H

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
have the best of ఉన్నంతలో ఉత్తమంగా
have it both ways విరోధంలోకూడా లాభం పొందు
hair breadth escape వెంట్రుకవాసిలో తప్పించుకోవటం
hold a brief for వకాల్తా చేయు/ఇచ్చు
hand over charge కార్యభారం అప్పగించు/బదలాయించు
high command అధిష్ఠానవర్గం
high court ఉన్నత న్యాయస్థానం
hard currency దుర్లభ కరెన్సీ
honorary degree గౌరవ పట్టా
have to do with సంబంధ ముంచుకొను
have at one’s finger tips కరతలామలకంగా/స్పష్టంగా తెలిసి ఉండు
habeas corpus బంధితుని హాజరుపెట్టి నిర్బంధ కారణాలు చెప్పమనే కోర్టు ఉత్తరువు
habesh కల్తీ
habit అలవాటు
habitat నివాసస్థలం సహజ స్థలం; ఉనికి నివాసం
habitation నివాస(స్థలం) వసతి
habitual అలవాటుపడిన రాటుదేలిన; తద్ధర్మార్ధకం
habitual drunkard తాగుబోతు
habitual offender అభ్యస్తాపరాధి పాతనేరగాడు
habituate అలవాటు పడు/పరచు వాడుకపడు
habituation అలవాటు చేయటం
hacking కోయటం
hackneyed అలవాటయిన గతానుగతిక పునరుక్త; కిరాయి
hack writer కిరాయి రచయిత
haemo రక్త
haemarthrosis కీళ్ళలో రక్తం చేరటం
haematemesis రక్తవమనం నెత్తురు కక్కటం
haematinic రక్తవర్ధిని
haemato colpos రక్తవృషణం బుడ్డలో నెత్తురు చేరటం
haematoma నెత్తురు గడ్డ
haematopoiesis రక్తోత్పత్తి
haematuria మూత్రంలో నెత్తురు పోవటం
haemo concentration రక్తసాంద్రత
haemocytoblast రక్తమూలకణం
haemoglobin రక్తవర్ణం
haemoglobinuria మూత్రంలో రక్తవర్ణం
haemolysis నెత్తురు విరగటం
haemopericardium గుండెచుట్టుపొరల్లో నెత్తురు చేరటం
haemophilia రక్తస్రావలక్షణం
haemopoiesis దగ్గినప్పుడు నెత్తురు పడటం
haemorrhage రక్తస్రావం
haemorrhage antepartum ప్రసవపూర్వ రక్తస్రావం
haemorrhage cerebral మెదడులో రక్తస్రావం
haemorrhage intestinal ఆంత్ర రక్తస్రావం
haemorrhage postpartum ప్రసవానంతర రక్తస్రావం
haemorrhage uterine గర్భాశయ రక్తస్రావం
haemorrhoids మొలలు
haemostasis రక్తస్తంభన
haemothorax ఉరఃకుహరంలో రక్తం చేరటం
haggard రోగగ్రస్త దుర్బల; వికార భయంకర
haggle n పేచీకోరు బేరం v కొసరి కొసరి బేరమాడు
hail n నమస్కారాలు అభినందనలు; వడగళ్ళు v స్వాగతం చెప్పు కేక వేసి/పెట్టి పిలుచు
hail stone వడగళ్ళు
hail storm వడగళ్ళ వాన
hair జుట్టు కేశం వెంట్రుక
hair’s breadth escape వెంట్రుకవాసిలో తప్పించుకోవటం
hair cells కేశకణజాలం
hair spilitting (అతి)సూక్ష్మ
halcyon days ప్రశాంతదినాలు
hale ఆనందం
hale and hearty ఆరోగ్యానందాలతో
half సగం అర్ధ
half-breed సంకర
half close అర్ధసంవృత
half dead అరపీనుగు
half hearted అర్ధాంగీకారంతో
half life అర్ధాయుర్దాయం
half mast అవనతం(గా)
half measure అసంపూర్ణం అర్ధాంతరం
half open అర్ధవివృత
half revolution అర్ధ పరిభ్రమణం
halftone అర్ధస్వరం
half truth అర్ధ/పాక్షిక సత్యం
half yearly అర్ధసంవత్సర
haliographer సముద్రవర్ణకారి
halitosis నోటిదుర్వాసన
hall పెద్దగది
hall mark ప్రమాణచిహ్నం; ముద్ర మొహరు
hallow పరిశుద్ధం చేయు
hallucination భ్రాంతి విభ్రమం విభ్రాంతి
hallucination auditory శ్రవణభ్రమ
hallucination visual దృష్టిభ్రమ
hallucinogene భ్రమింపజేసేది భ్రామకం
hallux కాలిబొటనవేలు
halo పరివేషం చుట్టు ఉండే వెలుగు ప్రకాశ/కాంతి వలయం
halophyte ఉప్పునీటిమొక్క
halt n విశ్రాంతి విరామం మజిలీ మకాం v ఆగు విశ్రమించు మజిలీ/మకాం చేయు
halter ఉచ్చు; ఉరి
halve సగం చేయు
hamlet పల్లె
hammer n సమ్మెట సుత్తి v సమ్మెటపోటు పెట్టు బలవంతంగా తలకెక్కించు
hammer out the details వివరాలు సిద్ధపరచు/తయారుచేయు
hammer percussion వైద్యుల సుత్తి
hamper ఆటంకపెట్టు అటకాయించు అవరోధించు; మూతగల పెద్ద గంప/బుట్ట
hand n చేయి గడియారం ముల్లు; పనిమనిషి; చేవ్రాలు; భార్యపై భర్త పెత్తనం/నియంత్రణ v చేత్తో ఇచ్చు సాయపడు
hand bill కరపత్రం
hand book చిన్నపుస్తకం వివరణ నిచ్చే పుస్తకం చేపుస్తకం కరదీపిక గైడు
hand composing చేతికూర్పు
hand down సంక్రమింపజేయు తీర్పిచ్చు; కోర్టు నిర్ణయం
hand grenade చే(తి)బాంబు
hand hoe తొల్లిక
hand in hand చేతిలో చేయికలిపి కలిసికట్టుగా ఏకసమయంలో
hand out ప్రకటన కరపత్ర; బిచ్చం
handover అప్పగించు ఒప్పగించు
hand to hand చేతిలో చేయివేసి
hand to hand fight బాహాబాహి/ముష్టి యుద్ధం
have a hand in జోక్యంపెట్టుకొను సంబంధం కలిగి ఉండు
have one’s hands full చేతినిండా పని(తో) ఉండు
handcuff n (చేతి)సంకెల v సంకెళ్ళువేయు
handful పిడికెడు కొద్ది కొంచెం; సాధ్యపడినంత
handicap n ప్రతిబంధకం కష్టం ఇబ్బంది లోపం వైకల్యం; అనుకూల ప్రతికూలాలు v అడ్డుపెట్టు ఆటంకపరచు ఇబ్బంది పెట్టు
hearing handicapped బధిర; బధిరులు
handicraft చేతిపని హస్తకళ
handiwork / handwork చేతిపని కృతి; చేసిన పని
handle n పిడి చేపిడి; ఉపకరించే వస్తువు/విషయం v నడిపించు తిప్పు వ్యవహరించు
handle the situation పరిస్థితిని అదుపులో పెట్టు
handloom చేమగ్గం
handmaid పరిచారిక దాసి సేవకురాలు
handout పరిచాయకం కరపత్రం
handsome సొగసైన చక్కని; ఉదార ఎక్కువ
handwriting దస్తూరి చే(తి)రాత
handy అనువైన వీలైన ఉపయోగకర; నిపుణ
hang వేలాడు; ఉరితీయు
hang about (అటునిటు)తచ్చాడు తిరుగులాడు
hang back వెనక్కుతగ్గు వెనుకచిక్కు; అడ్డుపడు నిరోధించు
hang fire మెల్లగా/తాపీగా పేలు మందకొడిగా ఉండు
hang in the balance ఊగులాడు ఊగిసలాడు అనిశ్చితంగా ఉండు
hang on to (పట్టుకొని) వేలాడు
hangar విమానశాల
hanger-on ఆశ్రితుడు వెంటపడే వ్యక్తి
hangman తలారి ఉరితీసేవ్యక్తి
hanker అత్యాశపడు
hanky-panky గారడీ మోసం గందరగోళం
haphazard దైవాధీన యాదృచ్ఛిక ఆకస్మిక; ప్రమాదవశమైన
haplology సమధ్వని లోపం సవర్ణలోపం
hapoon పంట్రకోల
happen కలుగు సంభవించు
happening సంభవం సంఘటన జరిగింది దుర్ఘటన
happiness సుఖం ఆనందం ప్రసన్నత
happy సంతుష్ట సుఖప్రద సుఖమయ
haptotropism స్పర్శాభిసరణం
hara-kiri హరకిరి ఆత్మ హత్య/హననం
harangue సుదీర్ఘోపన్యాసం గంభీరోపన్యాసం
harass బాధించు క్షోభపెట్టు తొందరపెట్టు
harassment బాధ క్షోభ తొందర తికమక
harbinger అగ్రగామి
harbour n ఓడరేవు నౌకాశ్రయం v ఆశ్రయమిచ్చు రక్షించు కాపాడు
harbouring ఆశ్రయం మివ్వటం
hard adj కఠిన తీవ్ర adv తీవ్రంగా కఠినంగా; శ్రమతో మనస్ఫూర్తిగా
hard and fast కచ్చితమైన నిర్ణిబద్ధ స్థిర
hard and fast rule అనుల్లంఘనీయ/స్థిర నియమం
hard cash నగదు రొక్కం
hard copy output కఠినప్రతి ఉద్పాదితం
hard currency దుర్లభ చెలామణీ
hard currency area దుర్లభ చెలామణీ ప్రాంతం
hard currency rate దుర్లభ చెలామణీ రేటు
hard disk drive కఠినచక్రచోదకం
hard earned కష్టపడి సంపాదించిన
hard labour కఠోర పరిశ్రమ
hard news తాజా/వేడివేడి/గరంగరం వార్తలు
hard palate కఠినతాలువు
hard put (to) కష్టపడు కష్టాల్లోపడు
hard source (వి)స్పష్టాధారం
hard ware కఠిన/స్థిర సామగ్రి
hard ware component కఠిన సామగ్రి భాగం
hard water కఠినజలం; క్షారజలం
hard work కఠోర పరిశ్రమ
harden గట్టి పడు/పరచు
hardly అరుదుగా అపూర్వంగా; కొద్దిపాటి అరుదైన
hardness కఠినత్వం; కష్టాలు
hardship కష్టం శ్రమ ఆయాసం క్లేశం
hardware లోహవస్తువులు పాత్రసామగ్రి
hardy దృఢ గట్టి ధైర్యంగల సాహసిక
hardy annual మామూలు వార్షిక (వృక్షం మొ.)
harelip తొర్రిపెదవి
harm n కీడు హాని నష్టం అపకారం v హాని తలపెట్టు నష్టపెట్టు అపకారం చేయు; గాయపరచు
harmful హానికర అపకారి నష్టదాయక
harmless ప్రమాదరహిత సాధు హానిలేని
harmonic హరాత్మక స్వరాత్మక
harmonically హరాత్మకంగా స్వరాత్మకంగా
harmonics అనుస్వరాలు
harmonious సమరసమైన
harmonize సామరస్యం కల్పించు
harmony సామరస్యం ఏకస్వరం పొందిక; సంగతి ఆకర్షణ ఆనురూప్యం
harness n సజ్జీకరణ దినచర్య; నియంత్రణ ఉపయోగం శ్రమ v సజ్జీకరించు సిద్ధపరచు నియంత్రణకు తెచ్చు ఉపయోగించు
harp (on) రగడ చేయు; పునరుక్తి చేయు పదేపదే చెప్పు/ప్రస్తావించు
harsh కఠిన కర్కశ క్రూర
harvest n పంట కోత(ల సమయం); ఫలితం v పంటను కోయు ఫలితం పొందు
harvest season కోతల/నూర్పిడి సమయం/కాలం
harvesting సేకరణ
haste తొందర హడావుడి త్వర శీఘ్రత
hasten త్వరపెట్టు తొందర పెట్టు చేయు
hasty తొందరపడ్డ
hatch n కిటికీ గవాక్షం; నేలమాళిగ v పొదుగు; (కుట్ర మొ.) పన్ను
hatchery చేపలను పెంచే చెరువు
hatchet చిన్నగొడ్డలి
hate n పగ ద్వేషం v పగపట్టు ద్వేషించు
hatred పగ ద్వేషం
hat-trick (ఆటల్లో) వరసగా మూడుసార్లు ఓడించు/గెలుపుసాధించు; (క్రికెట్లో) పరుగు లివ్వకుండా మూడు వికెట్లను వరుసగా పడగొట్టు
haughty అహంకృత గర్విత అహంకారి
haul లాగు ఈడ్చు తోయు; దొరికిన వస్తువు
haulage ఈడ్పు సుంకం లాగుడు సుంకం
haunt n తరచుగా ఉండే చోటు అడ్డా; భూతం v వెంటాడు వెన్నాడు; పీడించు; పునరుక్తమగు; పునర్భవించు
haven (సహజ) నౌకాశ్రయం; ప్రకృతిసిద్ధ స్థావరం
havoc భారీనష్టం ఉపద్రవం సర్వనాశ(నం)
hawk n గద్ద డేగ; పరోపజీవి పీడించేవాడు; రణోన్మాది v తిరుగుతూ అమ్ము; ఎగురు వేటాడు; కాండ్రించు
hawker (వీధులవెంట తిరుగుతూ) అమ్మే వ్యక్తి/విక్రేత
hay (ఎండు) గడ్డి
hayfever కసవువల్ల వచ్చే జ్వరం
hazard ప్రమాదకర అపాయకారి v తెగించు సాహసించు
hazardous ప్రమాదకర అపాయకారి
hazard prone ప్రమాదశీల ప్రమాదకారి
haze పొగ(మబ్బు); మసక అస్పష్టత
hazy మబ్బుమబ్బుగా మసకగా అస్పష్టంగా
head adj ముఖ్య ప్రధాన n తల శిరస్సు ముఖభాగం; శిఖరం ఉచ్చదశ; ఉద్దేశం; ముఖ్యుడు v నడిపించు నాయకత్వం వహించు ప్రధానుడుగా ఉండు
head chieftain ప్రధాన గణనేత కులపెద్ద ప్రధానాధికారి
head-light అగ్రదీపం అగ్రప్రకాశం
headline వార్తాశీర్షిక; ముఖ్యసమాచారం
head office ప్రధానకార్యాలయం
head quarters ప్రధాన కేంద్రం/కార్యాలయం/కార్యస్థానం
head strong తలబిరుసు పొగరెక్కిన
head village గ్రామాధికారి; గ్రామపెద్ద
headworks నీటిపారుదల కాలవలు తీసే చోటు
headache తలనెప్పి శిరోవేదన శిరోభారం
header (=slug) శీర్షిక మొదటి
header and trailor records మొదటి చివరి కవిలెలు
heading శీర్షిక
headland ద్వీపకల్పం; (హద్దులదగ్గర) సాగుచేయని భూమి
headman (కుల)పెద్ద నేత నాయకుడు; ముఖ్యాధికారి
headway ఉన్నతి ప్రగతి (రేటు)
heady ఉగ్ర తీవ్ర ఉత్తేజక మాదక
heal స్వస్థపరచు శాంతపరచు బాగుచేయు నయంచేయు మాన్పు
health ఆరోగ్యం
health community సమాజారోగ్యం
health mental మానసికారోగ్యం
health reporter ఆరోగ్య(వార్తా)విలేఖరి
health resort ఆరోగ్యకేంద్రం
health school బడిపిల్లల ఆరోగ్యం
health story ఆరోగ్యవార్త
health visitor ఆరోగ్య పరీక్షకుడు
healthy ఆరోగ్యవంతమైన
heap n కుప్ప పోగు గుట్ట రాశి v కుప్పవేయు సాగుచేయు
hearing ఆలకింపు విచారణ వినటం
hearsay వినికిడి వదంతి విన్నమాట
hearsay evidence వినికిడి సాక్ష్యం
hearse పాడె శవపేటిక
heart గుండె హృదయం; మధ్యభాగం; అభిరుచి; ధైర్యం సాహసం
have at heart గుర్తుపెట్టుకొను శ్రద్ధచూపు లక్ష్యశుద్ధితో ఉండు
heart attack గుండెపోటు
heart-beat గుండెచప్పుడు హృదయస్పందన గుండె కొట్టుకోవటం
heart-block హృదయస్పందనకు అవరోధం
heart-burn గుండెమంట; హృదయవేదన
heartburning కడుపుమంట; ఈర్ష్య అసూయ
heart-disease గుండె జబ్బు హృద్రోగం
heart failure హృదయ వైఫల్యం
heart felt హృదయపూర్వక మనస్ఫూర్తి అయిన
heart foetal గర్భస్థశిశుహృదయం
heart-rending హృదయవిదారక
heart-searching ఆత్మపరీక్ష
heart wood చేవ
hearten ఉత్సాహపరచు ధైర్యం చెప్పు
hearth and home స్వగృహం సొంత ఇల్లు
heartily మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా
heartless దయలేని నిర్దయ
hearty సంతృప్తికర సౌహార్దపూర్వక; నిజమైన అకృత్రిమ
heat వేడిమి ఉష్ణం తాపం ఆవేశం; ఎద మైథునాసక్తి
heat bank ఉష్ణభండారం
heat capacity mapping తాపసామర్థ్య మానచిత్రణం
heat energy తాపశక్తి
heat of passion భావావేశం క్రోధావేశం ఉద్వేగం ఉద్రేకం
heat prickly చెమటకాయలు చర్మం పేలటం
heat-stroke ఎండదెబ్బ వడదెబ్బ
heat wave వడగాడ్పు వేడిగాడ్పు
heater తాపకం తాపనసాధనం
heathen విగ్రహారాధకుడు ధర్మదూరుడు నాస్తికుడు
heaven స్వర్గం ఆకాశం; దేవుడు
heavenly దివ్య స్వర్గసంబంధి
heavy బరువైన భారమైన భారీ; కఠిన దుఃఖమయ
heavy artillary భారీఫిరంగి దళం
heavy industry భారీపరిశ్రమ
heavy machine building shop భారీయంత్ర నిర్మాణ కర్మాగారం
heavy minerals భారఖనిజాలు
heavy rains భారీవర్షాలు
heavy water భారజలం
hebix కుండలిని
heckle వెక్కిరించు వేళాకోళంచేయు ఎగతాళిచేయు
hectic ఊపిరి సలపని; ప్రచండ; క్షయరోగ సంబంధి
hedge n కంచె వెలుగు దడి v కంచెవేయు దడిగట్టు అడ్డగించు చుట్టుముట్టు ప్రతిరక్ష/పేశ్బందీ చేయు
hedge words నీచ/పనికిమాలిన పదాలు
hedging ద్వైధవ్యాపారం; ప్రతిరక్ష
hedging operation రక్షణకార్యక్రమాలు ప్రతిరక్షాకార్యక్షమాలు పేశ్బందీ
hedonist భోగప్రియుడు
heed n శ్రద్ధ జాగ్రత v శ్రద్ధగా విను లక్ష్యపెట్టు
heedless అజాగరూక ప్రమత్త
heel మడమ
hegemony ప్రాముఖ్యం ప్రాబల్యం నాయకత్వం
height ఎత్తు ఉన్నతి
heighten పెంచు పెద్ద చేయు
heinous నిందనీయ సిగ్గుచేటు ఘోర భయానక క్రూర దుష్ట
heir వారసు(డు) ఉత్తరాధికారి
heir-apparent ఆస్తికి వారసుడు; యువరాజు
heirloom పైతృకాస్తి వారసుడికి సంక్రమించే మృతుడి సామగ్రి
heir-presumptive సంభావిత వారసుడు/ఉత్తరాధికారి
heirarchy ఆధిపత్యశ్రేణి అధికారపరంపర
helicopter గాలిమోటరు
helio-centric సౌరకేంద్రక
heliotropism సూర్యాభిసరణం
hell నరకం పాతాళం భయంకరస్థలం
helm n ఓడచుక్కాని; శిరస్త్రాణం; నాయకత్వం v నడుపు నియంత్రించు
helmet శిరస్త్రాణం శిరఃకవచం
helminth క్రిమి ఎలికపాములాంటి పరాన్నజీవి
help n సహాయం తోడ్పాటు; సహాయకుడు v సహాయపడు తోడ్పడు
helpful సహాయకారి
helping సాయపడే తోడ్పడే
helpless అసహాయ నిస్సహాయ
helpmate సహచరుడు సహాయకుడు
helter-skelter adj adv అస్తవ్యస్తం(గా) తారుమారు(గా) కకావికలు(గా) n అస్తవ్యస్తత
hem n అంచు ఒడ్డు v మడిచి కుట్టు పరివేష్టితమగు
hem about hem in hem round చుట్టుముట్టు పరివేష్ఠితమగు
hemianopsia అర్ధదృష్టి సగంచూపు
hemiatrophy అర్ధాంగక్షయం
hemicrystalline అర్ధస్ఫటిక (ఔషధం)
hemihedrism అర్ధతలసంఘటన
hemiplegia (అర్ధాంగ) పక్షవాతం
hemisphere అర్ధగోళం
hemming ఓరకుట్టు వాలుకుట్టు
hemorrhage రక్తస్రావం
hemostatics రక్తస్రావ నిరోధకాలు
hemp జనపనార; భంగు
hemp Indian గంజా(యి) భంగు
hence ఇందువల్ల ఇకమీద ఇక్కడినుంచి ఈకారణంవల్ల; కాబట్టి
henceforth ఇకమీదట ఇటుపైన
henceforward ఇటుపైన ఇకమీద
henchman ముఖ్యానుచరుడు దాసుడు వత్తాసు కుడిభుజం సహాయకుడు
hepatic కాలేయ సంబంధి
hepatitis కాలేయశోథ
hepatomegaly కాలేయవృద్ధి
heptad సప్తబంధకం
heptegon సప్తభుజి
heptode సప్తధ్రువి
herald n సందేశవాహకుడు వార్తాహరుడు నిర్వాహకుడు (అగ్ర)దూత ప్రకటనకర్త చాటించేవ్యక్తి v ప్రకటించు దండోరా/చాటింపు వేయు నిర్వహించు
herb మూలిక ఓషధి గుల్మం
herbaceous గుల్మకాండం
herbarium మూలికాగారం; శుష్కవృక్షశాల
herbivora శాకాహారి
herbivorous శాకాహార
Hercules భీమబలుడు హెర్క్యులిస్; హరికులేశుడు
herculean task అత్యంత కష్టసాధ్యకార్యం; భగీరథ ప్రయత్నం
herd n మంద గుంపు v మందకట్టు గుమిగూడు కూర్పు
here ఇక్కడ ఈ ప్రదేశంలో
here and there ఇక్కడా అక్కడా
hereby ఇక్కడినుంచి దీనితో
hereinafter దీని తరవాత ఇకమీదట
hereof ఇక్కడినుంచి దీనితో
hereto ఇక్కడ దీనికి
hereupon తదుపరి తరవాత దీనిపై
herewith దీనితో జతపరిచి
hereditament పైతృకం వంశపారంపర్యంగా (వారసత్వంగా వచ్చే ఆస్తి సంక్రమణ యోగ్యాస్తి)
hereditarians ఆనువంశికతావాదులు
hereditary ఆనువంశిక వంశానుగత పరంపరానుగత వారసత్వంద్వారా వచ్చే/సంక్రమించే
hereditary anomaly ఆనువంశిక వైపరీత్యం
hereditary diseases ఆనువంశిక వ్యాధులు
heredity వంశపారంపర్యం ఆనువంశికత; వారసత్వం
heresy సంప్రదాయ విరుద్ధత/వ్యతిరేకత; నాస్తికత్వం
heretic సంప్రదాయవ్యతిరేకి; నాస్తికుడు; మత విరోధి
heritable ఉత్తరాధికారయోగ్య వారసత్వయోగ్య
heritage పైతృకం ఉత్తరాధికారం వారసత్వం వారసత్వ హక్కు/సంపద
hermaphrodite ద్విలింగప్రాణి
hermaphroditism ఉభయలింగత్వం
hernia ఆంత్రవృద్ధి గిలక
hernia femoral తొడమీది/గజ్జకింది గిలక
hernia inguinal గజ్జమీది గిలక
hernia strangulated అడ్డుపడ్డ/అణిగిపోయిన గిలక
hernia umbilical బొడ్డుగిలక
herniorrhaphy ఆంత్రవృద్ధి శస్త్రచికిత్స గిలకకు శస్త్రచికిత్స
hero వీరుడు (కథా)నాయకుడు
heroic విరోచిత శౌర్యవంత
heroine వీరవనిత (కథా)నాయిక
heroism వీరత్వం శౌర్యం పరాక్రమం
herpes సర్పి సలిపి బొబ్బ(లు)
herpes-labialis పెదవులమీది సలిపి/సర్పి
herpes-simplex సామాన్య సర్పి
hesitant అనిశ్చిత ఊగిసలాడే సంకోచించే
hesitate సంకోచించు వెనుకాడు వెనుదీయు
hesitation అనిశ్చితి సంకోచం
hesitation form సంకోచరూపం
heterodox సంప్రదాయ వ్యతిరేక/విరుద్ధ; విపరీత భిన్న మతంగల
heterodoxy సంప్రదాయ వ్యతిరేకత/విరుద్ధత
heterogeneity వివిధత్వం విషమ జాతీయత
heterogeneous నానావిధ బహుజాతీయ విషమ జాతీయ వివిధ
heterology విధర్మత
heteromerous విషమావయవి
heteronym విషమరూపం
heterozygote విజాతీయ సంయుక్తబీజం
heterozygous విషమయుగ్మబీజం
heuristic method అన్వేషణ పద్ధతి
hew (గొడ్డలి మొ.తో) నరుకు ఖండించు
hexad షడ్బంధనం
hexagon షడ్భుజి
hexagonal షడ్భుజ-
hexahedron షట్ఫలకం
hexa number షడంశమాన సంఖ్య
hexode షడ్ధ్వని
hiatus ద్వారం; ప్రకృతిభావం; ఖాళీ విరామం; చీలిక; ప్రక్షిప్తత
hibernate (జంతువులు)సుప్తావస్థలో ఉండు; క్రియాశూన్యంగా ఉండు
hibernation సుప్తావస్థ జీవత్సమాధి నిశ్చలనిద్ర; క్రియాశూన్యత
hibiscus cannabinus గొలుగు
hibiscus sabdaribbra గోగు
hiccough వెక్కిళ్ళు
hidden దాగిన
hide n చర్మం తోలు v దాచు దాక్కొను; తోలుతీయు; కొరడాతో కొట్టు చావగొట్టు
hide and seek దాగుడుమూతలాడు
hideous వికార భయంకర క్రూర
hiding రహస్య స్థావరం/స్థలం; దాపరికం దాచటం; కొరడా దెబ్బ
hierarchy అధికారక్రమం క్రమానుగతి శ్రేణి; సోపాన పరంపర; అధిక్రమం
hieroglyph చిత్రలిపి
higgle చచ్చుబేరమాడు పీకులాట బేరం చేయు
higgling బేరమాడటం
high ఎత్తు; ఉన్నత అధిక; అధికపీడనం గల
high and low పైకీ కిందికీ చిన్నాపెద్దా పేదా గొప్పా నిమ్నోన్నత
high command అధిష్ఠానవర్గం
high commision (కామన్వెల్తులో)రాయబారి కార్యాలయం
high commisioner (కామన్వెల్తులో)రాయబారి
high court ఉన్నతన్యాయస్థానం హైకోర్టు
higher-low అర్ధవివృత(తం)
higher-mid అర్ధసంవృత(తం)
high-frequency అధికావృత్తి
high handed అక్రమ గర్విత అహంకారి
high handedness అక్రమం అత్యాచారం అహంకారం
high level committee ఉన్నతస్థాయి సంఘం
high pitch ఆలోహస్థాయి
high-power commision ఉన్నతాధికార సమితి
high-power committee ఉన్నతాధికార సంఘం
high resolution visible(HRV) సమర్ధదర్శనం
high road రహదారి రాచబాట ఘంటాపథం
high spirits ఉత్సాహం సంతోషం
high treason ఘోరదేశద్రోహం
high water mark ఉచ్చదశ పరాకాష్ఠదశ; చిట్టచివరి వరదనీటిమట్టం
highlight n ప్రధానాంశం ప్రధానదృశ్యం ముఖ్య విషయం ప్రముఖ సంఘటన v నొక్కిచెప్పు; ప్రముఖంగా ప్రకటించు; ముదురు రంగులద్దు
highly coloured రంగులు పులిమిన; పూర్తిగా మార్చి చెప్పిన; అతిశయోక్త
highseas సముద్ర మధ్యం
highsounding శబ్దాడంబరపూర్వక
highway రహదారి రాజమార్గం ఉన్నతపథం
hiking త్వరగా నడవటం కవాతు చేయటం
hill గుట్ట కొండ
hill resort కొండలమీది ఆరోగ్యకేంద్రం
hill station పర్వతప్రాంత పట్టణం/ ఆరోగ్యకేంద్రం
hill tribe కొండజాతి గిరిజనం
hillock చిన్నగుట్ట ఉన్నతభూమి
hilly పర్వతమయమైన
hilt (కత్తి)పిడి
hilum బీజనాభి
hind వెనక(టి) చరమ; ఆడజింక
hinder అడ్డుపడు ఆటంకపరచు
hindrance అడ్డంకి ఆటంకం విఘ్నం
Hinduism హిందూ మతం/ధర్మం
Hindu law హిందూ ధర్మశాస్త్రం/శిక్షాస్మృతి
hinge n మడతబందు; కేంద్ర బిందువు; సూత్రం ఆధారం; మడతబందు(కీలు) v అతుకు అమర్చు; ఆధార పడు/పరచు
hint n సూచన సైగ గుర్తు జాడ v సూచించు సైగచేయు జాడ/గుర్తు చెప్పు
hinterland పృష్ఠభూమి పోషకప్రాంతం
hip తుంటి
hiptage మాధవీలత
hire n కిరాయి అద్దె బాడుగ కూలి v కిరాయికితెచ్చు; కూలికిపనిచేయించు
hire-purchase అద్దె-కొనుగోలు
hireling కూలికి దుర్మార్గాలుచేసేవ్యక్తి; క్షేత్రదాసుడు
hirsuties అతిరోమత్వం
hiss n బుస్సుమనే శబ్దం v బుస్సుమను తిరస్కారం ప్రకటించు
histo కణజాల
histogram సోపానచిత్రం
histology కణనిర్మాణశాస్త్రం
historian చరిత్రకారుడు చరిత్ర పరిశోధకుడు
historic(al) చారిత్రక చరిత్రాత్మక
historic background చారిత్రక నేపథ్యం/పూర్వరంగం
historic occasion చారిత్రక సందర్భం/సమయం
historiography చరిత్ర రచన
history చరిత్ర
history clinical రోగ చరిత్ర
history dietetic ఆహార చరిత్ర
history economic ఆర్థికచరిత్ర
history family కుటుంబ చరిత్ర
history-less చరిత్ర లేని/హీన
history menstraul రుతుచరిత్ర
history obstetric ప్రసూతి చరిత్ర
history personal వ్యక్తి(గత)చరిత్ర
history political రాజకీయ చరిత్ర
history social సమాజచరిత్ర సాంఘికచరిత్ర
histrionic నాటకీయ అభినయపూర్వక
histrionics అభినయ(శాస్త్రం); నాటకీయత; కృత్రిమ ప్రవర్తన
hit n దెబ్బ గాయం; గురి లక్ష్యం; సఫలత v కొట్టు లక్ష్యం సాధించు/నెరవేరు; సఫలమగు
hit back ఎదురుదెబ్బతీయు
hit below the belt దొంగదెబ్బకొట్టు మోసగించు
hit out గట్టిదెబ్బ కొట్టు/తీయు
hit upon దొరుకు లభించు ప్రాప్తించు
hitch n అవరోధం అడ్డంకి; (దూ)ముడి; కుదుపు v ముడి వేయు/పెట్టు; తటాలున/కుదుపుతో కదులు
hitch one’s wagon to a star (పెద్దమనిషికి) అనుచరుడుగా ఉండు పెద్దవారితో సంబంధం పెట్టుకొను
hoard n దాచినద్రవ్యం సంచితం భండారం v కూడబెట్టు దాచిపెట్టు సేకరించు సంచయించు
hoarding సంచితం దొంగనిలువ; కంచె కరకట్ట పెద్ద ప్రకటనఫలకం
hoar-frost శ్వేతతుహినం
hoarse బొంగురు(గొంతు) డగ్గుత్తిక; కర్కశ (స్వరం)
hoary ప్రాచీన; ఆదరణీయ అనుభవశీల
hoax n ఛలం మస్కా ధూర్తత్వం v చలపెట్టు మస్కాకొట్టు; ధూర్తచమత్కృతిచేయు
hobby ఇష్టమైన పని సరదా
hodography వేగ లేఖనం
hoe పార తొల్లిక బొరిగ
hoist ఎగరవేయు
hold n పట్టు; పిడి ఆధారం; (ఓడ) పుట్ట v పట్టుకొను నిర్వహించు ఆధారపడి ఉండు
hold an office పదవిలో ఉండు
hold brief వకాల్తా పుచ్చుకొను
hold good అమల్లో ఉండు
hold in demesne భూస్వామి అగు స్వాధికారంలో ఉంచుకొను
hold on పట్టుకొని ఉండు పోనిచ్చు జరగనిచ్చు; ఆగు ఆపు
hold out ఇచ్చు వెల్లడించు హెచ్చరించు; ఆపివేయు; ప్రతిఘటించు లొంగకుండు
hold over వాయిదావేయు; (రాగం) సాగదీయు; (అధికారకాలానికి మించి) ఉద్యోగంలో కొనసాగు
hold together కలిపి ఉంచు
hold up నిలుపు నిలబెట్టు ఆపు నిలవరించు; ఆగు ఆగిపోవు సహించు భరించు మద్దతిచ్చు; ప్రకటించు ప్రదర్శించు
holder హక్కుదారు
holding కమతం సాగుభూమి వ్యవసాయభూమి
hole బిలం రంధ్రం ద్వారం
holiday సెలవు (దినం) పర్వదినం పండగరోజు; అవకాశం
holistic సమగ్రాకృతి స్ఫోట పూర్ణరూపాత్మక
hollocrystalline పూర్ణస్ఫటిక
hollow adj బోలుగా ఉన్న గుంటపడ్డ; బోలుగా మోగే; ఆకలిగొన్న; తప్పుడు ప్రయోజనశూన్య n బోలు రంధ్రం; లోయ గుంట v బోలగు తొలుచు
holocaust మారణహోమం
holologium కాలచక్రం
holophrastic సంశ్లేషణాత్మక
holy పవిత్ర పుణ్య
homage శ్రద్ధాంజలి
home adj స్వకీయ స్వదేశీ; గమ్యం చేరి ఇంటి ముఖం పట్టిన n ఇల్లు వసతి (గృహం) కుటుంబం బస
home gaurd స్వచ్ఛంద సైనికుడు
homeless నిరాశ్రయ వసతిలేని స్వదేశంలేని
home made ఇంట్లోచేసిన స్వదేశీయ సామాన్య సాధారణ
home member దేశీయాంగ మంత్రి దేశీయాంగశాఖాసభ్యుడు
home nursing రోగి పరిచర్యాగృహం
home rule స్వదేశీ ఉద్యమం
home spun ఇంట్లో వడికిన సాదా; ఖద్దరు
home training గృహశిక్షణ
homeopathy హోమియోపతి ఉమాపతి వైద్యం
homeostasis సమస్థితి
homicide నరవధ ప్రాణనష్టం; ఖూనీ
homily ధర్మోపదేశం
homocentric ఏకకేంద్రక
homocyclic సమవలయ సమవలయిత
homogeneity సజాతీయత
homogeneous సజాతీయ సమఘాతీయ
homologous సంగత సమానధర్మి
homonid మానవ సదృశ
homonymy సమరూపత
homophony సమధ్వనిత్వం
homophyllous సమపత్రయుతం
homorganic సవర్ణ
homorganic nasal వర్గానునాసికం పరసవర్ణం
homo sapiens మానవజాతి
homosexuality స్వలింగ సంపర్కం
homosporous సమసిద్ధ బీజవంతం
homospory సమసిద్ధ బీజత
homostatics సంతులిత స్థితి
homozygote సంగత/సంయుక్త బీజం
homozygous సమయుగ్మజం
honest సచ్ఛీల నిజాయితీ గల
honesty నిజాయితీ చిత్తశుద్ధి సచ్ఛీలత
honey తేనె మధువు
honey bee తేనెటీగ
honey comb తేనెపట్టు తేనెతుట్ట
honeymoon వివాహితుల ఏకాంత యాత్రా సమయం (పెండ్లి తరువాతి మొదటినెల)
honorarium గౌరవ భృతి/వేతనం
honorary గౌరవపూర్వక గౌరవార్థక నిర్వేతన
honorary citizenship గౌరవపౌర(స)త్వం
honorary degree గౌరవపట్టా
honorific పూజ్యార్థక(కం)
honour n గౌరవం ఆదర్శం; సన్మానం v సన్మానించు గౌరవించు ఆదరించు
honourable మాననీయ పూజ్య పూజనీయ గౌరవార్హ
honours గౌరవమర్యాదలు; పదవులు బిరుదులు
hood ఫణం పడగ
hoodwink కళ్ళుకప్పు కప్పు దాచు మోసగించు
hook కొక్కెం కొండి
hook worm కొంకిపురుగు
hooligan రౌడీ దాదా గూండా
hoot n ఈల గోల వెక్కిరింత; గుడ్లగూబ కూత/అరుపు v కూతకూయు అరుచు గోలపెట్టు; వెక్కిరించు
hop n గెంతు దూకు దుముకు v గెంతు దూకు ఎగురు
hope n ఆశ ఆధారం; నమ్మకం విశ్వాసం v ఆశించు నమ్ము విశ్వసించు
hopeful ఆశాజనక విశ్వసనీయ నమ్మగల నమ్మకం పుట్టించే
hopeless నమ్మకంలేని అవిశ్వసనీయ ఆశారహిత నిరాశాజనక
horde దళం గుంపు
horizon దిగంతం క్షితిజం దిక్చక్రం
horizontal క్షితిజ (సమాంతర) సమతల; అడ్డంగా నిలిచిన
horizontally అడ్డంగా క్షితిజ సమాంతరంగా
hormone హార్మోను
hormonious సుసంయోజిత
horn కొమ్ము శృంగం బాకా
hornet కందిరీగ
hornwort కొమ్ము మొక్క
horoscope జన్మ/జాతక పత్రిక
horrify భయపెట్టు భీతిగొల్పు
horror భయం భీతి
horse గుర్రం; వాహనం
horse artillery ఆశ్విక ఫిరంగిదళం
horse power అశ్వశక్తి
horse sense లోకజ్ఞానం మామూలు పరిజ్ఞానం
hoticulture తోటల పెంపకం ఉద్యాన శాస్త్రం
hose గొట్టం క్రోవి నాళం
hospitable ఆదరపూర్వక ఆమోదయోగ్య సత్కారశీల
hospital ఆసుపత్రి దవాఖానా వైద్యశాల
hospital leprosy కుష్టురోగుల ఆసుపత్రి
hospital maternity ప్రసూతి వైద్యశాల
hospital mental పిచ్చాసుపత్రి మానసిక వైద్యశాల
hospitality ఆతిథ్యం
host అతిథేయి
hostage బందీ; బంధనం; (ధనాదులకోసం) నిర్బంధితుడు; కుదువ తాకట్టు అడుమానం; హామీఖైదీ
hostel వసతిగృహం
hostess ఉపచారిక
hostile విరోధి ప్రతిపక్షి; విరుద్ధ వ్యతిరేక; ప్రతి ప్రతికూల
hostile witness ప్రతికూల సాక్షి/సాక్ష్యం
hostility ప్రాతికూల్యం విరోధం వైరం
hot adj వేడి తీవ్ర తీక్ష తాజా ఉద్రేకకారి n కారపు వస్తువు
hotbed (కృత్రిమ) నారుమడి; (వ్యసనాలకు) అనుకూల విషయం
hot house కాచగృహం మొక్కలు పెంచే (కృత్రిమ) గృహం
hot news తాజావార్తలు
hot process ఉష్ణప్రక్రియ
hot spring (=gyser) వేడినీటిబుగ్గ ఉష్ణకుండం ఉష్ణద్రవనిరరం
h otel హోటల్
hour గంట గడియారం; సమయం అవకాశం
hour hand చిన్నముల్లు
house n ఇల్లు గృహం భవనం సభ v నివసించు వసతి కల్పించు
house arrest గృహనిర్బంధం
household కుటుంబం సంసారం
house hold effects గృహసామగ్రి ఇంటి వస్తువులు
householder గృహయజమాని గృహస్థు
house magazine సంస్థాపత్రిక
house of cards పేకమేడ
house of commons దిగువసభ (ఇంగ్లండులో) కామన్స్సభ
house of ill fame వేశ్యాగృహం
house of lords ఎగువసభ (ఇంగ్లండులో) ప్రభువుల సభ లార్డుల సభ
house of people చట్టసభ
housewife గృహిణి ఇల్లాలు
housing board గృహనిర్మాణ మండలి
housing scheme గృహనిర్మాణ పథకం
housefly ఈగ
house-lizard బల్లి
hover గాలిలో చుట్టు తిరుగు ఉపరిభ్రమణం చేయు
howitzer చిన్న ఫిరంగి
hub ఇరుసు నాభి; నడిమిభాగం కేంద్రబిందువు
hubbub గగ్గోలు గలాభా గందరగోళం కోలాహలం
huckster చిల్లరవర్తకుడు కాలినడక బేరగాడు
hue వన్నె రంగు; కేక
hue and cry గలాటా ఆర్భాటం గలాభా కోలాహలం
huge పెద్ద విశాల భారీ బృహత్ బ్రహ్మాండమైన
hulla balloo గందరగోళం కొండగోల; వ్యాఘాతం
human adj మానవ మానవీయ మానుష n మనిషి మానవత్వంగలవ్యక్తి
human anatomy మానవశరీర నిర్మాణశాస్త్రం
human interest జనాసక్తి
human interest story మానవతా వార్త
human physiology మానవశరీర శాస్త్రం
human ware మానవ సామగ్రి
humane మానవతగల దయాళు కృపాళు సహృదయ శిష్ట సభ్య దయామయ మానవోచిత
humanism మానవతావాదం మానవత్వం
humanist మానవతావాది
humanitarian కరుణామయ ఉపకారి
humanitarianism జీవకారుణ్యవాదం
humanities మానవీయ/మానవ విజ్ఞాన శాస్త్రాలు
humanity మానవజాతి మానవత్వం
humble adj అణకువగల వినయంగల v పొగరు తీయు; కించపరచు న్యూనపరుచు
humbug adj కపట n కపట(త్వం) మోసం; కపటి
humdrum మందకొడి నీరస నిరుత్సుక; బోరుకొట్టే (వ్యక్తి) సుత్తి
humerus దండఎముక
humid తేమగల ఆర్ద్ర
humidity తేమ తడి చెమ్మ; గాలిలో తేమ/చెమ్మ ఆర్ద్రత
humiliate చిన్నబుచ్చు అవమానించు అగౌరవించు
humiliation అవమానం అమానుషం అగౌరవం
humility అణకువ వినయం నమ్రత
humorist విదూషకుడు హాస్యగాడు
humour n హాస్యం నవ్వు వినోదం; దేహరసం v నవ్వించు నవ్వులాడు వినోదం కలిగించు; ప్రసన్నుని చేసుకొను
humourous హాస్యప్రియ నవ్వుపుట్టించే
hump డబ్బు; గూని
hump-backed వంగిన గూని
humus ఆకుపెంట పచ్చి ఎరుపు పచ్చిపెంట
hunger ఆకలి
hunger-pain ఆకలి నొప్పి/బాధ
hungry ఆకలిగొన్న
Huns హూణులు
hunt n వేట వెదుకులాట v వేటాడు వెతుకు వెదుకులాడు
hunting ground వేటభూమి మృగయాస్థలం
hunter వేటగాడు
hurdle అడ్డు అడ్డంకి అవరోధం; గెంతు దాటు దూకు అధిగమించు
hurl విసరివేయు దొర్లించు
hurly-burly ఆదరాబాదరా(గా) గందరగోళంగా; ఉపద్రవం కోలాహలం
hurrah వహవ్వా!
hurricane తుఫానుగాలి చక్రవాతం గాలివాన
hurried త్వరిత శీఘ్ర
hurriedly త్వరత్వరగా శీఘ్రంగా వేగంగా ఆదరాబాదరా
hurry n త్వర వేగం శీఘ్రత; జళీ v త్వరితంగా చేయు తొందరపెట్టు శీఘ్రతరం చేయు
hurt n దెబ్బ గాయం హాని కీడు; అపకారం v దెబ్బకొట్టు గాయపరచు చెడగొట్టు చెరచు
husband n భర్త పెనిమిటి మగడు; స్వామి యజమాని v మితవ్యయంతో నిర్వహించు సంరక్షించు; సాగుచేయు
husbandman వ్యవసాయదారు రైతు కాపు సేద్యగాడు
husbandry కృషి వ్యవసాయం; జాగరూక నిర్వహణ/యాజమాన్యం; సంసార నిర్వహణ
hush n నిశ్శబ్దం శాంతి v దాచిపెట్టు శాంతపరచు; నిశ్శబ్దంగా ఉండు/ఉంచు
hush-hush enquiry దొంగ/నామమాత్ర విచారణ రహస్య విచారణ
hush money లంచం
hush up దాచిపెట్టు రహస్యంగా ఉంచు నోరు మూయించు
hustle n వేగం శీఘ్రత త్వర v త్వరగా శక్తితో పనిచేయు నెట్టుకొనిపోవు; గెంటివేయు అమర్యాదగా తోసివేయు
hut గుడిసె కుటీరం
hutment చిన్న గుడిసె/ఇల్లు; తాత్కాలిక నివాసం
hyacinth గోమేధం
hyaline తేటఅయిన తేరిన
hybrid సంకర(రం) మిశ్రజాతి
hybrid computer మిశ్ర(జాతి) గణకయంత్రం
hybridization సంకరీకరణం మిశ్రీకరణం; విజాతీయ గర్భోత్పాదనం
hydra అజగరం
hydramnios గర్భసంచిలో ఉమ్మనీరు ఎక్కువగా చేరటం
hydrargyrum పాదరసం
hydrate సార్ద్ర(పదార్థం)
hydrated సార్ద్ర
hydration ఆర్ద్రీకరణం
hydraulic ద్రవ/జల శక్తితో కదిలే జల(శక్తి) చాలిత; జలోత్పీడన(నం)
hydraulic press ద్రవ/జలశక్తి చాలిత యంత్రం
hydraulics ద్రవ/జల యంత్రశాస్త్రం
hydric ఉదజ
hydrocarbons సజలకర్బనాలు
hydrocele వరిబీజం బుడ్డ
hydrocephalics సజలకపాలురు
hydrocephalus సజలశీర్షం
hydrodynamics ద్రవ గతిశాస్త్రం
hydro-electric జలవిద్యుత్ (సంబంధి)
hydro-electric work జలవిద్యుత్కర్మాగారం
hydroelectricity జలవిద్యుత్తు
hydrogen ఉదజని
hydrogenation ఉదజనీకరణం
hydrogeological జలభౌమ
hydrogeo morphology జలభూస్వరూప శాస్త్రం
hydrogode రుణధ్రువం
hydrology జలవాతావరణశాస్త్రం
hydrological regime జలవాతావరణ పాలన/విధానం
hydrolysis జలవిశ్లేషణం
hydrolytic జలహర
hydromechanics జలయాంత్రికశాస్త్రం జల యంత్రవిజ్ఞాన(శాస్త్రం)
hydrometer ద్రవమాపకం జలమాపకం
hydronephrosis మూత్రపిండంలో నీరు చేరటం
hydropathy జలచికిత్స
hydrophily జల పరాగసంపర్కం
hydrophobia జలభీతి జలభయం నీళ్ళభయం
hydrosalt ఉదజ లవణం
hydrosphere జలావరణం
hydrostatics ద్రవస్థితిశాస్త్రం
hydrothorax ఉరఃకుహరంలో నీరు చేరిక
hydrotropism జలాభిసరణం
hydrous సజల
hydroxide క్షారం
hyetal దృష్టి విషయక
hyetography దృష్టివిషయశాస్త్రం
hygiene ఆరోగ్య విజ్ఞానం/శాస్త్రం; ఆరోగ్యరక్షణ; పారిశుధ్యం పరిశుద్ధత
hygrometer ఆర్ద్రతామాపకం
hygrometry ఆర్రతామాపనశాస్త్రం
hygroscope ఆర్ద్రతాదర్శిని
hygroscopic ఆర్ద్రతాకర్షక
hymen కన్నెపొర
hymen imperforate బెజ్జంలేని కన్నెపొర
hymn రుక్కు మంత్రం సుత్తి; శ్లోకం కీర్తన
hypabyssal అతలస్థిత
hypalgesia మొద్దుబారటం
hypanthodium వృంతపరిణామ సమూహ ఫలం
hyper అతి(శయిత) అధిక అత్యంత
hyperacidity జఠరాధికామ్లత అత్యామ్లత్వం
hyperactivity అతిక్రియాశీలత
hyperanemia అతి/అధిక రక్తహీనత
hyper cholesterolaemia రక్తంలో కొవ్వు ఎక్కువకావటం
hyper correction అతిశోధనం
hyper pyrexia అతి(తీవ్ర)జ్వరం
hyper sensitivity అతిగ్రాహకత్వం
hyper urbanism అతినాగరకత్వం/అతినాగరక పదం/శబ్దం
hyperaesthesia స్పర్శాతిరేకం
hyperaesthesis అధిక సంవేదన(నం)
hyperalgesia అధికార్తి సంవేదన(నం)
hyperanthera moringa మునగ
hyperbola అతిపరావలయం
hyperbole అతిశయోక్తి అత్యుక్తి
hyperboloid అతిపరావలయాభం
hyperemesis అతి వమనం
hypergeusia అధికరుచి
hypermetropia దూరదృష్టి
hyperplasia అతివృద్ధి
hypertension నరాలబిగువు; రక్తపోటు
hyperthyroidism థైరాయిడ్ గ్రంథి అతిక్రియ
hypertrophy అత్యంత వృద్ధి
hyphae పోగులు తంతువులు
hypnosis యోగనిద్ర; సమ్మోహనం
hypnotic సమ్మోహక; నిద్రమందు
hypnotised సమ్మోహిత
hypnotism సమ్మోహన(విద్య) వశీకరణశక్తి కనుకట్టు
hypo అల్ప లఘు; అథః అంతః
hypochlorhydria లఘుజఠరామ్లత
hypochondria రోగభ్రమ స్వశరీరదుశ్చింత
hypochondriasis రోగభ్రమ
hypocotyl అధోదళం
hypocrisy కపటత (నయ)వంచన ఛలం మిథ్యాచారం
hypocrite (నయ)వంచకుడు కపటి
hypocrystalline అర్ధస్ఫటికాకార
hypocycloid అల్పచక్రాభాసం
hypoderm అంతశ్చర్మం
hypodermic చర్మంకింది
hypogastrium అధోజఠర ప్రవేశం
hypogene నిగూఢ
hypogeusia అల్పరుచి
hypoglossal అధోజిహ్వ
hypoglycaemia రక్తంలో గ్లూకోజ్ మాంద్యం
hypogonadism జననగ్రంథి మాంద్యం
hypopharynx అల్ప సప్తపథ
hypophyseal పిట్యూర్ సంబంధి
hypospadias అధశ్శిశ్న మూత్రమార్గం
hypotension అల్ప రక్తపోటు
hypotenuse కర్ణం
hypothecate తాకట్టు/కుదవ/అడుమానం పెట్టు
hypothecation తాకట్టు కుదవ అడుమానం
hypothesis ప్రాక్కల్పన పరికల్పన ఉపకల్పన ఊహ వాదం
hypothetical కల్పిత కాల్పనిక ఊహాత్మక అనుమానిత సోపాధిక ప్రాక్కల్పిత పరికల్పిత
hypothyroidism క్షీణగ్రైవేయకత్వం థైరాయిడ్ గ్రంథి మాంద్యం
hypotrochoid అతిత్రిచ్ఛేదం
hypsometer ఉన్నతి మాపకం
hysterectomy గర్భాశయం తొలగింపు/తీసివేత
hysteria అపస్మారం కాకిసొమ్మ మూర్ఛ
hysterics మూర్ఛితులు అపస్మృతులు
house of lords (బ్రిటన్లో) ఎగువసభ
high minded ఉదారచిత్తుడయిన
hit the nail on the head సరైన మాటచెప్పు/పనిచేయు
have a narrow escape కొద్దిలో తప్పు మృత్యుముఖంనుంచి తప్పించుకొను
have no patience with సహించకుండు ఓర్వలేకపోవు
hold one's peace ఊరకుండు పలకకుండు
have a finger in the pie జోక్యం/వశం చేసుకొను
hold in pledge బంధనలో ఉంచు బంధించు
horse power అశ్వశక్తి
heir presumptive సంభావ్యవారసుడు
harmonic progression హరాత్మక పురోగతి/శ్రేణి/అనుపాతం
hold the purse strings జాగ్రతగా ఖర్చు చేయు అదుపులో ఉంచు
health resort ఆరోగ్య ప్రదేశం/కేంద్రం
have one's say తుదినిర్ణయం తీసుకొను; అధికారం చెలాయించు
high school ఉన్నత పాఠశాల
have a screw loose మతిచలించు తలతిక్కగా ఉండు
have a close shave (గండం) తప్పించుకొను
have a near shave వెంట్రుకవాసిలో తప్పిపోవు
horse show అశ్వప్రదర్శన
have something up one's sleeve సిద్ధంగా ఉండు
have a smooth passage సుఖప్రయాణం చేయు ఇబ్బంది లేకుండు
have a strong hold upon గట్టి ప్రభావం కలిగి ఉండు
hang by thread సంకట స్థితిలో ఉంచు/ఉండు
high tide పోటు
have on the finger tips కరతలామలకంగా తెలిసి ఉండు స్పష్టంగా తెలిసి ఉండు అందుబాటులో కలిగి ఉండు
have on the tip of one's tongue నాలుకమీద ఉండు నోటికి వచ్చు
hold one's tongue నోరుమూసుకొను మాట్లాడకుండు
have no truck with సంబంధం/పొత్తు పెట్టుకొనకుండు
hang by the wall పనికిరాకపోవు
hold water రుజువగు నిలబడు నిజమగు
heat wave వడగాలి వడగాడ్పు
have one's way తోచినట్లు/ఇష్టం వచ్చినట్లు నడుచు/వ్యవహరించు
have the whip hand of అన్నీ చేయంచగలుగు అన్నీ చేతిలో ఉండు శక్తి ఉండు
have a word with మాట్లాడు సంభాషించు
have words with పోట్లాడు జగడం పెట్టుకొను
have wrong తప్పగు అన్యాయమగు