K

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
keep up appearances నటించు, పైకి కనబడు
keep in check అదుపులో ఉంచు
keep in the dark దాచిపెట్టు, మరుగుపరచు
keep an eye on దృష్టి ఉంచు/నిలుపు; ధ్యానించు
k.orbit కె. కక్ష్య
kala azar కాలజ్వరం
kaleidoscope చిత్రదర్శిని
kaleidoscopic రంగురంగుల, చిత్రవిచిత్రమైన, చక్కని, సుందర
kaleidoscopic morph బహురూప సపదాంశం
kamikage ఆత్మాహుతిదళం
kangaroo ఆస్ట్రేలియా పౌరుడు; ఒక క్షీరద జంతువు
kanjolojuple జీవాణుద్రవం
kankar కంకర, గులక
kanyoplasm జీవాణుద్రవ్యం
kapok బూరుగుదూది
katabolism విచ్ఛిన్న క్రియ
kathode రుణధ్రువం
kation (cation) ధనాయానం; ధన-అయాన్
keel (ఓడ) వెన్ను పలక
keel (petals) ద్రోణీదళం
keelage (ఓడను నిలిపినందుకు చెల్లించే) రేవు రుసుము
keen చురుకైన, వాడియైన, తీవ్ర, తీక్ష ; చతుర
keen competition తీవ్రమైన పోటీ
keenly చురుగ్గా, వాడిగా, తీవ్రంగా, ఉత్సుకతతో
keenness ఉత్సుకత, తీవ్రత, తీక్ష త, వాడి, కుశాగ్రత
keep n కోట, దుర్గం; సంరక్షణ, కావలి, పహరా; బత్తెం, మేత; (కొండమీది) చెరసాల; ఉంపుడుగత్తె v దాచు, అట్టిపెట్టు, పెట్టు, నడుపు, పూర్తిచేయు, పెంచు, పోషించు, ఉంచుకొను; రక్షించు, ఆచరించు, నిలుపు, ఉండు
keep away దూరంగా ఉంచు
keep back అట్టిపెట్టుకొను; వెనుజిక్కు; ఒత్తిగిలు
keep command అధికారం/నాయకత్వం నిలుపుకొను
keep in touch తెలివిడిలో ఉండు, తెలుసుకొను
keep off దూరంగా ఉండు/ఉంచు; తొలగు, తొలగించు
keep pace పోటీలో ఉండు, పోటీపడు
keep to భరించు, బద్ధపడు, కట్టుబడి ఉండు; అంటిపెట్టుకొని ఉండు
keep track of జాడగుర్తించు; నిలుపుకొను, నిర్వహించు
keeper కావలివాడు, (సం)రక్షకుడు
keeper, magnet అయస్కాంత రక్షకం
keeping స్వాధీనం; పాలన, అధికారం; సంరక్షణ, కావలి; అనుగుణ్యత
keepsake స్మృతి/జ్ఞాపక చిహ్నం
ken చూపు, దృష్టి, జ్ఞానం, పరిచయం
kenesion revolution కీన్స్ ప్రేరిత విప్లవం
kennel కుక్కలదొడ్డి; మురికికాలవ
keratitis శుక్లపటలశోథ
keratomalacia శుక్లపటల మృదుత్వం, శుక్ల పటలం మెత్తబడటం
keratoplasty శుక్లపటలం అంటుపెట్టడం
keratotomy శుక్లపటలచ్ఛేదనం
kerb బాటపక్క కాలిబాట
kernel ఆధారం; గింజ, గుజ్జు, పప్పు; తత్వం, సారం, సారాంశం, అసలు విషయం; గర్భం; కొబ్బరి; మొలక; గవద
kerophthalmia కంటి మసక
ket fuffle వాగ్యుద్ధం; పోట్లాట
kettle నీళ్లుకాచే పాత్ర
key n కీలకం, తాళంచెవి; చిక్కుతీసే సాధనం; మర చుట్ట/మీట; బిరడా, (సంగీతంలో) స్వరం; ఆయువుపట్టు v సరిపెట్టు, (సరైన) స్థితికి తెచ్చు, సరిచేయు; (సంగీతంలో) శ్రుతి సవరించు/సరిదిద్దు, తాళం వేయు
keyboard కీలక ఫలకం
keyboard entry కీలక ఫలక ప్రవేశనం
key industry ముఖ్య/మౌలిక/కీలక పరిశ్రమ
key minimum set కీలక కనిష్ఠ సమితి
key note ప్రధానసూత్రం, మూలభావం; (సంగీతంలో) ముఖ్యస్వరం
key note address కీలకోపన్యాసం
key projects కీలక/ప్రధాన పథకాలు
key stone మూలరాయి; మూల విషయం; అసలు విషయం, మౌలిక సిద్ధాంతం/సూత్రం
key village కీలక గ్రామం
key word కీలక/సంకేత శబ్దం, కీలకాంశం
keynesian economics కీన్స్ ప్రేరిత అర్థశాస్త్రం
kharif crop ఖరీఫ్ పంట
khondalite కట్టుడురాయి
kick n తన్ను, తాపు v తన్ను; అడ్డం చెప్పు
kicker విక్షేపకం
kick off ప్రారంభించు; (ఆర్భాటంగా)/మొదలుపెట్టు
kick the bean ఓడిపోవు, వీగిపోవు
kidnap అపహరణ, దొంగిలింత; (వ్యక్తులను) అపహరించు, దొంగిలించు
kidnapping అపహరణ
kidney మూత్రపిండం
kill చంపు, ప్రాణంతీయు, వధించు, సంహరించు, నష్టపరచు, చెరచు, విరచు
killjoy సంతోషధ్వంసకుడు, పుల్లవిరుపు మాటల వాడు; సుఖనిరాసకం
kiln ఆవం, బట్టీ, సూల, కాళవాయి
kin దాయాది, జ్ఞాతి, సగోత్రుడు, బంధువు, సంబంధి; పరిచితులు, సజాతీయులు
kind adj దయగల, దయాళు n తరగతి, జాతి, భేదం, రకం, విధం, ప్రకారం, తీరు, రీతి
kindergarten శిశుపాఠశాల, బాలశిక్షణాలయం
kindle రగిలించు, వెలిగించు; ప్రేరేపించు
kindred సజాతి, సంబంధి
kinematics శుద్ధగతిశాస్త్రం
kinesics భాషేతరభావప్రకటన
kinetic గతిజ, గతి సంబంధి
kinetics గతి శాస్త్రం/విజ్ఞానం
kinetic theory వస్తుగతి సిద్ధాంతం
king-cobra నాగరాజు
kingdom రాజ్యం; జాతి, ప్రపంచం
king emperor రాజరాజు, రాజాధిరాజు, చక్రవర్తి, సమ్రాట్టు, సార్వభౌముడు
kingfisher లకుముకి (పిట్ట)
kingpin ప్రముఖవ్యక్తి, ప్రధాన విషయం/వస్తువు
kingship రాజత్వం, రాచరికం, దొరతనం
kinking వంకర తిరగటం
kinsfolk చుట్టాలు, బంధువులు
kinship బంధుత్వం, సంబంధం, సగోత్రులు, స్వజనం
kinship term బంధుత్వబోధకపదం
kiosk బడ్డీ (కొట్టు/దుకాణం)
kit మూటాముల్లె, సామాను, సామగ్రి
kitchen వంట ఇల్లు
kitchen cabinet ఆంతరంగిక మంత్రివర్గం
kitchen garden పెరటితోట
kite గాలిపటం, పతంగి; గద్ద, గరుడపక్షి
kith and kin చుట్టపక్కాలు, ఆత్మీయులు
kleptomania చౌర్యోన్మాదం; అకారణంగా దొంగిలించే ప్రవృత్తి
knack ఉపాయం, యుక్తి, కౌశలం, నేర్పు, చతురత, చాతుర్యం
knave మాయలమారి, కపటి, దొంగ, వంచకుడు, విశ్వాసద్రోహి, నీచుడు; (పేకాటలో) జాకీ
knavery వంచన, ధూర్తత్వం, కాపట్యం, మోసం, దగా, పితలాటకం, టక్కు
kneading మెదపటం, మర్దించటం
knee మోకాలు
kneel మోకరిల్లు
knell గంట; గంటవాయించు
knick-knack చిల్లర/చిన్న వస్తువులు/సామాను, గుల్లాగుట్ర
knife కత్తి
knife, cataract కంటి శుక్లం/పొర తొలగించే కత్తి
knight యోధుడు
knit అల్లు, నేయు; కట్టు, జోడించు కలుపు, చేర్చు
kniting ఉన్ని అల్లకం
knob పిడి, ముడి; గుబురు, గుబ్బ, గుబక, కాయ
knock తట్టు, కొట్టు, పడగొట్టు, రాలగొట్టు, దెబ్బ; (తలుపు) తట్టడం
knock against ఒక వస్తువును మరో వస్తువుతో కొట్టు
knock down కొట్టి కిందపడవేయు; (వేలం పాటలో) పాట కొట్టివేయు; హఠాత్తుగా ధర తగ్గించు
knock-knee గాడిద కాళ్ళు
knock out ఓడించు, కొట్టిపంపించు; (వేలం పాటలో) పోటీ లేకుండా చేసుకొను; పడగొట్టు
knock the bottom out of ఆధారం తొలగించు
knot చిక్కు, ముడి, కణుపు, గుబురు, గుంపు; (సముద్రమార్గంలో) ఒక మైలు (సుమారు ౬౦౮౦ అడుగులు)
knotty చిక్కుపడ్డ, ముళ్ళుపడ్డ, కఠిన; ముళ్ళున్న, బుడిపెలున్న
know n ఎరుక, తెలివిడి; వార్త, జ్ఞానం v తెలుసుకొను, గుర్తించు
know-all సర్వజ్ఞ, అన్నీ తెలిసిన, అన్నీ తెలుసని చెప్పుకునే
know-how ప్రత్యేక నైపుణ్యం; పరిజ్ఞానం
knowingly తెలిసి తెలిసి, తెలిసి కూడా, బుద్ధి/జ్ఞాన పూర్వకంగా
knowledge ఎరుక, తెలివి, జ్ఞానం, విద్య; పరిచయం, ప్రావీణ్యం
knowledge acquistion జ్ఞానసాధన
knowledge base విజ్ఞతాధారం
knowledge society విజ్ఞసమాజం
knuckle మెటిక, వేలికణుపు
kodex millet ఆరికలు
koilon cyhia చంచావంటి గోళ్ళు
kondo (బౌద్ధాలయంలో) ఆరాధన స్థలం
krait కట్లపాము
krayrosis, vulvae స్త్రీమర్మావయవపు క్రోరోసిస్
kryoscopy హిమాంకమాపనం
kudos ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ఠ, గౌరవం, యశస్సు
kyphosis గూని(తనం)
keep in mind జ్ఞాపకముంచుకొను
know one's mind స్పష్టంగా తెలుసుకొను
know one's own mind స్వబుద్ధితో ప్రవర్తించు
keep step with a person కలిసి అడుగువేయు
keep tab on ఒక కన్నువేసి ఉంచు, కనిపెట్టి ఉండు, నిఘాలో ఉంచు
keep in touch సంబంధం కలిగి ఉండు, తెలుసుకొను
keep track జాడ తెలుసుకొను/చూపించు
keep head above water కష్టాలనుంచి గట్టెక్కు
keep one's weather eye open జాగరూకంగా/ఆత్మరక్షణలో ఉండు