షితుడు; నిందితుడు
examiner పరీక్షకుడు పరిశీలకుడు శోధకుడు; విచారణకర్త
example ఉదాహరణ నిదర్శన సాక్ష్యం దృష్టాంతం
exanthema స్ఫోటక జ్వరం
exasperate రెచ్చగొట్టు ఉద్రేకపరచు ఉద్వేగపరచు ఉత్తేజపరచు
exasperation ఉత్తేజం ఉద్వేగం ఉద్రేకం
excavate తవ్వు
excavation తవ్వకం ఖననం ఖాతం
exceed ఎక్కువగు అధికమగు మీరు మించు అతిక్రమించు
excel మించు మీరు మిన్న/మేటి అగు అధిగమించు
excellence ఉత్కృష్టత శ్రేష్ఠత సమర్థత ప్రాశస్త్యం
excellent శ్రేష్ఠ ఉత్తమ గుణవంత; దివ్య; ప్రశస్తతమం
except prep తప్ప తక్కిన మిగిలిన మినహా v తొలగించు మినహాయించు; అభ్యంతరం చెప్పు
exception మినహాయింపు అపవాదం
exceptional అసాధారణ అసామాన్య అపూర్వ అనిదంపూర్వ అరుదైన
exceptionality విలక్షణత
excercise వ్యాయామం అభ్యాసం
excerpt n సంగ్రహం సారాంశం ఉద్ధరణ ఎత్తిరాసిన అంశం v ఉద్ధరించు ఉట్టంకించు సంగ్రహించు ఎత్తిరాయు
excess ఆధిక్యం పెంపు
excess profit tax అధికలాభాలమీద పన్ను
excessive అపరిమిత అమిత అధిక అతి(శయిత); మితిమీరిన
exchange n మారకం వినిమయం మార్పిడి
exchange jobber మారకపు వ్యాపారి
exchange pegging మారకం స్థిరీకరణ
exchange rate మారకంరేటు
exchangeability వినిమయ సాధ్యత
exchangeable వినిమయ సాధ్య
exchequer ప్రభుత్వ కోశం/ఖజానా
excircle బాహ్యవృత్తం
excise n ఉత్పత్తి v తొలగించు వేరుచేయు
excise duty (స్వదేశీ ఉత్పత్తులమీద) పన్ను/సుంకం
excission విచ్ఛేదనం
excitation ప్రకోపనం ప్రేరేపణ; ఉద్రేకం
excite ఉసిగొలుపు ఉద్రేకపరచు ఉత్తేజపరచు
excited ఉద్రిక్త ఉత్తేజిత
excitement ఉద్రేకం ఉద్రిక్తత ప్రకోపనం
exciting ఉత్తేజక ప్రకోపక ప్రేరేపక ఉద్రేకకారి
exclaim ఆశ్చర్యపడు; గట్టిగా చెప్పు/అరచు కేక పెట్టు/వేయు
exclamation ఆశ్చర్యార్థకం; ఆశ్చర్యం భావాతిశయం ఉద్ధారం
exclude మినహాయించు తప్పించు తొలగించు
exclusion మినహాయింపు తొలగింపు; బహిష్కారం బహిష్కరణ
exclusive ప్రత్యేక సురక్షిత విశిష్ట అనితర; సొంత స్వీయ
exclusive jurisdiction ప్రత్యేకాధికారపరిధి
exclusive pronoun వినార్థక సర్వనామం
excommunicate బహిష్కరించు; వెలి వేయు/పెట్టు
excommunication బహిష్కరణ వెలి
excrescence విపరీత వృద్ధి
excression శ్రమ
excreta మలమూత్రాదులు
excrete విసర్జించు
excretion విసర్జన(నం)
excruciate వ్యధ/బాధ కలిగించు/పుట్టించు వేదన పుట్టించు
excruciating వేదనాత్మక బాధామయ వ్యధాయుత
exculpate నిర్దోషి/నిరపరాధి అని నిరూపించు/రుజువుచేయు
excursion (వినోద) యాత్ర/పర్యటన విహార/విజ్ఞాన యాత్ర
excusable క్షమార్హ క్షమించదగ్గ
excuse n క్షమాపణ మన్నింపు; సాకు నెపం v క్షమించు మన్నించు; సాకులు చెప్పు
execute అమలుపరచు నిర్వహించు; (పత్రాలు) రాయు/రాసి ఇచ్చు; ఉరితీయు
execute a contract ఒప్పందం కుదుర్చుకొను
executent పత్రం/దస్తావేజు రాసిన వ్యక్తి పత్రకర్త
executer నిర్వాహకుడు అమలుదారు
execution నిర్వహణ; అమలు; ఉరిశిక్ష; (పత్రాలు/దస్తావేజులు) రాయటం/రాసి ఇవ్వటం
execution of a decree న్యాయనిర్ణయాన్ని అమలుపరచటం
executioner తలారి ఉరితీసే వ్యక్తి
executive adj కార్యనిర్వాహక (పరి)పాలక; శాసనాలు అమలుపరిచే n కార్యనిర్వాహకుడు పరిపాలకుడు; శాసనం అమలుపరిచే వ్యక్తి
executive committee కార్యనిర్వాహకవర్గం
executive editor పర్యవేక్షక/నిర్వాహక సంపాదకుడు
executive power కార్యనిర్వహణాధికారం
executor కార్యకర్త నిర్వాహకుడు
exemplary ఆదర్శప్రాయ మార్గదర్శక విలక్షణ గుణపాఠం నేర్పే
exemplary punishment గుణపాఠం నేర్పే శిక్ష; కఠోరశిక్ష
exemplify ఉదాహరించు నిదర్శించు (దృష్టాంతంగా) వివరించు
exempt adj మినహాయింపు మన్నన; విడుదల చేయదగ్గ/మినహాయించదగ్గ వ్యక్తి/నిందితుడు n మినహాయించు మన్నించు
exemption మినహాయింపు; రాయితీ
exercise n అభ్యాసం ప్రయోగం; వ్యాయామం; సాధనం v చెలాయించు; అభ్యసించు ప్రయోగం చేయు; వ్యాయామం చేయు
exercise of rights హక్కుల వినియోగం/చెలాయింపు
exert ప్రయాసపడు శ్రమపడు శ్రమించు పరిశ్రమించు
exertion ప్రయాస శ్రమ పరిశ్రమ
exfoliation కణచ్యుతి కణాలు రాలిపోవటం
exhalation నిశ్శ్వాస(సం) ఊపిరి విడవటం
exhale నిశ్వసించు శ్వాసవిడుచు
exhaust ఖాళీచేయు పూర్తిచేయు పూర్తిగా వ్యయించు; అలసట/నిస్సత్తువ కలిగించు
exhaustion శూన్యీకరణ(ణం); సమాప్తి ఖాళీ; నిస్సత్తువ నీరసం అలసట
exhaustive సమగ్ర సంపూర్ణ విస్తృత
exhibit n ప్రదర్శితం ప్రదర్శిత పత్రం/వస్తువు v ప్రదర్శించు కనబరచు చూపు
exhibition ప్రదర్శన
exhibitionism ప్రదర్శన వాదం/తత్వం/స్వభావం
exhilarant ఉల్లాసకారి ఆనందకారకం
exhilaration ప్రసన్నత ప్రఫుల్లత ఉల్లాసం ఆనందం
exhort ప్రేరేపించు ప్రోత్సహించు ఉద్బోధించు
exhortation ఉద్బోధ ప్రేరేపణ ప్రోత్సాహం
exigency అక్కర అగత్యం అవసరం ఆవశ్యకత
exile n (దేశ) బహిష్కృతుడు; (దేశ) బహిష్కారం; ప్రవాసితుడు ప్రవాసం v (దేశం నుంచి) బహిష్కరించు ప్రవాసానికి పంపు
exine కవచం
exist ఉండు జీవించు
existence ఉనికి అస్తిత్వం జీవనం
existent ఇప్పటి; సజీవ ప్రచలిత
existentialism అస్తిత్వవాదం
existential vaccum అస్తిత్వశూన్యత
existing సజీవ ఇప్పటి ప్రచలిత వర్తమాన
existing law ప్రచలిత న్యాయం/శాసనం వర్తమానశాసనం
exit నిష్రమణ (మార్గం); బహిర్గమనం
exjudge మాజీ న్యాయమూర్తి
exo బాహ్య
exocentric బహిఃకేంద్రక
exocentric compound బహువ్రీహి సమానం
exo-centric construction బహిఃకేంద్రక నిర్మాణ(క్రమం)
exocrine బాహిరస్స్రావి బహిస్స్రావి; అంతస్స్రవణం
exodermis బాహ్యచర్మం
exodus మహానిర్గమనం మహాప్రస్థానం మహాప్రవాహం
exogamy శాఖాంతరవివాహ విధి/విధానం
exogenous బయటి బాహిర; బహిర్జన్య బహిరుత్పన్న బహిర్జాత
exonerate నిర్దోషి అను; (నేరం/ఆరోపణల నుంచి) విముక్తునిచేయు
exoneration విముక్తి విమోచన విడుదల; నిర్దోషిత్వం
exorbitant అత్యధిక అపరిమిత
exorcise ఉచ్చాటన చేయు దయ్యం వదిలించు
exorcism ఉచ్చాటన దయ్యం వదిలించటం
exoskeleton బాహ్యాస్థిపంజరం
exothermal ఉష్ణమోచకం
exothermic ఉష్ణమోచక
exotic అసాధారణ విలక్షణ; విజాతి విదేశీ
exotoxin బహిర్జీవవిషం
expand విస్తరించు వికసింపజేయు వ్యాప్తిచేయు వ్యాపింపజేయు; వ్యాకోచించు వికసించు
expanse విశాల/విస్తృత ప్రదేశం
expansion వ్యాకోచ(నం) విస్తరణ వ్యాప్తి వృద్ధి వికాసం వికసనం
expansionary phase విస్తరణ దశ
expansionist policy విస్తరణ(వాద) విధానం; సామ్రాజ్యవాదం
expatiate వ్యాఖ్యానించు వివరించు విశదీకరించు
expatriate (స్వదేశంనుంచి) బహిష్కరించు/నిర్వాసితునిచేయు
expatriation దేశబహిష్కరణ/నిష్కాసనం
expect ఆశించు; ఎదురుచూచు
expectancy ప్రతీక్ష ఉత్కంఠ ఆశ ఆకాంక్ష
expectant ఆశావాది; నిరీక్షిస్తున్న
expectant mother గర్భవతి గర్భిణి
expectation నిరీక్ష(ణ) ఎదురుచూపు ఆశ
expected ఆశించిన ఉద్దిష్ట
expectorant కఫోత్సారకం
expectoration కఫోత్సారణం కఫం ఉమ్మటం
expediency ఉపయోగిత ప్రయోజనకారిత్వం; స్వార్థం స్వప్రయోజనం ఉపాయం తాత్కాలికావసరం
expedient ఆవశ్యక ఉపయోగకర ప్రయోజనకారి వాంఛనీయ లాభప్రద లాభసాటి
expedition అన్వేషయాత్ర; సహ యాత్ర/ప్రయాణం (దండ) యాత్ర; సాహసయాత్ర
expeditionary force దండయాత్రకు పోతున్న సేన
expeditious త్వరిత శీఘ్ర
expeditiously త్వరితంగా శీఘ్రంగా
expel వెళ్ళగొట్టు బహిష్కరించు
expend వ్యయించు ఖర్చుపెట్టు
expenditure వ్యయం ఖర్చు
expenditure tax వ్యయం/ఖర్చు మీద పన్ను
expenses ఖర్చులు
expensive ఖరీదైన విలువగల
experience n అనుభవం అనుభూతి v అనుభవించు పొందు
experiment n ప్రయోగం v ప్రయోగం చేయు పరీక్షించు
experimental ప్రయోగాత్మక ప్రాయోగిక
experimental explosion పరీక్షాత్మక/ప్రయోగాత్మక విస్ఫోటనం
experimental farm ప్రయోగాత్మక వ్యవసాయక్షేత్రం
experimental period పరీక్షా/ప్రయోగ కాలం
experimental phonetics ప్రాయోజక/ప్రయోగాత్మక ధ్వనిశాస్త్రం
experimentalism అనుభవమూల విజ్ఞాన(వాదం)
expert adj నిపుణ కుశల సమర్థ నేర్పుగల n సమర్థుడు కుశలుడు నిపుణుడు నేర్పరి ప్రవీణుడు
expert committee నిపుణుల సంఘం
expertise వైపుణ్యం ప్రావీణ్యం
expiate ప్రాయశ్చిత్తం చేసుకొను
expiration సమాప్తి అంతం; మృత్యువు/చావు; ముగింపు; నిశ్వాసం
expire కాలం తీరు/పూర్తి అగు అంతమగు; చచ్చు; గడువుతీరు
expiry ముగింపు అంతం సమాప్తి
explain అర్థంచెప్పు వివరించు విశదపరచు సృష్టం చేయు
explanation వివరణ అర్థం; సంజాయిషీ సమాధానం
explanatory వివరణాత్మక విశదీకరించే
explicit స్పష్ట ప్రత్యక్ష వ్యక్త
explicitly స్పష్టంగా వివరంగా
explode పేలు విస్ఫోటించు
exploit n మహత్కార్యం సాహసకృత్యం v వినియోగించు (సొంతానికి/స్వార్థానికి) ఉపయోగించు/వినియోగించు; లాభప్రదం చేయు
exploitation పూర్తి వినియోగం పూర్ణోపయోగం; స్వలాభార్జన; దోపిడీ; పీడన
exploitation of labour శ్రమదోపిడీ
exploitation of resources సహజ సంపదల/వనరుల వినియోగం
exploration అన్వేషణ
exploration geology అన్వేషణాత్మక భూగర్భశాస్త్రం
exploratory అన్వేషణాత్మక
explore అన్వేషించు
explorer అన్వేషకుడు
explosion పేలుడు విస్ఫోటం
explosion of knowledge జ్ఞానవిస్ఫోటనం
explosive adj పేలే ప్రమాదకర n పేలుడు పదార్థం/సామగ్రి
explosive device విస్ఫోటన సాధనం
explosive expert విస్ఫోటన నిపుణుడు
exponent ప్రతిపాదకుడు వ్యాఖ్యాత; ప్రతినిధి; సూచకం; ఘాతాంశం
exponential rate ఘాతాంశ/సూచక వేగం
export n ఎగుమతి v ఎగుమతి చేయు
export credit ఎగుమతి పరపతి
export duty ఎగుమతి సుంకం
export earnings ఎగుమతి ఆర్జనలు ఎగుమతులవల్ల ఆదాయం
exporting country ఎగుమతిచేసే దేశం
export quality control ఎగుమతుల గుణ నియంత్రణ
export promotion ఎగుమతి ప్రోత్సాహం
export promotion scheme ఎగుమతి ప్రోత్సాహ పథకం
exporter ఎగుమతిదారు
expose బయలుపరచు బహిరంగం చేయు తిప్పి చెప్పు వెల్లడించు
exposition ప్రతిపాదన వివరణ వ్యాఖ్యానం; వెల్లడి
expostulation హితోపదేశం సవినయ ప్రతిపాదన; కూడదని వాదించటం
exposure బహిరంగపరచటం గురికావటం; తెరచి ఉంచటం బయటపడటం; అవగాహన
expound వ్యాఖ్యానించు వివరించు ప్రతిపాదించు
expounder వ్యాఖ్యాత వివరణకర్త
express adj త్వరిత; ప్రకటిత స్పష్ట v ప్రకటించు వ్యక్తపరచు తెలియజేయు
expressible వ్యక్తీకరించదగ్గ
expression వాక్కు అభివ్యక్తి మాటతీరు ఉక్త (భావ) రీతి శైలి; ముఖవైఖరి
exprobation దూషణ
expropriate (ఆస్తి) హక్కును స్వాధీనం చేసుకొను సంపత్తి హరించు బేదఖల్చేయు
expropriation హరణం బేదఖల్ స్వాధీనత
expulsion బహిష్కారం బహిష్కరణ
expunge కొట్టివేయు తొలగించు తీసివేయు రద్దుచేయు
expurgate శుద్ధిచేయు సంస్కరించు
extant సజీవ మిగిలిన; ఇప్పటి నేటి ఈనాటి
extend పొడిగించు పెంచు పెద్దదిచేయు విస్తరించు
extended morph విస్తారిత పదాంశం
extension (కాల) విస్తరణ వ్యాపనం పొడిగింపు చాచటం సాగదీయటం
extensive విస్తృత విశాల; విస్తారవాదం
extensive agriculture/cultivation విస్తృత వ్యవసాయం
extensometer దైర్ఘ్యవృద్ధిమాపకం
extent విస్తృతి మేర వ్యాప్తి పరిధి పరిమాణం విరివి ఆయతనం వైశాల్యం
extenuate తగ్గించు బలహీనపరచు తగ్గించి చెప్పు
exterior వెలుపలి బయటి బాహ్య బాహిర; బయట కనిపించే; బాహ్య ప్రదేశం/ఆవరణ
exterminate నిర్మూలించు నాశనం చేయు
external బయటి వెలపలి బాహ్య; విదేశీ(య)
external auditory canal బాహ్యశ్రవణకుల్య
external bill విదేశీ హుండీ
external command బాహ్యాదేశం
external examination బాహ్యపరీక్ష
external publicity division విదేశప్రచార విభాగం
external sandhi పదాంత సంధి
externalism బాహ్యవస్తువిజ్ఞానవాదం
externally బాహ్యంగా బయటికి
extinct నశించిన చచ్చిన అంతరించిన విలుప్త క్షీణ నిర్మూలిత
extinction వినాశం విలుప్తి; నిర్మూలన
extinguish (మంటలు) ఆర్పు పడగొట్టు నిర్మూలించు
extinguishment కర్తవ్య నిర్మూలన(నం)
extirpate దుంపనాశం చేయు వినిర్మూలించు (సమూలంగా) పెకలించు
extol ప్రశంసించు ప్రస్తుతించు కీర్తించు పొగడు
extort బలవంతంగా తీసుకొను/లాక్కొను (డబ్బు) గుంజు/దండు కొను
extort confession of guilt బలవంతంగా నేరమొప్పించు
extortion బలవంతపు వసూలు బలాత్కార స్వీకరణ
extra అదనం అధికం అసాధారణం
extra-curricular విద్యేతర పాఠ్యాంశేతర
extra-departmental staff శాఖేతర సిబ్బంది
extra-departmental system శాఖేతర వ్యవస్థ
extra systole క్రమరహిత హృదయస్పందన
extra-territorial loyalty విదేశాభిమానం
extract n ఉద్ధరణ సంగ్రహం సారాంశం ఎత్తిరాసిన అంశం ఖండన ఉల్లేఖనం v ఉద్ధరించు ప్రతిసమర్పించు
extraction సేకరణ సంగ్రహణం; (పన్ను) పీకటం
extraction ratio సంగ్రహణ నిష్పత్తి
extractive సంగ్రహణ రూపి సార సంగ్రహప్రాయ
extradition (పరదేశీ) దోషిని/అపరాధిని అప్పగించటం ప్రత్యర్పణ ప్రతిసమర్పణ తిరిగి అప్పగించటం
extraneous అన్య ఇతర సంబంధంలేని
extraordinary అసాధారణ అపూర్వ విలక్షణ విశేష
extrapolation బాహ్యనిక్షేపం; బహిర్వేశనం
extra premium అదనపు ప్రీమియం
extra risk అదనపు ప్రమాదం
extravagance అతివ్యయం విపరీత వ్యయం దుబారా (ఖర్చు); అనియంత్రత
extravagant అనియంత్రిత అమిత అపరిమిత అతి విపరీత
extravasation పరిస్రావం
extreme adj అంత్య చివరి తీవ్ర n కొస కొన హద్దు; అంత్యరాశి
extremism అతివాదం తీవ్రవాదం ఉగ్రవాదం
extremist అతివాది తీవ్రవాది ఉగ్రవాది
extremity తీవ్రత తీవ్రదశ; చిట్టచివర అంత్యం
extricate విడిపించుకొను విముక్తి పొందు విడివడు బయటపడు
extrinsic బాహిర బహిర్గత
extrovert బహిర్వర్తనుడు
extrusion బహిష్కరణం
exuberant సమృద్ధ సంపన్న; అఖండ
exudate రసి శోథస్రావం స్వేదనం
exudation స్వేదనం
exult బ్రహ్మానందపడు అమితంగా సంతోషించు
eye కన్ను నేత్రం; దృష్టి; చూచు
eyeball కనుగుడ్డు నేత్రగోళం
eyebrow కనుబొమ్మ భ్రుకుటి
eyelash కనురెప్ప వెంట్రుకలు
eyelet stitch కాజా కుట్టు
eyelid కనురెప్ప
eye-opener కళ్ళు తెరిపించే హెచ్చరించే గుణపాఠం నేర్పే
eyepiece అక్షికటకం
eye sore కనుకుట్టు; బాధించే అసహ్యమైన
eye specialist నేత్రవైద్య నిపుణుడు
eyewitness ప్రత్యక్షసాక్షి
eleventh hour ఆఖరిక్షణం అంతిమఘడియ తుది సమయం
eat a humble pie తలవంచు కించపడు; క్షమాపణ చెప్పు
earned leave ఆర్జిత/ఉపార్జిత సెలవు
expectation of life ఆయుష్కాలం
election manifesto ఎన్నికల ప్రణాళిక
easy market సులభవిపణి
exhibition match పోటీ/స్పర్ధా ప్రదర్శన
essential oils సుగంధతైలాలు
eat an humble pie అవమానితుడగు తలవంచు
en route మార్గంలో దారిలో పోతూపోతూ
economic sanctions ఆర్థిక ప్రతిబంధకాలు/ఆంక్షలు
elementary school ప్రాథమిక పాఠశాల
electric shock కరెంటు దెబ్బ విద్యుదాఘాతం
end in smoke వ్యర్థమగు
elder statesman అనుభవజ్ఞుడైన రాజనీతికుశలుడు
eat one's words మాట ఉపసంహరించుకొను; మాట నిలబెట్టు